consumer demand
-
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్‌ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్‌గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్‌కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్‌లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
ఇకపై కన్జూమర్ గూడ్స్, సిమెంట్ స్పీడ్
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్ డ్యురబుల్స్, సిమెంట్ రంగాలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్ బ్రోకింగ్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. మార్కెట్లు బలపడొచ్చు మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్ చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావచ్చు. యూఎస్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. ఐపీవోల జోరు గత మూడు నెలల్లోనే 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. దీంతో రానున్న కాలంలో ప్రైమరీ మార్కెట్ వెలుగులో నిలవనుంది. ఇందుకు జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు సహకరించనున్నాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న స్పెషాలిటీ కెమికల్స్ రంగం స్వల్ప కాలంలో అంత జోరు చూపకపోవచ్చు. పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా లాభపడటమే దీనికి కారణం. అయితే దీర్ఘకాలంలో ఈ రంగంపట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ రంగంలో అతుల్, పీఐ ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫక్టాంట్స్ను పరిశీలించవచ్చు. క్యూ2పై అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆటో, సిమెంట్, ఐటీ, ఫార్మా, కెమికల్స్ రంగాలు పటిష్ట పనితీరు చూపే అవకాశముంది. వివిధ కంపెనీలు ప్రకటించే భవిష్యత్ ఆర్జన అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కారణంగా స్వల్ప కాలంలో డిమాండ్ పుంజుకోవచ్చు. -
ఇది పేదరికానికి సూచిక!
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వస్తువులను వాడటంలో వినియోగదారుల డిమాండ్‌కు సంబంధించి జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఓ) ఓ సర్వేను విడుదల చేసింది. సర్వే ప్రకారం గత నలబై ఏళ్లుగా ఎన్నడు లేని విధంగా గ్రామీణ డిమాండ్ పడిపోయిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం (2011-12) ప్రతి నెలలో 1,501రూపాయలు ఖర్చు చేసేవారని, కానీ ప్రస్తుతం (2017-2018) సర్వే ప్రకారం 3.7శాతానికి తగ్గి 1,446 రూపాయలు ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ నివేదికలు రూపొందించడానికి (2009-10)ను ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) (2011-12)లో 13శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మరోవైపు గ్రామాల్లో వినియోగదారుల వ్యయం 2018సంవత్సరంలో 8.8శాతం తగ్గగా.. నగరాల్లో 2శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ తగ్గడమనేది దేశంలో పెరుగుతున్న పేదరికానికి సూచిక అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పన్ను చెల్లింపుదారులకు ఊరట?
సాక్షి,ముంబై: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపు దారులకు మరోసారి శుభవార్త అందించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక మందగమనంపై వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను పెంచే ఉద్దేశంతో మరిన్ని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులకు పలు రాయితీలు ఇవ్వనున్నట్లు ఓ నివేదిక తెలిపింది. తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోదీ ప్రభుత్వం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ పరిమితులను మరింతగా పెంచే ప్రతిపాదనను తీసుకొస్తున్నట్లు తెలిపింది. త్వరలో గృహ అద్దె చెల్లింపులు, బ్యాంక్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీలో మరిన్ని పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మరిన్ని విప్లవాత్మక చర్యలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా 1 మిలియన్ రూపాయల స్లాబ్ ప్రస్తుతం 30శాతంగా ఉంది. ఈ ఏడాది స్థూల జీడీపీలో ద్రవ్య లోటును 3.3 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నారని నివేదిక గుర్తు చేసింది. ఇటీవల ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించడం వల్ల ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉపశమనం లభించిందని తెలియజేసింది. అయితే ఈ అంశంపై ఆర్థికశాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కాగా, వ్యక్తిగత పన్ను సంవత్సరానికి 2,50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 5 శాతం విధిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో టాప్ మార్జినల్ టాక్స్ రేటు 50 మిలియన్ రూపాయల ఆదాయానికి 42.74 శాతం విధిస్తున్నారు. కేపీఎమ్‌జీ డేటా ప్రకారం ఇది ఆసియా సగటు 29.99 శాతం కంటే ఎక్కువని నివేదిక తెలిపింది. కాగా, దేశ జనాభాలో కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తారని ప్రపంచ సగటు కంటే పన్ను, జీడీపీ నిష్పత్తి 11శాతం ర్యాంకులు తక్కువగా నమోదవడం గమనార్హం. -
వాహన విక్రయాలు ఢమాల్...
• 16 ఏళ్ల కనిష్టానికి పతనం • డీమోనిటైజేషన్ దెబ్బతో విలవిల • సియామ్ గణాంకాలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్ డిమాండ్‌ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్ తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్ స్థాయికి పడిపోయాయి. ⇔ 2015 డిసెంబర్లో 15,02,315 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2016 డిసెంబర్లో 12,21,929 యూనిట్లకు క్షీణించాయి. 2000 డిసెంబర్నుంచి ఈ స్థాయిలో సేల్స్ తగ్గడం ఇదే తొలిసారి. ⇔ 2015 డిసెంబర్లో 1,72,671 యూనిట్లుగా ఉన్న దేశీ కార్ల విక్రయాలు 2016 డిసెంబర్ నెలలో 8.14 శాతం క్షీణతతో 1,58,617 యూనిట్లకు పతనమయ్యాయి. 2014 ఏప్రిల్ నుంచి చూస్తే విక్రయాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ⇔ మొత్తం టూవీలర్ అమ్మకాలు 22.04% క్షీణతతో 11,67,621 యూనిట్ల నుంచి 9,10,235 యూనిట్లకు తగ్గాయి. సియామ్ గణాంకాలను నమోదుచేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి (1997) చూస్తే ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గడం ఇదే ప్రధమం. పాత కార్ల విక్రయాలదీ అదే తీరు పెద్ద నోట్ల రద్దు... పాత కార్ల విక్రయాల మార్కెట్‌నూ పడకేసేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత వినియోగదార్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో పాత కార్ల విక్రయాలు 42 శాతం క్షీణించాయి.