ఆనందమయ జీవితానికి 10 సూత్రాలు
ఆధ్యాత్మికం
సృష్టిలోని జీవకోటి అంతటిలోనూ సంఘర్షణ ఉంటుంది. అయితే మానవ జీవితానికి వచ్చే సరికి దానికి ‘సంక్లిష్టత’ కూడా జత అవుతుంది. ఈ సంక్లిష్టత, సంఘర్షణే మనిషికి వరం, శాపం కూడా. ఇవి తన పురోగమనానికి మూలచక్రాలు అని గ్రహిస్తే వరం. వీటిని తట్టుకోవడం సాధ్యం కాదు అనుకుంటే శాపం. అదిగో జీవితాన్ని తట్టుకోవడం కష్టం అనుకునేవారి కోసం ఎప్పటికప్పుడు మతాలు, ప్రవక్తలు, యోగులు, ఆధ్యాత్మికవేత్తలు మార్గాలు చెబుతూనే ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో బాల్యం నుంచి సాధన చేస్తున్న బి.వి.రెడ్డి చెప్పిన మార్గాలే ఈ పుస్తకం. ‘మనిషి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ జీవన సాఫల్యాన్ని పొందడానికి’ ఈ సూత్రాలు ప్రతిపాదిస్తున్నానంటారు రచయిత.
ఆ సూత్రాలు 1. ప్రకృతి నియమాల పట్ల అవగాహన 2. ప్రకృతితో అనుబంధం 3. ఆధ్యాత్మిక చైతన్యం 4. ధ్యానసాధన 5. మౌనం
6. కరుణ 7. దాతృత్వం 8. ప్రశాంతత 9. ప్రేమతత్వం 10. జీవిత దార్శనికత. ఈ పది సూత్రాలను ఆకళింపు చేయడానికి రచయిత చెప్పిన విషయాలు గమనించదగ్గవి. ఆసక్తిగలవారు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం.