complained
-
నిద్రమత్తు భార్యతో వేగలేను సార్...
కర్ణాటక: భార్య మొద్దునిద్రతో విరక్తి చెందిన భర్త ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అయేషా పర్వీన్ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిద్రలేస్తుంది, భోజనం చేసి సాయంత్రం 5.30 పడుకుంటే రాత్రి 9.30 గంటలకు మేలుకుంటుంది. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని భర్త ఇమ్రాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ మేరకు బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వంట కూడా చెయ్యదు ఆమె వంట కూడా చేయదని, తన తల్లి వంటచేసి వడ్డించాలని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఆమె కుటుంబసభ్యులతో దాడిచేయిందని వాపోయాడు. భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని, భార్య ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మొర పెట్టుకున్నాడు.తనపై కొంచెం కూడా ప్రేమ, మమకారం లేదని, ఆస్తిని కాజేయడానికి పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతోందని చెప్పాడు. ఇటీవల పుట్టినరోజు నెపంతో 20–25 మందిని ఇంటికి ఆహ్వానించి తనపై దాడిచేయిందని ఆరోపించాడు. ఆమెకు పెళ్లికి ముందే రోగాలు ఉండగా వాటిని దాచిపెట్టి ఐదేళ్ల క్రితం తనకు ఇచ్చి వివాహం చేశారని అతడు చెప్పాడు. మామ అరీఫుల్లా, అత్త హీనా కౌసర్, బావమరిది మహమ్మద్ మొయిన్‌లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
-
ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారయ్యా..
కోనేరు సెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్య ఎలాటిదైనా చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి రోజు స్పందనలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారంటూ వృద్ధులు, అధికకట్నం కోసం అత్తింటి వేధింపులు అధికం అయ్యాయంటూ వివాహితులు, ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ నిరుద్యోగులు, ప్రేమ పేరుతో వంచన చేశారంటూ అమాయపు ఆడపిల్లలు ఇలా అనేక మంది ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో బారులు తీరుతున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అదే స్థాయిలో స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుండటంతో బాధితులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో దాదాపు 25 మందికిపై బాధితులు ఎస్పీని కలిసి తమ తమ సమస్యలు చెప్పుకుని న్యాయం కోరారు. స్పందించిన ఎస్పీ బాధతులకు తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఎస్పీని కలిసి తన ఇద్దరు కుమారులు ఆస్తి కోసం తనను అనేక అవస్థలు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అలాగే కోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటానని సరిహద్దుదారుడు తన పొలంలో పురుగుమందు పిచికారీ చేసే క్రమంలో తన పంట మొత్తం నాశనం అయిందని అదేమని అడిగితే తనపై దాడి చేసి కొట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్పీ ఫిర్యాదులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. -
60 ఎకరాలు పంచింది..బుక్కెడు బువ్వకు దిక్కు లేదు..!
మరిపెడ రూరల్: తన కష్టార్జితంతో నలుగురు కుమారులకు 60 ఎకరాలు సంపాదించి పెట్టినా.. తనకు వృద్ధాప్యంలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య నాజీ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. కలెక్టర్ వీపీ గౌతమ్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేసింది. భూక్యతండాకు చెందిన నాజీ, సోమ్లా దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. భార్యాభర్తలు వంశపారంపర్యంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కష్టపడి 60 ఎకరాలకు పెంచారు. నలుగురు కుమారులకు 13 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు. కొడుకులకు పంచగా మిగిలిన 6 ఎకరాల భూమి నాజీ పేర ఉన్నది. నాజీ భర్త సోమ్లానాయక్ 2009లో మృతి చెందడంతో చిన్నకుమారుడు లక్ష్మాజీ వద్ద కొన్నేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మాజీ కుమారుడు భూక్య చందులాల్ సాదాబైనామాలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన తల్లి పేరున పట్టా చేయించుకున్నాడని, అప్పటి నుంచి కొడుకు కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని నాజీ వాపోయింది. తనను బయటకు గెంటేశారని, మిగతా కొడుకులు కూడా అన్నం పెట్టడం లేదని వాపోయింది. తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని మంత్రిని, కలెక్టర్‌ను వేడుకుంది. -
కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్
అమలాపురం టౌన్ (తూర్పుగోదావరి): ఆ యువకుడికి ఆ రోజు రాత్రి పెళ్లి. మధ్యాహ్నం తన ఇంటి వద్ద బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకున్నాడు. కొద్దిసేపటిలో వధువు ఇంటికి బంధువర్గంతో బయలుదేరనున్నాడు. ఇంతలో ఓ గిరిజన మహిళ వచ్చి అతడికి, తనకు ఆరేళ్ల కిందటే పెళ్లయిందని.. తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగలేదు. వరుడి ఇంటికి, ఆ వెంటనే వధువు ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దీంతో వధువు కుటుంబీకులు సంకట స్థితిలో పడ్డారు. మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన భోగిశెట్టి వీర వెంకట అయ్యప్పస్వామి రాజమహేంద్రవరంలో ఓ టీవీ చానల్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అయినవిల్లి మండలం విలసకు చెందిన దగ్గర బంధువైన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. వీరి వివాహం శుక్రవారం రాత్రి వధువు ఇంటి వద్ద జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి సొంతూరు చల్లపల్లిలో బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకుని, వేడుక చేసుకున్నాడు. సాయంత్రం బంధువర్గంతో వధువు ఊరు విలసకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి రెండేళ్ల బాలుడితో ఓ గిరిజన మహిళ, తన బంధువులతో కలిసి కారులో ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఆరోగ్య శాఖలో ఉద్యోగి. అయ్యప్పస్వామి తన భర్తని, తమకు ఓ కుమారుడు కూడా పుట్టాడని, అతడికి ఇప్పుడు వేరే పెళ్లి జరుగుతోందని, దీనిని ఆపాలని అభ్యర్థించింది. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె, బంధువులు నేరుగా చల్లపల్లి వెళ్లారు. అయ్యప్పస్వామి బంధువులకు విషయం చెప్పారు. అక్కడి నుంచి విలస వెళ్లి వధువు ఇంట్లోనూ ఇదే విషయాన్ని వివరించారు. ఈ వివాదంతో మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికే ఆ గిరిజన మహిళ అయ్యప్పస్వామిపై రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. అమలాపురంలో బహుజన మహిళా శక్తి సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొంకి రాజామణిని కూడా ఆశ్రయించింది. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. ఆ గిరజన మహిళ శుక్రవారం తమ స్టేషన్‌కు వచ్చి అయ్యప్పస్వామి పెళ్లి ఆపాలని కోరిందని, అతడు ఆమె భర్తని తగిన ఆధారాలు చూపిస్తేనే చర్యలు చేపడతామని చెప్పానని ఉప్పలగుప్తం ఎస్సై వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ఆమె వారి పెళ్లి ఆధారాలు చూపించలేదని అన్నారు. దీంతో ఆమె, ఆమెతో పాటు వచ్చిన బంధువులు చల్లపల్లిలోని అయ్యప్పస్వామి ఇంటికి వెళ్లారని చెప్పారు. ఆ గిరిజన మహిళతో గతంలో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే తమ ఇద్దరికీ పెళ్లి జరగలేదని.. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరుడు అయ్యప్పస్వామి ‘సాక్షి’కి చెప్పారు. చదవండి: ‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజం -
భర్త తిట్టాడనే మనస్తాపంతో!
కొత్తకోట రూరల్: పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కొమ్ము నర్సమ్మ(60) సోమవారం భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల దగ్గర వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం, ఆమె భర్త చంద్ర య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 94407 95727కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు! -
ముగ్గురిపై దిశ తండ్రి ఫిర్యాదు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సతీష్ సలియన్, దిశ మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని దిశా సలియన్ మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియన్ మరణ కేసుల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా ఎలా వేధిస్తున్నాయో ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ కథలను ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. వారిని పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) సతీష్ సలియన్ ఇచ్చిన ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్‌గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు -
దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, టెక్కలి: శ్రీకాకుళం మండలం పరిధిలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నించిన వీఆర్ఓలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్ఓ, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు టెక్కలి ఆర్డీఓ ఎస్.భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం గురువారం అందజేశారు. భైరి, కరజాడ, బట్టేరు, పొన్నాం, నైరా ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారిపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కొన్ని సందర్భాల్లో విధులు చేపడుతున్న వీఆర్ఓ లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నందిగాం: ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వీఆర్వోలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని వీఆర్వో సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వర్రావు లకు సంఘీభావంగా మధ్యాహ్నం భోజన సమయంలో స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ పరిధిలోని నైరా వద్ద గురువారం రాత్రి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోలపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తగదని హితవు పలికారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో వీఆర్వోలు సురేష్, అప్పన్న, మురళీ, రాంజీ, వైకుంఠరావు, ఖగేశ్వర్రావు, కృష్ణారావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మనవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు
-
విశ్రాంత ఉద్యోగిని చితకబాదిన కానిస్టేబుల్
గుత్తి: రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని ఒక కానిస్టేబుల్ చితకబాదిన సంఘటన గుత్తి ఆర్ఎస్లో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన రైల్వే విశ్రాంతఉద్యోగి గోవిందు పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి గుత్తి ఆర్ఎస్లోని ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలుచున్నాడు. లంచ్ సమయం కావడంతో బ్యాంకర్లు మధ్యాహ్నం గంట పాటు లావాదేవీలు నిలిపి వేశారు. దీంతో గోవిందు క్యూలో నిలబడలేక పక్కకు వెళ్లి కూర్చున్నాడు. బ్యాంకు అధికారులు తిరిగి లావాదేవీలు ప్రారంభించడంతో క్యూలో నిలుచోవడానికి వెళ్లాడు. అయితే మోహన్ అనే కానిస్టేబుల్ అతన్ని పక్కకు తోసివేశాడు. ఉదయం నుంచి వేచి ఉన్నానని చెప్పినా కానిస్టేబుల్ వినలేదు. నానా బూతులు తిడతూ చేయి చేసుకున్నాడు. దీంతో అతను కిందపడిపోయాడు. అవమానం భరించలేక ఏడ్చాడు. 100కు కాల్ చేసి కానిస్టేబుల్ మోహన్‌పై ఫిర్యాదు చేశాడు. -
ఫిర్యాదు చేసిందని...నిప్పంటించారు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. తమ వాడిపై ఫిర్యాదు చేసిందనే అక్కసుతో నిందితుడి కుటుంబ సభ్యులు.. బాలిక (11) పై హత్యాయత్నం చేసిన ఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపుల కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధిత బాలికను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఇంటర్ విద్యార్థిని గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన నిందితుడి కుటుంబ సభ్యులు ఆమెను హతమార్చడానికి పూనుకున్నారు. ఆమె తల్లిదండ్రులెవరూ ఇంట్లో లేని సమయంలో దాడి చేసి..కిరోసిన్ పోసి నిప్పంటించారని పోలీసులు మంగళవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.