Computer Operator Post
-
చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
విశాఖ సిటీ: విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించారు.దీంతో బాధితులను తీసుకువచ్చేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు విశాఖ పోలీసులు మూడు రోజుల కిందట బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణావిదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. సైబర్ నేరాలు చేయాలంటూ బలవంతంచైనా ముఠా నిరుద్యోగులకు టైపింగ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించింది. తర్వాత టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చింది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసేలా అగ్రిమెంట్ రాయించుకుంది. మధ్యలో వెళ్లిపోతే 400 డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం అనంతరం వారిని కంబోడియాలోనే ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు ఇతర సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు.అలా చేయని వారికి ఆహారం పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమీషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకొనేది. వీరు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల ఎంటర్టైన్మెంట్లు పబ్, క్యాసినో గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కల్పించారు.ఒక వ్యక్తి ఫిర్యాదుతోఅక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రాకెట్‌కు ప్రధాన ఏజెంట్ అయిన చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.బాధితుల తిరుగుబాటు.. అరెస్టుకంబోడియాలో చైనా గ్యాంగ్ హింసలను భరించలేని బాధితులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు. అలాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కంబోడియాని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ అయిన సిహనౌక్విల్లోని జిన్బీ కాంపౌండ్‌లో తిరుగుబాటు చేశారు. తమను వెంటనే భారత్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో వీరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విశాఖ సీపీ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికితీసేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. విశాఖకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం కోసం సైబర్ క్రైమ్ సీఐ 94906 17917, సీపీ వాట్సాప్ నెంబర్ 94933 36633, కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2565454 సంప్రదించాలని సీపీ సూచించారు. -
25 పోస్టులు.. 36,557 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టులు ఇరవై ఐదే.. వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రం 36,557. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చేపట్టిన జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన ఇది. 2,500 జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం), 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ గత నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. జేపీవో, జేఎల్ఎం పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 10తో ముగియగా, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. 25 జేపీవో పోస్టులకు గాను 36,557 మంది, 2,500 జేఎల్ఎం పోస్టులకు గాను 58,531 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు లక్షా 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారవర్గాలు తెలిపాయి. జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియడంతో ఇంకా వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్యను నిర్ధారించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 3,025 జేఎల్ఎం, జేపీవో, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకుగాను 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఇదిలావుండగా జూనియర్ లైన్‌మన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 15న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిసెంబర్ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
పని నిల్.. జీతం ఫుల్!
