condition serious
-
విషమంగా డీఎంకే ఎమ్మెల్యే ఆరోగ్యం
సాక్షి, చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్ రేల ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ ప్రకటించింది. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్. కరోనా నివారణ, సహాయక పనుల్లో ఈయన ఉరకలు తీసిన విషయం తెలిసిందే. ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు క్రోంపేటలోని రేల ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఎం పళనిస్వామి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు. ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ మరుసటి రోజు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో.. అన్భళగన్ ఆరోగ్యం కుదట పడ్డట్టేనని సర్వత్రా భావించారు. సోమవారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. 90 శాతం మేరకు వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాస అందిస్తున్నారు. ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలుండడంతో ప్రస్తుతం 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం కుదుట పడేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, ఆయన కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. -
ప్రాణాపాయ స్థితిలో బాలీవుడ్ యువ దర్శకుడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జగన్ శక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ శక్తి, తన తదుపరి చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో చర్చలు జరుపుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కాగా.. జగన్ శక్తి గతంలో హాలీడే, ఇంగ్లీష్ వింగ్లీష్, డియర్ జిందగీ చిత్రాలకు జగన్ సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో రిలీజ్ అయిన 'మిషన్ మంగళ్' చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. మొదటి చిత్రంతోనే జగన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. (ఒకే ఏడాది రూ.750 కోట్ల వసూళ్లు) -
కులదైవం వద్దకు వెళుతుండగా ప్రమాదం
అన్నానగర్: వ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో బాలుడు, బాలిక మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మవాడిపట్టి సమీపంలో ఆదివారం జరిగింది. వ్యాన్‌ను కోవై రత్తినపురి కన్నప్పనగర్ పుదుకోటకు చెందిన శరవణన్ (48) సొంతంగా వ్యాన్ నడుపుతున్నాడు. ఇతని భార్య శరణ్య (28). వీరికి హరీష్ (15) కుమారుడు, హరిణి (10), సూర్యశ్రీ (6) ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి బంధువులు వసంత (30), గంగాదేవి (68), భూపతి (30), దయానంద్ (13), సానియా (8)తో సహా 14 మంది శనివారం రాత్రి కోవై నుంచి తూత్తుక్కుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తమ కులదైవం ఆలయానికి వ్యాన్‌లో బయలుదేరి వెళ్లారు. వ్యాన్‌ను శరవణన్ నడిపాడు. అదే సమయంలో గోపిచెట్టి పాళయం నుంచి మదురైకి ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సును మదురైకు చెందిన భూపతి నడిపాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు వాడిపట్టి సమీపం దాదమ్‌పట్టి కాలువ ప్రాంతంలో దిండుక్కల్ – మదురై హైవే రోడ్డులో వస్తుండగా హఠాత్తుగా వ్యాన్ వెనుక భాగంలో ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వ్యాన్ బోల్తాపడి నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో చిక్కుకుని దయానంద్, సానియా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు శరవణన్, శరణ్యా, హరిష్, హరిణి, సూర్యాశ్రీ, వసంతా, గంగాదేవి, భూపతి ఈ ఎనిమిది మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వాడిపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.∙ -
వ్యక్తిపై కత్తులతో దాడి
తణుకు అర్బన్ : కత్తులతో ఆగంతకులు చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండ్రాజవరం మండలం సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్ (40)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా నరకటంతో తీవ్ర గాయాలైన ప్రసాద్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులె¯Œæ్స సిబ్బంది అతడిని తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దుర్గాప్రసాద్ తణుకు రాష్ట్రపతి రోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తాడు. దాడికి పాల్పడింది ఎవరో, ఎందుకు దాడిచేశారో తెలియలేదు. విషయం తెలుసుకున్న సావరం గ్రామస్తులు పెద్దఎత్తున ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. -
వ్యక్తిపై కత్తులతో దాడి
తణుకు అర్బన్ : కత్తులతో ఆగంతకులు చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండ్రాజవరం మండలం సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్ (40)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా నరకటంతో తీవ్ర గాయాలైన ప్రసాద్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులె¯Œæ్స సిబ్బంది అతడిని తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దుర్గాప్రసాద్ తణుకు రాష్ట్రపతి రోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తాడు. దాడికి పాల్పడింది ఎవరో, ఎందుకు దాడిచేశారో తెలియలేదు. విషయం తెలుసుకున్న సావరం గ్రామస్తులు పెద్దఎత్తున ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ..ఒకరి మృతి
ఆత్మకూరు (నెల్లూరు): ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
సంగారెడ్డి కౌన్సిలర్‌పై దుండగుల దాడి
మెదక్: జిల్లాలో సంగారెడ్డి 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రదీప్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.