contraceptive injection
-
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్‌ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్‌ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్‌తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్‌ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
ఇక గర్భ నిరోధానికి ఇంజెక్షన్లు!
అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే ఆడవాళ్లకు టూబెక్టమీ ఆపరేషన్ సహా పలు మార్గాలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి. నిరోధ్‌ల వల్ల భావ సంతప్తి కలగదనే భావం చాలా మందిలో ఉండడంతో ఆడవాళ్లకు తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత పరిశోధకులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. చివరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ దిశగా 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించింది. గర్భ నియంత్రణ కోసం మగవాళ్లకు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టింది. ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. వరి బీజం నుంచి వీర్యం బయటకు రాకుండా ఈ ఇంజెక్షన్ అడ్డుకుంటుందని సీనియర్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన శర్మ చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి లాంఛనంగా భారత్ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్’ అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి దేశాల్లో మహిళలు గర్భం రాకుండా 70శాతం మంది మాత్రలు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మహిళలు టూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. భారత్‌లో 50 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లు వాడుతుండగా, మిగతా మహిళల్లో ఎక్కువ మంది మగవారి నిరోధ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్‌లో గణనీయంగా ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు కనుగొన్న ఇంజెక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రపంచంలో గర్భ నిరోధానికి మగవారికి ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోందని డాక్టర్ శర్మ తెలిపారు. 303 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన చెప్పారు. -
ఏడాది పాటు కండోమ్ అక్కర్లేదట!
చాలాకాలం నుంచి పురుషులు ఎదురు చూస్తున్న ఆవిష్కరణ దాదాపు సిద్ధమైపోయింది. ఏడాది పాటు కండోమ్‌లు వాడక్కర్లేకుండా వాసాజెల్ అనే ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించాలంటే ఉన్న మార్గాలు రెండే. శాశ్వతంగా అయితే వాసెక్టమీ చేయించుకోవడం, తాత్కాలికంగా అయితే కండోమ్‌లు వాడటం. అయితే, కండోమ్‌లు వాడుతున్నా కూడా 18 శాతం కేసుల్లో వాళ్ల భాగస్వాములు గర్భం దాలుస్తున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. అందువల్ల తాత్కాలికంగా కొన్నాళ్లపాటు తమ భాగస్వాములకు గర్భం రాకూడదని అనుకుంటే నూటికి నూరుశాతం సురక్షిత విధానం అన్నది ఇంతవరకు లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న వాసాజెల్ ఇంజెక్షన్‌ను మగ కుందేళ్లకు ఇచ్చినపుడు ఏడాది పాటు వాటి వల్ల సంతానం కలగలేదు. తాము అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలే కనిపించాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇలినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డోనాల్డ్ వాలర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్‌కు ఉన్న హైడ్రోజెల్ లక్షణాల కారణంగా ఇది సుదీర్ఘకాలం పాటు గర్భనిరోధకంగా పనిచేస్తుందని వాలర్ చెప్పారు. ప్రయోగంలో భాగంగా 12 కుందేళ్లకు వృషణాల నుంచి వీర్యం వెళ్లే మార్గంలో ఈ జెల్ ఇంజెక్ట్ చేశారు. వాటిలో 11 కుందేళ్లకు సెమెన్లో అసలు వీర్యకణాలు లేవని తేలింది. మిగిలిన ఒక్కదానికి కూడా అత్యంత తక్కువ సంఖ్యలోనే వీర్యకణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఏడాది చివర్లో మనుషులపై కూడా దీనిపై ఔషధ ప్రయోగాలు జరుగుతాయని అంటున్నారు.