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో అవసరం లేకున్నా మిర్చి యార్డులో 39 మంది సీజనల్ కండీషనల్ కింద ఆపరేటర్లుగా తీసుకున్నారు. వీరిలో అధిక శాతం మంది యార్డుకు రాకుండానే జీతాలు తీసుకునేవారు. ఈ నెలాఖరుతో వీరి రెన్యూవల్ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు యార్డు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మిర్చియార్డులో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం లేకున్నా ఇష్టారాజ్యంగా నియమాకాలు చేసుకున్నారు. కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని వారిని కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించారు. వీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు, మార్కెట్ యార్డులో పని చేయకుండానే జీతాలు తీసుకుని వెళ్లిపోయారు. కొంతమంది సిబ్బంది గతంలో పనిచేసిన యార్డు చైర్మన్‌కు డ్రైవర్‌గా, పీఏగా, ఫొటోగ్రాఫర్లుగా పనిచేసిన సందర్భాలున్నాయి. మార్కెట్ యార్డులో రికార్డుల ప్రకారం మొత్తం 84 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. ఇందులో మార్కెట్ యార్డులో రోజువారీగా లావాదేవీలు, ఎంట్రీ చేసేందుకు 24 మందిని తాత్కాలికంగా నియమించారు. గతంలో జాయింట్ కలెక్టర్ 10 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. సీజనల్ కండిషనల్ పేరుతో మరో 39 మందిని నియమించారు. వీరిలో ఎక్కువమంది ఏనాడూ యార్డులోకి వచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. జీతాల సమయంలో మాత్రం వచ్చి నెలకు రూ.15 వేలు తీసుకుపోవడం తప్ప వారు చేసే పని ఏమీ ఉండదు. అయితే టీడీపీ ప్రభుత్వంలో యార్డులో పనిచేయకుండా జీతాలు తీసుకున్న వీరు, ప్రస్తుతం ఉద్యోగాలు పోతాయని, రెన్యూవల్ కావేమో అనే భయంతో, యార్డులో కనిపిస్తున్నారు. వీరికి పని లేకపోవటంతో యార్డుకు వచ్చి టైం పాస్ చేసుకొని వెళుతున్నారు. ముగియనున్న రెన్యూవల్ గడువు... మిర్చియార్డుకు జనవరి నుంచి మేనెల వరకు రోజుకు లక్ష టిక్కీలకు పైగా సరుకు వస్తుంది. ఆ సమయంలో సరుకు తూకాలు వేసే సమయంలో వేమెన్ల వద్ద, సరుకు వివరాలను నమోదు చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు అవసరమని సాకు చెప్పి సీజనల్ కండిషనల్ పేరుతో 39 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. అయితే మార్కెట్ యార్డులో రెగ్యులర్‌గా 24 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వారే మిర్చి వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో పనిచేసిన మార్కెటింగ్ కమిషనర్ వీరిని రెన్యూవల్ చేసేందుకు నిరాకరించటంతో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి, రెన్యూవల్ చేయించారు. ప్రస్తుతం వీరి గడువుఈ నెల 31 వ తేదీతో ముగుస్తోంది. వీరిని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీజన్ లోనే తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటాం సీజనల్ కండిషనల్ పేరుతో కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లను తీసుకున్నాం. ప్రస్తుతం మిర్చియార్డుకు 34 నుంచి 35 వేల టిక్కీల సరుకు మాత్రమే వస్తోంది. కాబట్టి గతంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు సరిపోతారు. సీజనల్లో అవసరమైనప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ సెక్రటరీ, గుంటూరు -
ఉద్యోగాల పేరిట వసూళ్ల పర్వం!
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల పేరుతో ఇంటర్వ్యూలు ఎన్పీడీసీఎల్ ఆఫీసే వేదిక వరంగల్ క్రైం: హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగాల పేరుతో కొందరు ఘరానామోసానికి తెరలేపారు. ఈ కార్యాలయంలో 18 ఆపరేటర్ పోస్టులు ఉన్నాయని, వీటికి ఇంట ర్వ్యూ, రాత పరీక్ష నిర్వహిస్తున్నారని కొం దరు దళారులు రంగంలోకి దిగారు. 3 నెలలుగా వందలాది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి కార్యాలయ ఉద్యోగి ఒకరు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. అధికారి చాంబర్లోనే ఇంటర్వ్యూలు.. దళారులతో కుమ్మక్కైన ఆ అధికారి నిరుద్యోగులను నమ్మించేందుకు తన చాంబర్లోనే డమ్మీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. రోజూ 5 నుంచి 10 మంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరి జ్ఞానం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులని నమ్మబలుకుతూ ఇంటర్వ్యూకు ముందు సగం, ఆ తర్వాత సగం డబ్బు చెల్లించాలనే నిబంధన విధిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసినా ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. ఉద్యోగానికి ఎంపికైతే అన్ని కటింగ్స్‌పోను రూ.17,500 వేతనం వస్తుందని, మొదటి మూడేళ్లకు అగ్రిమెంట్ ఉంటుందని, తర్వాత మరో నాలుగేళ్లు సర్వీస్ రెన్యూవల్ చేస్తారని నమ్మిస్తున్నారు. ఏడేళ్ల సర్వీస్ పూర్తి కాగానే పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. ఏసీపీ కార్యాలయూనికి కూతవేటు దూరంలోనే ఈ మోసం జరుగుతున్నా పోలీసులు పసిగట్టకపోవడం గమనార్హం.