‘కన్ఫర్డ్’ వయసు 56కు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్ర కేడర్ అధికారులకు శుభవార్త. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల్లోకి ప్రవేశం కల్పించేందుకు రాష్ట్ర కేడర్ అధికారుల వయసును 54 ఏళ్ల నుంచి 56 ఏళ్లకు పెంచారు. కన్ఫర్డ్ పదోన్నతి వయసు పెంపుపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఈమేరకు నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం యూపీఎస్సీ.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల్లోకి రాష్ట్రాల అధికారులను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా జనవరి 1నాటికి 56 సంవత్సరాలు దాటిన అధికారులను ఈ మూడు సర్వీసుల్లోకి పరిగణించరు. ఇంతకుముందు ఈ పరిమితి 54 సంవత్సరాలు ఉండేది.