community policing
-
నిరుద్యోగులను జాబ్‌తో కనెక్ట్ చేస్తుంది
► నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపే మార్గం ► ప్రత్యేక వాహనం రూపొందించిన నగర పోలీసులు ► కమ్యూనిటీ పోలీసింగ్ చర్యల్లో భాగంగానే ► ప్రారంభించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్ : ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కోసం నగర పోలీసులు అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్‌లో మరో ముందడుగు పడింది. నిరుద్యోగులైన యువ తకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం సిటీ పోలీసులు ‘జాబ్ కనెక్ట్’పేరుతో ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. దీన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఏమిటీ వాహనం..? ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి గగనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం షెడ్యూల్ ప్రకారం నిత్యం కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఎలాంటి అండదండలు లేనివారు ఉంటున్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని వెళ్తుంది. ఎలా ఉపకరిస్తుంది? దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహ నంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్ చేసుకోవ చ్చు. ఇలా రిజిస్టర్ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్లైతే ‘జాబ్ కనెక్ట్’సిబ్బంది ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం ఇచ్చి సమన్వ యం చేస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా... ‘జాబ్ కనెక్ట్’వ్యాన్‌కు అమర్చిన స్క్రీన్ ద్వారా ప్రజలకు అవసరమైన సూచ నలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు. మరోపక్క నగర పోలీసులు రూపొందించిన ‘హాక్–ఐ’యాప్ ద్వారానూ నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ‘చేయూత’స్ఫూర్తితో... నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి గత ఏడాది డిసెంబర్ 4న ‘చేయూత’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు సిబ్బందిని వారి పరిధుల్లో ఉన్న కాలనీలు, బస్తీలకు పంపడం ద్వారా మొత్తం 7,540 మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం టీఎంఐ సంస్థతో కలిసి 40 కంపెనీలతో భారీ జాబ్‌మేళా నిర్వహించి 1,300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో సీపీ మహేందర్‌రెడ్డి ఈ విధానం అన్ని ఠాణాల పరిధుల్లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్‌కు రూపమిచ్చారు. నిస్పృహకు లోనైతే ఇబ్బందే విద్యార్హతలు ఉన్న తర్వాత ఉద్యో గాలు రాకపోతే యువత నిస్పృహకు లోనవుతారు. అలాంటి వారే దారితప్పి నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది. అలా కాకుండా చేయడానికి ఇలాంటి చర్యలు చాలా కీలకం. నగర పోలీసులు ‘జాబ్ కనెక్ట్’ను పరిచయం చేయడం శుభపరి ణామం. ఇది పోలీసింగ్లోనే కొత్త ఒరవడి. – అనురాగ్ శర్మ, డీజీపీ పరిచయాలు అవసరం లేకుండా కంపెనీలో తెలిసిన వారి అవసరం లేకుండా అర్హులైన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే మంచి పేరున్న టీఎంఐ సంస్థతో కలసి పని చేస్తున్నాం. ప్రధానంగా బస్తీలు, నిరుపేదలు నివసించే, వెనుకబడిన కాలనీలపై దృష్టి పెట్టనున్నాం. – ఎం.మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్ ఆ రెండిటికీ వారధిగా పనిచేస్తాం అనేక సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం, నిరుద్యోగులకు ఆ వివరాలు తెలిపి అర్హులైన వారి పొందేలా చేయడం... ఈ రెండిటికీ మధ్య మేము వారధిగా పనిచేస్తాం. ఈ వ్యాన్ ద్వారా ఉద్యోగాల కోసం తిరిగే అవకాశంలేని వారి ముంగిట్లోకి అవకాశాలను తీసుకువెళ్తాం. – మురళీధరన్, టీఎంఐ చైర్మన్ -
పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ
కొవ్వూరు : జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ అ«ధికారుల (సీపీవో) వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఐజీ పీఎస్వీ రామకృష్ణ తెలిపారు. పట్టణంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన రికార్డులు పరిశీలించారు. పట్టణం, రూరల్ సర్కిళ్ల పరిధిలో కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం డీఐజీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నిస్వార్థంగా పోలీసు సేవలందించాలనుకునే వారు సీపీవోలుగా చేరవచ్చని సూచించారు. క్షుణ్ణం జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు జిల్లాకు అదనంగా 13 పెట్రోలింగ్ వాహనాలు కేటాయించారని, నెల రోజుల్లో జిల్లాకు వస్తాయని తెలిపారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న 13 స్టేషన్లకు పె ట్రోలింగ్ వాహనాలు కేటాయిస్తామన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, పి.ప్రసాదరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నేర రహిత సమాజమే ధ్యేయం
► నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చాదర్‌ఘాట్: నేర రహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఈస్ట్ జోన్ పోలీ సుల ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ ఇంపీరియల్ గార్డెన్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగం దక్కించుకోవటం మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుం దని, దీనిని దృష్టిలో పెట్టుకొని యువత తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు యత్నించాలని కమిషనర్ సూచిం చారు. ప్రైవేట్ మార్కెట్లో వచ్చిన మార్పుల వల్ల జాబ్‌ల సంఖ్య బాగా పెరిగిందని, యువత మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. సహనం, ఓర్పుతో అడుగులు వేస్తూ యువత లక్ష్యాలు చేరుకోవాలి తప్ప నేరమార్గంలో పయనించరాదన్నారు. యువతలో సాఫ్ట్ స్కిల్స్ పెంపొందితే దేశ సంపద వృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగానే ఈజాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 500 వందల మంది యువతీయువకులు ఈ మేళాకు హాజరు కాగా.. వీరిలో రెండు వందల మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సుల్తాన్‌బజార్ ఏసీపీ జి.చక్రవర్తి, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, ఈస్ట్ జోన్ పరిధిలోని తొమ్మిది మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మావోయిస్టుల యత్నాలను తిప్పికొడుతున్నాం..
రంపచోడవరం :ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనమైత్రి, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గిరిజనులకు పోలీసులు దగ్గరయ్యారని పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి చింతూరు పోలీస్ స్టేషన్‌కు నిర్భయంగా వస్తున్నారని చెప్పారు. ఎటపాక వైటీసీ కేంద్రంగా గిరిజన యువతకు పారా మెడికల్ కోర్సుల్లో శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒడిశా, విశాఖ ఏజెన్సీలలో మావోయిస్టులు ఆర్మీ మిలీషియూ సభ్యులతోనే మనుగడ సాగిస్తున్నారని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో మావోయిస్టు దళాల సంచారం ఉందని, వారి కదలికలపై గట్టి నిఘా ఉందని తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం ఆస్మీ పాల్గొన్నారు. -
అరచేతిలో 'హాక్ ఐ'
మీ ముందే పోకిరీలు అమ్మాయిలను ఏడిపిస్తున్నారా.. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారా.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారా.. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా.. మీ అరచేతిలోని మొబైల్ ద్వారా ఆ నేరాల్ని పోలీసులకు తెలియజేయవచ్చు. అందుకోసం హైదరాబాద్ పోలీసులు రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ హాక్ ఐ - సాక్షి, వీకెండ్ ప్రతినిధి అసలు ఏంటీ యాప్..? ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోలీసుల ఉల్లంఘనలు, మహిళలపై నేరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, కాలనీల్లో అధిక శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, తదితర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మీరు ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ‘హాక్ ఐ’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. మీ వివరాలు కూడా గోప్యం. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు మిమ్మల్ని సంప్రదిస్తారు. డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి Hawk Eye అని టైప్ చేస్తే యాప్ డిస్ప్లే అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ వివరాలను పోలీసులకు కూడా తెలియపరచడం మీకు ఇష్టం లేదా..? ఇలాంటి వారి కోసమే అనోనిమాస్ ఆప్షన్ ఇచ్చారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. ఈ అనోనిమస్ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రిపోర్టు ఏ వైలేషన్ టు పోలీస్ ట్రాఫిక్ ఉల్లంఘన, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ఇతర నేరాలను ఈ ఫీచర్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. నేరానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో అప్లోడ్ చేస్తే చాలు. రిజిస్ట్రర్ విత్ పోలీస్... ఈ మధ్య జరుగుతున్న నేరాల్లో నిందితులు ఎక్కువగా ఇంట్లో అద్దెకు ఉన్నవారు లేదా పని మనిషులు, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్, పేపర్ బాయ్, మిల్క్ బాయ్, ఇంటికి సర్వీస్ చేయడానికి వచ్చే(ఎలక్ట్రిషియన్, ప్లంబర్, కార్పెంటర్, ఎల్పీజీ సపై్ల సిబ్బంది..) వారు ఉంటున్నారు. వీరికి సంబంధించిన ఎలాంటి వివరాలు దొరక్కపోతుండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీని కోసమే రిజిస్ట్రర్ విత్ పోలీస్ ఫీచర్‌ను ఇచ్చారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ హైదరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల నంబర్లు ఈ ఫీచర్లో నిక్షిప్తమై ఉన్నాయి. మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దగ్గర్లోని పీఎస్‌కు వెంటనే ఫోన్ చేయవచ్చు. ఇందులో ప్రతి స్టేషన్‌కు సంబంధించి ఫోన్ నంబర్, ఎస్ఐ, ఏసీపీ, డీసీపీ, కంట్రోల్ రూం, పెట్రోల్ వాహనం ఇలా అన్ని నంబర్లు ఉంటాయి. రిపోర్టు స్టేటస్ ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన ఏ ఏడాదికో రెండేళ్లకో మన సమస్యకు పరిష్కారం లభించేది. ఇప్పుడు అలా కాదు అంతా నిమిషాల్లోనే.. మీ ఫిర్యాదుకు సంబంధించిన ప్రతి సమాచారం మీ అకౌంట్‌కు చేరుతుంది. వుమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్... ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రయాణ సమయంలో మహిళలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను రూపొందిం చారు. మహిళలు ట్యాక్సీ, క్యాబ్, ఆటోల్లో ప్రయాణించే ముందు దాని ఫొటో, రిజిస్ట్రేషన్ నంబర్, ఎక్కడ ఎక్కారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. అనే వివరాలను ‘హాక్ ఐ’లో పొందుపరచాలి. మార్గమధ్యలో సమస్య ఎదురైతే ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. ఎస్ఓఎస్ బటన్... ఎమర్జెన్సీ సమయంలో ఈ బటన్ నొక్కితే మీరు ముందుగానే నమోదు చేసిన ఐదుగురు మిత్రులకు ప్రీ రికార్డెడ్ మెసేజ్ వెళ్తుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ సీఐ, ఏసీపీ, డీసీపీ, పెట్రోలింగ్ వాహనాలు, కంట్రోల్ రూంకు కూడా సందేశం వెళ్తుంది. పోలీసులు అప్రమత్తమై మిమ్మల్ని ఆపద నుంచి రక్షిస్తారు. కమ్యూనిటీ పోలీసింగ్ మీరు కమ్యూనిటీ పోలీస్ కావాలనుకుంటున్నారా..! మీ కోసమే ఈ ఫీచర్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోలీసులు మీ సేవల్ని వినియోగించుకుంటారు. ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్, టెక్నాలజీ సపోర్ట్, నైపుణ్యాలపై శిక్షణ ఇలా వీటిలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని మీరు ఒక కమ్యూనిటీ పోలీస్‌గా సేవలందించవచ్చు. -
‘హాక్ ఐ’తో ఆపద నుంచి బయటపడొచ్చు ఇలా..
మీరు ఆపదలో ఉన్నారా?.. మీ కళ్లముందే అన్యాయం జరుగుతుందా?.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉందా?.. ఇదివరకటిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమయం వృథా చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఫిర్యాదును నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. డ్యూటీలో ఉన్న పోలీసూ నిర్లక్ష్యం చేసినా ఒక్క క్లిక్ చాలు. ఇందుకోసం ‘హాక్ ఐ’ పేరిట హైదరాబాద్ పోలీస్ ఐటీ సెల్ డిపార్ట్మెంట్ సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలి?, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ కోసం... కావాల్సింది ఏమిటి?.. * ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. * ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్‌లో సెర్చ్ చేయవచ్చు. * http://www.hyderabadpolice.gov.in/Default.htm ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. * కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్‌పై క్లిక్ చేయండి. విండోలో కనిపిస్తున్న ‘ఇన్స్టాల్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి. లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో. * స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్... * ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు. * మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ * మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది. * ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు. * ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి. * ఈ ఆప్షన్లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి. * ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు. ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ బటన్) * ఈ ఆప్షన్లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి. * తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్‌నంబరును ఎంటర్‌చేసి సెండ్ చేయాలి. * ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది. * అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది. కమ్యూనిటీ పోలీసింగ్ * సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్లో రిజిష్టర్ కావొచ్చు. * ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి. * ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ *ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు పొందవచ్చు. * ఈ ఆప్షన్లో మీకు అన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు కనిపిస్తాయి. * మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. ఎస్ఓఎస్ ప్రాధాన్యత * దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్‌పై ఎస్ఓఎస్ బటన్ కనిపిస్తుంది. * అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.