collection agent
-
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
మెట్రో రైలు డబ్బుతో ఉద్యోగి పరారీ
మెట్రో రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన వ్యక్తి.. ఆ డబ్బు తీసుకుని ఎంచక్కా పరారయ్యాడు. ఢిల్లీ మెట్రోరైలుకు చెందిన రూ. 50 లక్షలతో అతడు చెక్కేశాడు. నీరజ్ అనే ఆ వ్యక్తి మెట్రో స్టేషన్లన్నింటి నుంచి డబ్బు సేకరించి.. దాన్ని భికాజీ కామా ప్లేస్ ప్రాంతంలో ఉన్న బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయాలి. ఈనెల 16న అతడు ఏడు స్టేషన్ల నుంచి డబ్బు సేకరించాడు. కానీ దాన్ని బ్యాంకులో జమచేయడానికి బదులు ఉన్నట్టుండి మాయమైపోయాడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉద్యోగ్ భవన్ మెట్రోస్టేషన్ నుంచి డబ్బు సేకరించి, హుడా సిటీసెంటర్ వెళ్లే రైలు ఎక్కాడు. అతడు ఎయిమ్స్ స్టేషన్‌కు వెళ్తే, అక్కడ అతడి కోసం ఒక ఎస్కార్టు వాహనం ఉంటుంది. దాంట్లో అతడు బ్యాంకుకు వెళ్లాలి. కానీ అతడు మాలవీయ నగర్ స్టేషన్లోనే దిగిపోయి, అక్కడి నుంచి మాయమైపోయాడు. అప్పటికి అతగాడి వద్ద మూడురోజుల నుంచి సేకరించిన రూ. 50 లక్షల సొమ్ము ఉంది. సాధారణంగా అయితే మూడు రోజులకు రూ. 12 లక్షలు మాత్రమే వస్తుంది. కానీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడంతో జనం ఎక్కువ తిరగడం వల్ల టికెట్ల డబ్బులు కూడా బాగా వచ్చాయి. అదిచూసి ఆశపడిన నీరజ్.. ఆ డబ్బుతో ఎంచక్కా చెక్కేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన అతగాడి కోసం గాలింపు మొదలైంది.