తణుకు అర్బన్ : కత్తులతో ఆగంతకులు చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండ్రాజవరం మండలం సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్ (40)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా నరకటంతో తీవ్ర గాయాలైన ప్రసాద్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు.
తణుకు అర్బన్ : కత్తులతో ఆగంతకులు చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండ్రాజవరం మండలం సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్ (40)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా నరకటంతో తీవ్ర గాయాలైన ప్రసాద్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులె¯Œæ్స సిబ్బంది అతడిని తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దుర్గాప్రసాద్ తణుకు రాష్ట్రపతి రోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తాడు. దాడికి పాల్పడింది ఎవరో, ఎందుకు దాడిచేశారో తెలియలేదు. విషయం తెలుసుకున్న సావరం గ్రామస్తులు పెద్దఎత్తున ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.