compulsory
-
అప్రెంటిస్‌షిప్ ఉంటేనే కొలువు!
సాక్షి, హైదరాబాద్: అప్రెంటిస్‌షిప్... ఇకపై ప్రైవేటు సంస్థలోనే కాదు షాపింగ్ మాల్, షోరూం, సూపర్ మార్కెట్ లాంటి ఎందులో ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరి కానుంది. ఈ అర్హత ఉన్న వారికే ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. డెసిగ్నేటెడ్ ట్రేడ్లతోపాటు ఆప్షనల్ కేటగిరీలో వచ్చే ప్రతి కొలువు భర్తీని అప్రెంటీస్‌షిప్‌తో కేంద్రం ముడిపెట్టింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పనశాఖ అప్రెంటిస్‌షిప్ (సవరణ) నిబంధనలు–2019 విడుదల చేసింది. కార్మికశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా అప్రెంటిస్‌షిప్ ఇవ్వొచ్చు. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం వరకు అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులను నియమించుకోవచ్చు. వర్కింగ్ ట్రేడ్లవారీగా వేతనాలు నిర్దేశించినప్పటికీ గరిష్ట విభాగాల్లో నియమించుకున్న వారికి తొలి ఏడాది రూ. 7,000, రెండో ఏడాది రూ. 7,700, మూడో ఏడాది రూ. 8,800 చొప్పున వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రాయితీలతో ప్రోత్సాహం... ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్న చిన్నపాటి దుకాణం మొదలు పదులు, వందల సంఖ్యలో ఉన్న సంసల్లో అప్రెంటిస్‌షిప్‌కు వీలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను సైతం ప్రకటించింది. 15 శాతం వరకు ఉద్యోగాలను అప్రెంటిస్‌షిప్‌తో నింపుకోవచ్చని ప్రకటించిన కేంద్రం వారికి చెల్లించే వేతనాల్లో ఒక్కో ఉద్యోగికి రూ. 1,500 చొప్పున భరించనుంది. దీంతో సంస్థకు వేతన చెల్లింపుల భారం తగ్గుతుంది. ఆయా సంస్థలు నైపుణ్యాభివృద్ధి కల్పనలో భాగస్వామ్యం అవుతాయనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అప్రెంటిస్‌షిప్ కోసం కంపెనీ apprenticeshipindia.org వెబ్సైట్లో నమోదు చేసుకుంటే కేంద్రం ప్రకటించిన రాయితీలు వస్తాయి. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థికి పరీక్ష రాసే అర్హత సర్టిఫికెట్ జారీ ప్రక్రియ సులభతరమవుతుంది. అప్రెంటిస్‌షిప్ చేసిన కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు పొందే అవకాశంతోపాటు జాబ్ మేళాలు, ఇతర నియామకాల ప్రక్రియలో ఈ సర్టిఫికెట్లు దోహదపడతాయని కార్మిక ఉపాధి కల్పనశాఖ సంచాలకుడు కె.వై. నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా చెల్లుతుంది... అప్రెంటిస్‌షిప్ పొందిన అభ్యర్థికి కేంద్ర ప్రభుత్వం సంబంధిత ట్రేడ్‌లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. ఇందుకు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తర్వాత సంబంధింత సంస్థ అనుమతితో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ సర్టిఫికెట్తో దేశంలో ఎక్కడైనా సంబంధిత ట్రేడ్‌లో ఉద్యోగానికి అర్హుతగల వ్యక్తిగా పరిగణిస్తారు. ఐటీఐ ద్వారా పూర్తి చేసిన కోర్సును డెసిగ్నేటెడ్ ట్రేడ్‌గా, ఐటీఐయేతర కేటగిరీలను ఆప్షనల్ ట్రేడ్‌లుగా విభజించిన కేంద్రం... వాటి అప్రెంటిస్‌షిప్‌కు దిశానిర్దేశం చేసింది. -
భగవంతునికి భక్తునికి మధ్య ఆధార్
-
వివాహాన్ని విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్ కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివాహాల రిజిస్ట్రేషన్‌పై మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నిరోధించేందుకుగాను నిర్బంధ వివాహ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. వివాహ రిజిస్ట్రేషన్‌తో ఆడ పిల్లలకు రక్షణ, అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ వివాహాన్ని రిజిష్ట్రషన్ చేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అక్రమ, బాల్య వివాహాల నిరోధానికి; భర్త ఇంట్లో (భార్య) హక్కులు కోరేందుకు, భర్తను కోల్పోయిన స్త్రీ వారసత్వ హక్కులు కోరేందుకు, భార్యను భర్త వదిలిపెట్టకుండా ఉండేందుకు, బీమా ప్రయోజనాలు పొందేందుకు వివాహ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లోని; వసతి గృహాల్లోని, కళాశాల్లోని పిల్లలకు అవగాహన కల్పించేందుకు విద్య, సంక్షేమ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. వివాహాల రిజిస్ట్రేషన్‌పై స్వయం సహాయక సంఘాలలో, గ్రామ..మండల.. జిల్లా సమాఖ్య సంఘ సమావేశాల్లో చర్చించాలని; బాల్య వివాహల నిరోధానికి, వివాహాల రిజిస్ట్రేషన్ చేయించేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావును ఆదేశించారు. ప్రజలకు అవగహన కల్పించేందుకుగాను గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓలు, గ్రామస్థాయిలోని ఇతర శాఖల సిబ్బందికి ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష ష్రే్టషన్ అధికారి మల్లారెడ్డి, సమాచార శాఖ ఏడీ ముర్తుజా, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాజేంద్ర, డీఎస్డీఓ విష్ణువందన, జెడ్పీ ఏఓ భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ ఉండాల్సిందే
-
నాక్ గుర్తింపు తప్పనిసరి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :యూజీసీ నిధులు పొందుతున్న కళాశాలలకు నాక్ గుర్తింపు తప్పకుండా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు స్పష్టం చేశారు. యూనివర్సిటీ కమిటీ హాలులో సోమవారం వీసీ అధ్యక్షతన వర్సిటీ పరిధిలోని 2ఎఫ్, 12బీ గుర్తింపు ఉన్న కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం జరిగింది. వీసీ మాట్లాడుతూ నాక్ గుర్తింపు(అక్రిడిటేషన్) లేకపోతే నిధులు నిలిపివేస్తామని యూజీసీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సమాచారాన్ని అన్ని కళాశాలలకు పంపామన్నారు. ఆ జాబితాలో ఉన్న కళాశాలలు వెంటనే నాక్ అక్రిడిటేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం యూనివర్సిటీ నుంచి పూర్తి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కళాశాలలు కోరితే యూనివర్సిటీ నుంచి రిసోర్స్ పర్సన్స్‌ను కూడా నియమిస్తామని చెప్పారు. ఈఏడాది జూన్ ఒకటో తేదీలోగా నాక్ అక్రిడిటేషన్ చేయించుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి నిధులు నిలిచిపోతాయన్నారు. రెక్టార్ ఆచార్య వై.పి.రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్‌లు వివిధ అంశాలపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచనలిచ్చారు. కళాశాలల వారు వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య జి.వి.చలం, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.