అదుపు తప్పి.. గోదావరిలోకి..
Published Fri, Oct 7 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
రాజమహేంద్రవరం క్రైం :
ఇసుకను లోడ్ చేస్తుండగా ఓ లారీ గోదావరి లోకి దూసుకుపోయింది. క్రేన్ల సాయంతో దాన్ని బయటకు లాగారు. వివరాలు..రాజమహేంద్రవరంలోని మార్కండేయస్వామి గుడి సమీపంలోని ఇసుక ర్యాంపులో శుక్రవారం నావలోని ఇసుకను లారీలోకి లోడ్ చేస్తున్నారు. లారీ ఇంజన్ ఆ¯Œæలో ఉంచి, వెనుక చక్రాల కింద రాయి పెట్టి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గేర్ న్యూటర్‌లో వెళ్లి లారీ వెనుకకు వెళ్లిపోయింది. ఇసుకను లోడ్ చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా పక్కకు తప్పకున్నారు. నావను ఢీకొన్న లారీ అలాగే గోదావరిలోకి మునిగిపోయింది. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో మునిగిపోయిన లారీకి తాళ్లు కట్టి క్రేన్లను ఉపయోగించి ఒడ్డుకు లాగారు. ఈ ఘటనలో ఇసుకను లోడ్ చేస్తున్న ఓ కార్మికుడు స్వల్పంగా గాయపడ్డాడు.
Advertisement
Advertisement