Constitutional provisions
-
ఉన్నవాడికి చుట్టాలు... పేదవానికి కష్టాలు!
కొత్త నేర చట్టాలను అనుసరించి మొత్తం 90 రోజులు నిందితులను కస్టడీలో పెట్టవచ్చు. పోలీసు కస్టడీ, కోర్ట్ కస్టడీల పేరుతో లాకప్‌లో లేదా జైళ్లలో బంధించేందుకు పోలీస్, న్యాయ వ్యవస్థలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టాలు సాధారణ పౌరుల పాలిట శాపాలే అనడం అతిశయోక్తి కాదు. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సకల అధికారాలనూ కట్టబెడుతున్న ఈ చట్టాల వల్ల... ధనవంతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారు లంచాలు ఇవ్వగలుగుతారు. ఖరీదైన లాయర్లను నియమించుకొని బెయిల్ పొందగలుగుతారు. ష్యూరిటీలు ఇవ్వగలుగుతారు. కొత్త చట్టాల పుణ్యమా అని రాజకీయనాయకుల ప్రమేయం, డబ్బులు... పోలీస్ కేసుల వ్యవహారంలో మునుపటి కన్నా ఎక్కువ ప్రాము ఖ్యాన్ని సంతరించుకుంటాయి. ఒక వ్యక్తి నేరం చేశాడనే అభియోగంతో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తీరికగా నేర ఆరోపణ చేసి కోర్టుకు పంపిస్తారు. ఆరోపణలపై విచారణకు ఎన్నేళ్లయినా పట్ట వచ్చు. చివరికి ఆరోపించిన నేరం రుజువు కాకపోవచ్చు. అప్పటివరకూ జైల్లో ఉన్న ఆ పౌరుని స్వేచ్ఛ ఖరీదెంత అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక వేళ నేరస్థుడు అని కోర్టు తీర్పు ఇస్తే ఇక అప్పీళ్లలో గెలవడం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. వకీళ్లకు సంబంధించిన డబ్బు, లంచగాళ్లను మేపడానికి చెల్లించడాలు ఉండనే ఉంటాయి. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌తో పోల్చితే కొత్త చట్టాలు (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023) ప్రమాదకరమైనవి. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973 కింద ‘అత్యధికంలో అధికం’ 15 రోజులకు మించి ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇది పార్లమెంట్ చేసిన చట్టం కాదు. అంతకుముందు రాజ్యాంగ నిర్ణాయక సభ 1950లోనే నిర్ణయించిన విషయం. రాజ్యాంగం మూడో భాగంలో అతి కీలకమైన పౌరుని ప్రాథమిక హక్కుల గురించిన వివరాలు ఉన్నాయి. ఇందులో 21వ ఆర్టికల్ జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛల ప్రాముఖ్యాన్ని చెబితే... 22వ ఆర్టికల్ అరెస్ట్, డిటెన్షన్లకు సంబంధించిన వివరాలను పేర్కొంటోంది. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల లోపే కోర్టు ముందు కచ్చితంగా హాజరు పరచాలని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఈ రాజ్యాంగ నిబంధనలను అనుసరించి చేసిన చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇలా 24 గంటలని ప్రత్యే కంగా పేర్కొనడానికి కారణం... పోలీసుల కస్టడీలో దర్యాప్తు (ఇన్వెస్టి గేషన్)కు ఒక్క 24 గంటలు చాలని భావించడమే! సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను గమనిస్తే ఇదే సంగతి బోధపడుతుంది.అయితే 24 గంటలకు మించి కస్టడీలో ఉంచుకోవడానికి పోలీసులు రకరకాల కారణాలు చెప్పడానికీ, ఏ కారణాలూ ఇవ్వకుండానే అరెస్టు చేసి కస్టడీ చేసేందుకూ పోలీసులకు ఈ నేర చట్టాలు విపరీతమైన అధికా రాలను ఇస్తున్నాయి. సింపుల్‌గా ‘తరువాత చూద్దాంలే, ముందు కస్టడీలో పడేయండి’ అనే అధికారం ఇస్తున్నాయి. ఎంపీలు, డబ్బున్నవారు, ఎమ్మె ల్యేలు, మంత్రుల పలుకుబడి ఉన్నవారు ఈ కస్టడీల నుంచి బయట పడిపోగలుగుతారు. కానీ కనీసం జరిమానా కూడా కట్టలేక, బెయిల్ కండిషన్ల కింద డబ్బు చెల్లించలేక ఎంతోమంది పేద, మధ్యతరగతి పౌరులు జైలు పాలు అయ్యేవారే అధికం అని ఈ చట్ట నిబంధనల వల్ల అర్థమవుతుంది.భారతీయ సురక్ష సంహిత కింద 15 రోజుల నుంచి, విడి విడిగా 40 రోజులు, 60 రోజుల దాకా; ఇంకా కొన్ని కేసుల్లో 90 రోజులూ జ్యుడిషియల్ కస్టడీ (అంటే కోర్టు సమీక్షించే కస్టడీ) పెంచడానికి చట్టాన్ని తయారు చేశారు. పోలీసు కస్టడీ అయితే ఇంకా మరీ ఇబ్బందికరమైనది. పోలీసులు కస్టడీలో ఉంచే కాలం 15 రోజుల నుంచి 60 రోజుల దాకా పెరుగుతుంది. మొదట 15 రోజుల దాకా కస్టడీలో పడే స్తారు. దర్యాప్తు చేయడానికి సమయం చాలలేదని... కస్టడీ సమయాన్ని పొడిగించమని కోరితే సురక్ష సంహిత నియమాల ప్రకారం మరో 15 రోజులు కస్టడీకి పంపుతారు. ఇలా 60 రోజుల దాకా కస్టడీలో ఉంచే అవకాశాన్ని కొత్త చట్టాలు ఇస్తున్నాయి. 10 ఏళ్ల జైలు శిక్ష విధించగలిగిన సెక్షన్ కింద అరెస్ట్ చేస్తే 40 రోజుల దాకా పోలీసులు కస్టడీలో పెట్టుకునే అధికారం పోలీసులకు దఖలుపడుతోంది. పోలీసులకు అపరిమిత అధికారాలు ఇచ్చి, పౌర హక్కులకు భంగం కలిగే అవకాశాన్ని కొత్తచట్టాలు ఇస్తున్నాయనేది మొత్తంగా మనం అర్థం చేసుకోవలసిన అంశం.మాడభూషి శ్రీధర్వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మంత్రివర్గ విస్తరణ జరగాలని, రాజ్యాంగ పరిరక్షుడిగా కనీసం 12 మంది మంత్రులు నియమితులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వంలో సీఎంతో కలిపి 15 శాతం మంది కన్నా మంత్రులు ఎక్కువ ఉండరాదని, 12 శాతం కన్నా తక్కువ ఉండొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఏ) చెబుతోందని, ఆర్టికల్ 163(1) ప్రకారం ముఖ్యమంత్రిసహా మంత్రులంతా గవర్నర్ విధులకు సహాయంగా ఉండడంతోపాటు సలహాలివ్వాలని స్పష్టంగా ఉందని, అయినా సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని బే«ఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మొత్తంం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయని, అయినా సీఎంకు తోడు కేవలం ఒక్కమంత్రి మాత్రమే ప్రమాణం చేశారని, ఆయనకు కూడా నాలుగు శాఖలే కేటాయించారని తెలిపారు. 33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, సమీక్షలు జరపడం కేవలం ముఖ్యమంత్రి, హోంమంత్రి వల్ల కాదని తెలిపారు. 2014 తర్వాత ఐదేళ్లపాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో ఓట్లేసి టీఆర్ఎస్కు పట్టం కడితే అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 9 నెలల పాలన కుంటుపడిందని, ఇప్పుడు పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు, అనంతరం మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉండే పరిస్థితుల్లో కనీసస్థాయిలో మంత్రులు లేకుండా పాలన ఎలా జరుగుతుందని ఆ లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా వెంటనే స్పందించి రాష్ట్రంలో కనీసం 12 మంది మంత్రుల నియామకం జరిగేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు. గవర్నర్ వత్తాసు పలుకుతున్నారు... ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే రాష్ట్ర గవర్నర్ వాటికి వత్తాసు పలుకుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ అధికార ప్రతినిధులు చరణ్‌కౌశిక్ యాదవ్, నిజాముద్దీన్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనభలో గవర్నర్ ప్రసంగం ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని, ప్రభుత్వం ఏది చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు చేయడం, వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను విడవకుండా 1,000 సర్పంచ్ స్థానాలను గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్థిక, అంగబలాలతో ప్రభుత్వం బెదిరించినా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ అర్థమవుతుందన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిజమేనని నిపుణులు తేల్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్ సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్ కె.పరాశరన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి. దివ్యాంగుల సౌకర్యం పట్టదా? రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. -
