collectors report
-
Pawan Kalyan: జనవాణా.. విషవాణా?
సాక్షి, అమరావతి: ‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు. నిరాధార ఆరోపణలతో నిందలకు దిగారు. ఈ ఉదంతంపై తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పూర్తి వివరాలను నివేదించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం తారకరామనగర్‌లో ప్లాటు నంబరు 2400 వెనుక వాస్తవాలను కలెక్టర్ నివేదిక బహిర్గతం చేస్తోంది. కొనసాగుతున్న విచారణ.. 2004లో అనిత అనే మహిళకు ఇంటిపట్టా కేటాయించిన ప్రభుత్వం 6 నుంచి 12 నెలల్లోగా ఇల్లు లేదా గుడిసె నిర్మించుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది. అదే ప్రాంతంలో గుడిసె లేదా ఇల్లు కట్టుకోని 989 మంది ప్లాట్ల లబ్ధిదారులకు 2018లో టీడీపీ హయాంలో నోటీసులు జారీ అయ్యాయి. లబ్ధిదారులనుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్లాట్లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించారు. కాగా ప్లాటు నంబరు 2400ని వి.వెంకటేష్ అనే వ్యక్తికి కేటాయిస్తూ చంద్రబాబు హయాంలో తహశీల్దార్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ జారీచేశారు. అదే సమయంలో 3 వేల మందికి ఆ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఒకేసారి అంతపెద్ద ఎత్తున సర్టిఫికెట్లు జారీ కావడంపై చిత్తూరు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈలోగా ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ పొందిన వెంకటేష్ ఆ ప్లాటులో షెడ్డు నిర్మించుకుని ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు. షెడ్డు నిర్మాణ సమయంలో అనిత, వెంకటేష్‌ల మధ్య వివాదం తలెత్తింది. అనిత షెడ్డును ఆక్రమించుకోవడంతో ఆమెపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనిత నుంచి షెడ్డును స్వాధీనం చేసుకున్న వెంకటేష్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించాడు. వెంకటేష్ బీసీ సామాజిక వర్గం బోయ కులానికి చెందిన వ్యక్తి. దొడ్లమిట్టలో ఓ కూల్డ్రింకు షాపులో కూలీగా పని చేస్తున్న వెంకటేష్‌తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధంలేదు. వాస్తవాలు ఇలా ఉండగా వాటిని మరుగున పరిచి ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు పవన్‌కళ్యాణ్ ప్రయత్నించారు. విజయవాడలో జనవాణి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ అంశాన్ని వీడియో తీసి అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంచేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. Timeline of Plot No.2400 2004: 6700 house sites pattas granted to eligible beneficiaries of Tirupati Urban Mandal. 2018: 989 of those were canceled by the then Tahsildar, the Plot No.2400 was among them (as no objection was received) 1/6 https://t.co/tY4AKl0vVB pic.twitter.com/gqy8q8HOKy — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 11, 2022 -
కొలమానాలే కొంపముంచాయి
