contour
-
హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్ ప్లాన్, మార్కెట్ ఆధారిత ప్లాన్ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. -
బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..
హైదరాబాద్ : కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కొల్లేరు కాంటూరుపై మంగళవారం సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో కొల్లేరు కాంటూరుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అన్నారు. -
చంద్రబాబుకు అప్పుడు గుర్తు రాలేదా: వైఎస్ జగన్
హైదరాబాద్ : కొల్లేరు కాంటూరు సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కొల్లేరును మూడో కాంటూరు వరకూ కుదించాలని ప్రభుత్వం మంగళవారం సభలో తీర్మానం పెట్టింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 2008లోనే కొల్లేరుపై తీర్మానం జరిగిందరి, కొల్లేరు కాంటూరుపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతవాసులు జీవనాన్ని అధ్యయనం చేసేందుకు వైఎస్ఆర్ కమిటీ కూడా వేసినట్లు చెప్పారు. 2008 నాటి తీర్మానాన్నిముందుకు తీసుకు వెళ్లాలని... రాజకీయ అవసరాల కోసం మరోసారి తీర్మానమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలపై కాస్తోకూస్తో టీడీపీకి ప్రేమ వచ్చినందుకు సంతోషమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కొల్లేరు సమస్య గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుపైనే కొల్లేరులో చెరువులు ధ్వంసం అయినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.