గోదావరి కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
10 మంది మహిళలను కాపాడిన స్థానికులు
తప్పిన ముప్పు
హుస్సేన్‌పురం (సామర్లకోట) :
ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఇక్కడకు సమీపంలోని హుస్సేన్‌పురం వద్ద గోదావరి కాలువలోకి దూసుకుపోయింది. స్థానికులు సకాలంలో స్పందించి రక్షించడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చిన్న ద్వారపూడికి చెందిన 10 మంది మహిళలు మంగళవారం సామర్లకోటలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు. ఆటో కెనాల్ రోడ్డులోని సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ దాటిన తరువాత రోడ్డుపై ఉన్న గోతిలో పడింది. దాంతో ఆటో అదుపు తప్పి హుస్సేన్‌పురం వద్ద గోదావరి కాలువలోకి దూసుకుపోయింది. ప్రాణభయంతో మహిళలు కేకలు పెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో నుంచి మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆటో బురదలో చిక్కుకు పోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఆటోలో కె.రాఘవ, ఉషారాణి, రామలక్ష్మి, కల్యాణి, నవీనకుమారి, సత్యగంగ, శ్రీదేవి, లక్ష్మి, అనుశ్రీ , స్వప్న ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కె.రాఘవ మనవడు స్వల్పంగా గాయపడ్డాడు. వేట్లపాలెంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడ్ని కాకినాడ తీసుకు Ðð ళ్లారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.