Common Entrance Test(cet)
-
Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ కింది విధంగా ఉంది. ► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీలు. ► మే 18న టీఎస్ ఎడ్ సెట్ ►మే 20న టీఎస్ ఈసెట్ ► మే 25న లాసెట్(ఎల్ఎల్బీ), పీజీ లాసెట్ ► మే 26, 27న టీఎస్ పీజీ ఐసెట్ ►మే, 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఈసెట్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా -
నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే ఆన్లైన్ పరీక్ష
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్లైన్ పరీక్ష ద్వారా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో తెచ్చుకున్న మార్కులను ఏ నాన్ గెజిటెడ్ ఉద్యోగానికైనా మూడేళ్ల వరకు పరిగణలోకి తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఐబీపీఎస్‌లు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేపట్టిన విషయం విదితమే. చదవండి: బంగారు బాతును చంపేస్తారా? -
ప్రశాంతంగా సీఈటీ
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) మొదటి రోజైన గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక ఎగ్జామినేషన్ బోర్డు (కేఈఏ) పోలీసు శాఖతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధి వరకూ 144 సెక్షన్ విధించారు. కేంద్రాలకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కాగా, మొదటిరోజు జీవశాస్త్రం, గణింతం విషయాల్లో పరీక్ష జరిగింది. నేడు (శుక్రవారం) భౌతిక, రసాయన శాస్త్రాల్లో పరీక్ష జరగనుంది. ఈ ఏడాది సీఈటీ కోసం బెంగళూరులోని 70 కేంద్రాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలను కేఈఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.