మహాజాతరకు మరో రూ. 21 కోట్లు
= ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు
=‘సాక్షి’ కథనానికి స్పందించిన రాష్ట్ర సర్కారు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం మహా జాతరకు మరిన్ని నిధులిచ్చేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడిగినన్ని నిధులు ఇవ్వకుండా... సమ్మక్క-సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వ్యవహారాన్ని ఇటీవలే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరంగల్ జిల్లా యంత్రాంగం విభాగాల వారీగా మొత్తం రూ. 114 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే... కేవలం రూ. 68 కోట్లు విదిలించి నిధులు కోత పెట్టింది. ఎట్టకేలకు
స్పందించిన సర్కారు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు కేటాయించేందుకు క్లి యరెన్స్ ఇచ్చింది. ఆర్ అండ్ బీ విభాగం పం పిన ప్రతిపాదనలకు ఈ నిధులను వాడుకునేం దుకు సమ్మతించింది. ప్రస్తుతం ఫెనాన్స్ విభాగంలో ఉన్న ఈ ఫైలుకు మరో రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని ఆర్ అండ్ బీ అధికారు లు సూచనప్రాయంగా వెల్లడించారు. జాతరకు వెళ్లే మార్గాల్లో రోడ్లు, మరమ్మతులు, వంతెనల నిర్మాణానికి రూ. 53.01కోట్లు కావాలని ముందు గా ఆర్అండ్బీ విభాగం ప్రతిపాదనలు పం పించింది.
అందులో రూ. 21.15 కోట్లు ఇచ్చేందు కు మాత్రమే సమ్మతించిన సర్కారు ఇప్పుడు అదనంగా రూ.21కోట్లు కేటాయించేందుకు ఫైలు కదిపింది. దీంతో భక్తులకు అనుగుణంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.