నిబంధనల వల్లే తగ్గిన కరువు మండలాల సంఖ్య రాష్ట్రంలో 217 మండలాల్లో వర్షాభావం వాస్తవ పరిస్థితిని వివరించిన కలెక్టర్లు సాగు విస్తీర్ణం, ఎన్‌డీవీఐ, ఎన్‌డీడబ్ల్యూఐ అంచనాల వల్లే సమస్య వాస్తవాలను పక్కనపెట్టి కరువును నిర్ధారించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాల నిర్ధారణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 66 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే కలెక్టర్లు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులను సర్కారుకు నివేదించారు. వర్షాభావం, వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్), తగ్గిన సాగు విస్తీర్ణం ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో మండలాల సంఖ్యను పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల దిగుబడి ఇంకా రానందున ఆ అంశాన్ని వదిలేశారు. కానీ కలెక్టర్లు పంపిన ఈ వివరాలకు సర్కారు నిబంధనలను జోడించడంతో కరువు మండలాల ప్రకటన పక్కదారి పట్టింది. కరువు మండలాల సంఖ్య అత్యల్పంగా 66కే పరిమితమైంది. వాస్తవాలు పక్కదారి: కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో వర్షాభావ మండలాలు 217 ఉన్నాయి. డ్రైస్పెల్ ఉన్న మండలాలు 152 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 42 డ్రైస్పెల్ మండలాలున్నాయని ఆ జిల్లా కలెక్టర్ నివేదించారు. సాగు విసీర్ణం 50% కంటే తగ్గిన మండలాలు రాష్ట్రంలో కేవలం 31 ఉన్నట్లుగా కలెక్టర్ల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే కొంప ముంచింది. వాస్తవంగా జూన్‌లో వర్షాలు విస్తారంగా కురవడంతో పెద్ద ఎత్తున పంటల సాగు ప్రారంభమైంది. మొత్తంగా ఖరీఫ్‌లో 86% సాగు జరిగింది. పత్తి 104%, సోయాబీన్ 142% జరి గింది. దీంతో 50% కన్నా సాగు విస్తీర్ణం తగ్గిన మండలాలు 31 మాత్రమే నమోదయ్యాయి. కరువు మండలాల ప్రకటనకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. వీటితో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ 269 మండలాల్లో కరువు ఉన్నట్లుగా చెప్పి నా.. అందులో తీవ్రతను బట్టి 73 మండలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్డీడబ్ల్యుఐ)ల ప్రకారం రాష్ట్రంలో కరువు మండలాలను తక్కువగా చూపింది. కలెక్టర్లు పంపిన మూడు అంశాలతోపాటు వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్డీడబ్ల్యుఐల అంచనాలను కలిపి పరిశీలించారు. దీంతో కరువు మండలాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వ్యవసాయ వర్సిటీ, ఎన్‌డీవీఐ, ఎన్డీడబ్ల్యుఐలను పక్కన పెడితే కరువు మండలాల సంఖ్య ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. ఒకవేళ సాగు విస్తీర్ణంపరంగా చూసినా... జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావంతో పంటలన్నీ సగానికిపైగా ఎండిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే నూటికి నూరు శాతం దెబ్బతిన్నాయి. దీనిని బట్టి సాగు విస్తీర్ణం వంటి సాంకేతిక అంశాలు కాకుండా వాస్తవ పరిస్థితిని బట్టి కరువు అంచనా వేస్తే బాగుండేది. కానీ సర్కారు నిబంధనల సాకుతో వాస్తవాలను మరుగున పెట్టిందన్న ఆరోపణలు వస్తున్నాయి. -
కరువు మండలాలు అరవై ఆరేనా?
-
కరువు మండలాలు అరవై ఆరేనా?
