controversial book
-
అతడికి మతిపోయింది.. నన్నేం పీకలేడు
వాషింగ్టన్ : వైట్‌హౌజ్ మాజీ ఉద్యోగి స్టీవ్ బన్నొన్ ఓ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెను కలకలమే రేపుతోంది. అధ్యక్షభవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు పుసక్తంలో చేశారు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ తనయుడు, ఓ రష్యన్ లాయర్‌తో భేటీ అయ్యారని.. అది ముమ్మాటికీ దేశవ్యతిరేక చర్యేనని బన్నోన్ అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు, బిలినియర్లు ట్రంప్ ను నిలదీయగా.. అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి వచ్చింది. ‘‘స్టీవ్ బన్నొన్ నన్ను, నా అధ్యక్ష పదవిని ఏం చేయలేడు. అతడి ఉద్యోగం మాత్రమే కాదు.. మతిని కూడా పొగొట్టుకున్నాడు. వాడొక పిచ్చోడు. వాడికి మైండ్ పోయింది. పట్టించుకోకండి’’ అంటూ ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ అనే ఆ పుస్తకాన్ని బన్నోన్ అందించిన సమాచారం మేరకు మైకేల్ వోల్ఫ్ అనే జర్నలిస్ట్ ప్రచురిస్తున్నారు. ఇదే పుసక్తంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన కొన్ని సంచలన వ్యాఖ్యలను.. రష్యాతో ట్రంప్ కుటుంబం కొనసాగించిన సత్సంబంధాలు గురించి కూడా ఆయన ప్రస్తావించాడంట. వచ్చే వారమే ఆ పుసక్తం ముద్రణ కానుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. ఏరి కోరి శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్తగా బన్నోన్ను నియమించుకున్న ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో మనీలాండరింగ్ ఆరోపణలు రావటంతో గత ఆగస్టులో ఆయనను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎఫ్‌బీఐ నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. -
అబద్ధాలకోరు... సారీ చెప్పాడు
సాక్షి, సినిమా : విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎట్టకేలకు వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాడు. తన ఆత్మకథ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. పుస్తకంలో సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్లో సిద్ధిఖీ స్పందించాడు. క్షమాపణలు తెలియజేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ‘‘నా జ్ఞాపకాలు(పుస్తకం) ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి. నా పుస్తకాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ప్రకటించాడు. ఆన్ ఆర్డినరీ లైఫ్ పేరిట సిద్ధిఖీ రాసిన పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్‌వర్‌లు మండిపడ్డారు. పుస్తకం అమ్ముడు పోయేందుకు సిగ్గు లేకుండా కల్పితాలతో అబద్ధపు కథనాలు రాశాడంటూ తీవ్రంగా విమర్శించారు. నిహారిక అయితే ఓ అడుగు ముందుకేసి నటుడిపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే అతనికి దూరమైనట్లు మొదటి ప్రేయసి సునీత చెప్పటం విశేషం. I m apologising 2 every1 who's sentiments r hurt bcz of d chaos around my memoir #AnOrdinaryLife I hereby regret & decide 2 withdraw my book — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 30 October 2017 -
'ఆమె ఒక ఇటాలియన్'
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'ద రెడ్ శారీ' సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రెడ్ శారీ ఏంటనుకుంటున్నారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవిత చరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద పుస్తకం 'ఎల్ సారీ రోజో'. అనేక అభ్యంతరాల తర్వాత.. ఇది ఎట్టకేలకు 'ది రెడ్ శారీ' పేరుతో భారత్‌లో విడుదలైంది. స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకాన్ని అప్పటి నుంచి విడుదల చేసేందుకు రచయిత ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో దాన్ని ఇంగ్లీష్‌లో ప్రచురించేందుకు ఎవరూ సాహించలేదు. కాగా స్పానిష్ భాషలో తొలుత విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు మోరోకు 2010లో లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ పుస్తకంపై రచయిత మోరో మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇమేజ్ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందన్నారు. ''భారతీయ మహిళల్లో ఆమె చాలా బిజీ. ఆమె భారతీయురాలు అయినా... వాస్తవానికి సోనియా ఇండియన్ కాదు. భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నానని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు సోనియా తన ఫ్యామిలీతో వెళ్తే అక్కడ అన్నీ ఇటాలియన్ ఫుడ్‌నే ఇష్టపడతారు. అలాంటి ఆమె ఇండియాను పాలిస్తారా? ఆమె ఒక ఇటాలియన్'' అన్నారు. ఈ పుస్తకంపై మోరో శనివారం సాయంత్రం అయిదు గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇటలీకి చెందిన సోనియా.. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకున్నాక జరిగిన పలు సంఘటనలు, సోనియా అత్త, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చిచంపడంతో ఆమె భయాందోళనకు గురైనట్లు, ప్రధాని బాధ్యతలు స్వీకరించవద్దని రాజీవ్‌ను బతిమిలాడినట్లు ఆ పుస్తకంలో రాశారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు. -
దేశీ మార్కెట్లోకి సోనియాపై వివాదాస్పద పుస్తకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత చరిత్రకు కాస్త కల్పన జోడించి స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద ‘ఎల్ సారీ రోజో’ పుస్తకం ఎట్టకేలకు భారత మార్కెట్లో ‘రెడ్ శారీ’ పేరిట విడుదలైంది. ఇందులోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో దేశంలో ఈ పుస్తకాన్ని ఎవరూ ప్రచురించలేదు. స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు 2010లో మోరోకు లీగల్ నోటీసు పంపారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు. సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలను ఇందులో స్పృశించారు.