ఆధార్‌పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆధార్ పథకం, దాని అమలుకు రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు మొత్తం 31 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిలో హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టుస్వామి దాఖలు చేసిన పిటిషనూ ఉంది. ఈ పిటిషన్లపై నాలుగున్నర నెలల వ్యవధిలో మొత్తం 38 రోజులు ధర్మాసనం వాదనల్ని ఆలకించింది. 1973లో చారిత్రాత్మక కేశవానంద భారతీ కేసు అనంతరం ఎక్కువ రోజులు విచారించిన కేసు ఇదే. ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘సేవలు అందించేందుకు ఆధార్ చట్టం మాధ్యమం కాదు. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గౌరవం, స్వేచ్ఛకు భద్రత లేదు. ధ్రువీకరణ అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ధ్రువీకరణలో విఫలమైతే సేవల్ని నిరాకరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు’ అని వాదించారు. ఆధార్ సమాచారాన్ని పొందేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతిచ్చారని, ఈ చట్టానికి ఎలాంటి భద్రతా లేదన్నారు. ఆధార్ వంటి చట్టానికి నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఆధార్ కేవలం బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదని.. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, ఇతర అంశాలకు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసులో కక్షిదారుల పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి.చిదంబరం, శ్యామ్ దివాన్, కేవీ విశ్వనాథ్, ఆనంద్ గ్రోవర్, సజన్ పూవయ్యలు వాదనలు వినిపించారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా, సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, నిఖిల్ డే, నచికెత్ ఉడుప తదితరులు ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ(యూఐడీఏఐ), మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఆధార్‌కు అనుకూలంగా వాదనలు వినిపించగా.. వారి తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్, లాయర్లు రాకేశ్ ద్వివేది, జయంత్ భూషణ్‌లు వాదించారు. -
‘స్థానిక’ పాలనకు సెగ!
‘దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు.. ప్రజాస్వామ్యానికి పంచాయతీలే మూల స్తంభాలు.. వాటిని పటిష్టం చేస్తాం.. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం అధిక నిధులిస్తాం. అధికారాలు కట్టబెడతాం!’- ఇదీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నేతల హామీ! తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తీరు మారిపోయింది. పంచాయతీలను పటిష్టం చేయాల్సింది పోయి మూలస్తంభాల్నే కదిపేస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఉన్నచోట కమిటీలు చెప్పిందే వేదం, చేసిందే చట్టంలా ఉంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో మొత్తం 1,036 గ్రామ పంచాయతీల్లో చాలాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు విజయం సాధించారు. వారి హయాంలో అభివృద్ధి పనులు చేపడితే గ్రామాల్లో తమ పలుకుబడి ఎక్కడ తగ్గిపోతుందోనని తెలుగు తమ్ముళ్లకు ఆందోళన మొదలైంది. ఈ సమయంలో తమ్ముళ్ల అధికార దాహాన్ని తీర్చుతూనే మరోవైపు పంచాయతీల నిధులను గుప్పిట పట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు తెరలేపింది. రాజ్యాంగబద్ధతలేని ఇలాంటి కమిటీల కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటైన స్థానిక సంస్థలకు చేటుచేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సమక్షంలోనే పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, వాటికి అర్హుల జాబితా తయారీలో సలహాలు తీసుకోవాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కమిటీలకు అధ్యక్షుడు సర్పంచే అయినా మిగతా ఐదారుగురు సభ్యులు టీడీపీ వారే ఉండటం గమనార్హం. అన్నింటా పచ్చపాతమే.. ఏటా అక్టోబర్ 2న గ్రామసభ నిర్వహించాలి. కానీ రెండేళ్ల నుంచి ఆర్నెల్లకోసారి నిర్వహించాలని ప్రభుత్వం మార్పులు చేసింది. సాధారణంగా సర్పంచ్ అధ్యక్షతన, పాలకవర్గం లేదా సర్పంచ్ లేనిచోట ప్రత్యేకాధికారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. గ్రామంలో చేపట్టే వివిధ కార్యక్రమాలను కార్యవర్గం గ్రామస్తుల దృష్టికి తీసుకొస్తుంది. అది ఏ నిర్ణయమైనా గ్రామ కార్యవర్గానిదే పైచేయి. కానీ ఇప్పుడు గ్రామంలో రేషన్‌కార్డులు ఇవ్వాలన్నా, దీపం పథకం కింద వంటగ్యాస్, ఇళ్లస్థలాలు, పింఛన్లకు అర్హులను ఎంపిక చేయాలన్నా, పంపిణీ చేయాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులదే నిర్ణయం. దీంతో తెలుగు తమ్ముళ్లు పచ్చ పార్టీకి ఓటు వేసినవారికే పథకాలు కట్టబెడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే లబ్ధిపొందుతున్నా అధికారులకు చెప్పి జాబితా నుంచి తప్పిస్తున్నారు. ఇదేమి అన్యాయమని ఎవరైనా సర్పంచ్ ప్రశ్నిస్తే.. జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసి చెక్ పవర్‌ను రద్దు చేయించేస్తున్నారు. అలాగే ప్రతిపక్షం మద్దతున్న సర్పంచ్‌లను అధికార పార్టీలోకి బలవంతంగా రప్పించేందుకు ఇదే తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి 13వ, 14వ ఆర్థిక సంఘాల నిధులు వచ్చేవి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభించిన తర్వాత 60 శాతం పనులు చేయిస్తే 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇలా గ్రామంలో ఒక్కో మనిషికి రూ.379 చొప్పున మంజూరవుతోంది. నేరుగా గ్రామాలకు వచ్చే ఈ నిధులను తన చేతుల్లోకి తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పాచిక వేసింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు తనకిస్తే మ్యాచింగ్ గ్రాంట్‌కు తామే నిధులు కట్టి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయిస్తామని చెబుతోంది. దీన్ని సర్పంచ్ల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నేడు చర్చావేదిక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం చర్చావేదిక ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు నిబంధనల ప్రకారం వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులను వేరేచోటకు బదిలీ చేయించి, తమకు అనుకూలమైనవారికి తెచ్చుకోవడానికి తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్యదర్శులు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పుచేతుల్లో ఉండాల్సిన పరిస్థితి. స్థానిక పరిపాలనను వికేంద్రీకరించాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తోంది. - అక్కిరెడ్డి మహేశ్, ఉప సర్పంచ్, దివాన్‌చెరువు జన్మభూమి కమిటీలు అప్రజాస్వామికం జన్మభూమి కమిటీలు స్థానిక స్వపరిపాలనకు చేటు తెస్తున్నారుు. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం బదులు పెత్తనం పార్టీ పెత్తనాన్ని రుద్దడం అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం. జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీ సమక్షంలో రెండు వారాల క్రితం నిర్వహించిన జిల్లాలోని సర్పంచ్ల సమావేశంలో జన్మభూమి కమిటీలను వ్యతిరేకిస్తూ తీర్మానం ఇచ్చాం. - గండి నానిబాబు, సర్పంచ్, తోకాడ