College Fest
-
Viral: ప్రేమకు వేదికైన కళాశాలలోనే పెళ్లి చేసుకున్న జంట
కొచ్చి: చదువుకున్న చోటే పూర్వ విద్యార్థుల వివాహానికి వేదికైంది. స్నేహితులే కుటుంబం, బంధువులుగా మారారు. ప్రేమకు వేదికైన కళాశాలలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేలాదిమంది విద్యార్థుల సమక్షంలో దండలు మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేక వివాహం కేరళ రాష్ట్రంలో బుధవారం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ సందర్భంగా ఓ ప్రేమ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. ఎర్నాకుళంలోని మట్టంచెరి ప్రాంతానికి చెందిన కేకే నదీమ్, పనంగాడ్కు చెందిన సీఆర్ కృపా అనే యువతీ యువకులు మహారాజా కాలేజ్‌లో (2014- 17) డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిరుగురించింది. చదువులు పూర్తి అయిన తరువాత కూడా వీరి ప్రేమ కొనసాగింది. అయితే ఇద్దరి సామాజిక నేపథ్యాలు వేరు కావడంతో వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి నదీమ్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ.. కృప తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమకు వేదికైన కళాశాలలోనే ఒక్కటవ్వాలనుకున్నారు. అదే సమయంలో కాలేజ్‌లో యూత్ ఫెస్టివల్ జరుగుతుండటంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 8వ తేదీన తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం కళాశాలకు తిరిగి వచ్చారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కాలేజీ సెంటర్ సర్కిల్లో ఉన్న దేవత విగ్రహం ముందు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. నూతన జంటకు స్నేహితులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నదీమ్ ప్రేవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. కృప న్యాయ విద్యనభ్యసిస్తోంది. -
సోమాజిగూడ విల్లామేరీలో ఫ్రెషర్స్ డే వేడుకలు (ఫొటోలు)
-
మహిళా కాలేజీని చుట్టుముట్టి.. గోడ దూకి రచ్చ రచ్చ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్, స్టాఫ్ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలిపారు. Men climbing over the walls to get into Miranda House during an open fest. What followed was horrible. Cat-calling, groping, sexist sloganeering and more. Men entering safe spaces to harass gender minorities is nothing new, but they out do themselves every time. pic.twitter.com/UkMAuJZKVU — Sobhana (@sobhana__) October 15, 2022 ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర! -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం: ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రముఖ నటుడు సుశాంత్ అనుమోలు అన్నారు. శుక్రవారం ఆర్టీసి కళ్యాణ మండపంలో అరోరా రామంతాపూర్ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఆలాప్ పేరిట సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సుశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి సారించకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మానవ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్.రమేష్ బాబు, కెఎంవి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ప్రముఖ విద్యావేత్త బాలాజి వీరమనేని, ప్రముఖ సినీ దర్శకులు పరశురాం, సంగీత దర్శకులు వివేక్ సాగర్, కళాశాల వైస్ చైర్మన్ ఎన్.అనుదీప్, డైరెక్టర్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ మోహన్ కుమార్, డాక్టర్ పి.జనార్ధన్ రెడ్డి, డిపార్ట్మెంట్ అధిపతులు సతీష్‌కుమార్, దేవేందర్ రావు,అర్పిత, శుభప్రద తదితరులు పాల్గొన్నారు. -
డ్యాన్స్‌లతో అదరగొట్టిన విద్యార్థులు!
-
ఆనందం పరవళ్లు..