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కలెక్టర్లు అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 35.. తక్కువగా మెదక్‌లో 13 మండలాలు సర్కారు చెప్పినట్లుగా కలెక్టర్లు నివేదిక తయారుచేశారన్న విమర్శలు 269 మండలాల్లో కరువు ఉందన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం 217 మండలాల్లో తీవ్ర వర్షాభావముందన్న వాతావరణ శాఖ సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం.. వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు... వందలాది మంది రైతుల ఆత్మహత్యలు.. సాగుకే కాదు కొన్ని ప్రాంతాల్లో తాగునీటికీ కరువే. ఇదీ రాష్ట్రంలో కరువు పరిస్థితుల బీభత్సం. కానీ రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో మాత్రమే కరువు నెలకొందంటూ జిల్లా కలెక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ఈమేరకు తాజాగా సర్కారుకు నివేదిక సమర్పించారు కూడా. అయితే 217 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని వాతావరణ శాఖ, 269 మండలాల్లో కరువు ఉందని వ్యవసాయ యూనివర్సిటీలు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. కానీ 9 జిల్లాల్లోని 443 మండలాల్లో కేవలం 66 మండలాల్లోనే కరువు ఉందంటూ జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సర్కారు పెద్దల అభీష్టం మేరకే కరువు మండలాల సంఖ్యను బాగా తగ్గించి చూపారన్న ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ల నివేదికను రాష్ట్రస్థాయి కరువు పర్యవేక్షణ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత కేంద్రానికి అందజేస్తారు. కరువు మండలాల సంఖ్యను తక్కువగా చూపడం వల్ల అన్నదాతకు అందాల్సిన సాయం దూరం కానుంది. ఫలితంగా ఆత్మహత్యలు పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కలెక్టర్లు సర్కారుకు అందజేసిన నివేదిక వివరాలను వ్యవసాయాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. పాలమూరులో అత్యధికంగా.. కలెక్టర్ల నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలోని 64 మండలాల్లో అత్యధికంగా 35 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. వాస్తవానికి జిల్లా మొత్తాన్ని కరువుగా ప్రకటించాలని అధికారులు అంతర్గత నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇక సీఎం జిల్లా మెదక్‌లో 46 మండలాలకు కేవలం 13 మండలాల్లోనే కరువు చూపారు. ఇక్కడా జిల్లా మొత్తం కరువు ప్రకటించాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కడా కరువు ఛాయలే లేవని తేల్చారు. కరీంనగర్ జిల్లాలో 40 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని అంతర్గత నివేదికలు చెబుతుంటే... 3 మండలాలకే పరిమితం చేశారు. వాస్తవానికి వాతావరణశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 217 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను లెక్కలోకి తీసుకోకుండా సాంకేతిక, రాజకీయ కారణాలతో సంఖ్యను తక్కువ చేసి చూపారన్న విమర్శలున్నాయి. ఇక జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం శాటిలైట్ చిత్రాల ఆధారంగా కరువు మండలాలను ధ్రువీకరించినట్లు తెలిసింది. వారు 269 మండలాల్లో ఒక మోస్తరు నుంచి తీవ్ర కరువు ఉందని తేల్చినట్లు సమాచారం. కలెక్టర్లు నిర్ధారించిన కరువు మండలాలు.. ఆదిలాబాద్: లక్ష్మణచాంద, మామ్దా (2) నిజామాబాద్: మోర్తాడ్ (1) రంగారెడ్డి: శేరిలింగంపల్లి, బాలానగర్, శామీర్‌పేట్, ఉప్పల్, దోమ, మంచాల్, కందుకూర్ (7) మహబూబ్‌నగర్: దామరగిద్ద, మద్దూరు, బాలానగర్, కొందుర్గు, కొత్తూరు, తలకొండపల్లి, ఆమనగల్, మాడ్గుల్, వంగూర్, వెల్దండ, కల్వకుర్తి, మిడ్జిల్, జడ్చర్ల, భూత్పూర్, చిన్నచింతకుంట, పెద్దమందాడి, ఘన్పూర్, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తాడూర్, తెల్కపల్లె, ఉప్పునుంతాల, అచ్చంపేట, బల్మూర్, లింగాల్, పెద్దకొత్తపల్లి, కొడేర్, గోపాల్పేట, వనపర్తి, పెబ్బేరు, దారూర్, మల్దకల్, అయిజా, వడ్డేపల్లి, ఇటిక్యాల (35) నల్లగొండ: బొమ్మలరామారం, భువనగిరి, నారాయణపూర్, గుండ్లపల్లి, చందంపేట (5) మెదక్: కల్హేర్, నారాయణఖేడ్, చిన్నకోడూరు, జగదేవ్‌పూర్, వెల్దుర్తి, కౌడిపల్లి, జహీరాబాద్, పుల్కల్, సంగారెడ్డి, పటాన్చెరువు, శివంపేట, ములుగు, తొగుట (13) కరీంనగర్: మేడిపల్లి, మెట్పల్లి, రామడుగు (3)