న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ
హైదరాబాద్: అత్యున్నత సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయని లోక్‌సత్తా, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థల నిర్వాహకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కంచే చేను మేసిన విధంగా న్యాయవ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా న్యాయమూర్తులు ఒక గుంపులా తయారై తమను తామే పదవుల్లో నియమిం చుకునే ‘కొలీజియం’ పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదని తెలిపారు.
ఆదివారం సోమాజిగూడ ఆస్కీలో ‘జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ’ పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో పేరెన్నికగన్న న్యాయకోవిదుల ఆధ్వర్వంలో రూపొం దించిన జ్యుడీషియల్ అపారుుంట్మెంట్స్ కమిషన్‌ను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించినా.. ఆ బిల్లును న్యాయస్థానం కొట్టివేయడం విచారకరమన్నారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ ఒకే స్వభావం ఉన్న కేసుల్లో పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇస్తూ న్యాయవ్యవస్థ తమ నమ్మకాన్ని పొగొట్టుకుంటోందని, దశాబ్దాల పాటు కేసులు పరిష్కారం కాకపోవడంతో కక్షిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
పారదర్శకత లోపించిన ‘కొలీజియం’
‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ కొలీజియం పద్ధతిలో పారదర్శకత, ప్రమాణా లు, బాధ్యత, జవాబుదారీతనం లోపించాయన్నారు. న్యాయస్థానాల్లో కోట్లాది కేసులు పెం డింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రతిపాదించిన జ్యుడీషియల్ అపారుుంట్‌మెంట్ కమిషన్ మంచి ఆలోచన అని అన్నారు. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మ ణరావు, రైతు నేత వెంగళరెడ్డి,విశ్రాంత ముఖ్య కార్యదర్శి కాకి మాధవరావు, సోలిపేట రామచంద్రారెడ్డి, ఆవుల మంజులత, విశ్రాంత ఐఏఎస్ కమల్‌కుమార్, హనుమాన్‌చౌదరి, తెలకపల్లి రవి తదితరులు మాట్లాడుతూ న్యాయ సంస్కరణలు తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. న్యాయసంస్కరణలు, కొలీజియం, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటులపై ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించారు. దేశంలో వివిధ రంగాల్లోని మేధావులు, నిపుణులు అభిప్రాయాలు సేకరించి రాష్ర్టపతి, ప్రధాని, సుప్రీంకోర్టు సీజే తదితరులకు నివేదించాలని తీర్మానించారు.