కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల పేరుతో ఇంటర్వ్యూలు
ఎన్‌పీడీసీఎల్ ఆఫీసే వేదిక
వరంగల్ క్రైం: హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్న ఎన్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగాల పేరుతో కొందరు ఘరానామోసానికి తెరలేపారు. ఈ కార్యాలయంలో 18 ఆపరేటర్ పోస్టులు ఉన్నాయని, వీటికి ఇంట ర్వ్యూ, రాత పరీక్ష నిర్వహిస్తున్నారని కొం దరు దళారులు రంగంలోకి దిగారు. 3 నెలలుగా వందలాది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి కార్యాలయ ఉద్యోగి ఒకరు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు.
అధికారి చాంబర్‌లోనే ఇంటర్వ్యూలు..
దళారులతో కుమ్మక్కైన ఆ అధికారి నిరుద్యోగులను నమ్మించేందుకు తన చాంబర్‌లోనే డమ్మీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. రోజూ 5 నుంచి 10 మంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరి జ్ఞానం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులని నమ్మబలుకుతూ ఇంటర్వ్యూకు ముందు సగం, ఆ తర్వాత సగం డబ్బు చెల్లించాలనే నిబంధన విధిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసినా ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. ఉద్యోగానికి ఎంపికైతే అన్ని కటింగ్స్‌పోను రూ.17,500 వేతనం వస్తుందని, మొదటి మూడేళ్లకు అగ్రిమెంట్ ఉంటుందని, తర్వాత మరో నాలుగేళ్లు సర్వీస్ రెన్యూవల్ చేస్తారని నమ్మిస్తున్నారు. ఏడేళ్ల సర్వీస్ పూర్తి కాగానే పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. ఏసీపీ కార్యాలయూనికి కూతవేటు దూరంలోనే ఈ మోసం జరుగుతున్నా పోలీసులు పసిగట్టకపోవడం గమనార్హం.
ఉద్యోగాల పేరిట వసూళ్ల పర్వం!
Published Mon, May 9 2016 4:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement