convicted leaders
-
ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు
సాక్షి,న్యూఢిల్లీ: దోషులుగా తేలిన రాజకీయ నేతలను తమ జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. దోషులపై జీవితకాల నిషేధం అమలైతే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ వంటి నేతలకు చుక్కెదురవుతుంది. ప్రస్తుత చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష ఎదుర్కొనే రాజకీయ నేతలు విడుదలైనప్పటి నుంచి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. దోషులగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఈసీ వాదిస్తోంది. ఈ ఏడాది జులైలో దీనిపై వాదనల సందర్భంగా ఈసీ సందిగ్థ వైఖరి తీసుకుంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం ఈసీ పరిధిలోనే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈసీ ఈ మేరకు స్పష్టమైన వైఖరితో కోర్టు ముందుకువచ్చింది. దోషులుగా తేలి శిక్షకు గురైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న అంశంపై ఈసీ మౌనంవీడి తన వైఖరిని తేల్చిచెప్పాలని జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన సుప్రీం బెంచ్ కోరింది. -
నేర చరిత నేతల బ్యాన్పై సుప్రీంలో వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా జీవిత కాలం నిషేధం విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత అశ్వని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. ఏదైనా నేరంలో ఛార్జ్‌షీట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన నేతల(ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై ఆరేళ్ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ నిబంధనను శాశ్వత నిషేధంగా మార్చాలంటూ బీజేపీ నేత అశ్వని పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ ఈసీతోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం ఏస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్ 14 ప్రకారం నేరచరిత నేతలపై బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. -
మన రాజకీయాల్లో.. ఎందరో దోషులు
భారత రాజకీయ నాయకుల్లో దోషుల సంఖ్యకు ఏమాత్రం కొదవలేదు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో వివిధ కేసులలో కొంతమంది నాయకులు దోషులుగా తేలారు. గడ్డి కేసు దగ్గర నుంచి నేరాల వరకు అనేక కేసులు వీటిలో ఉన్నాయి. మాయా కొద్నానీ లాంటి మహిళా నేతలు మత ఘర్షణల కేసులో దోషులుగా తేలారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు మన దేశంలో నేరస్థులుగా నిర్ధారణ అయిన నాయకుల పేర్లు ఒకసారి చూద్దాం... హర్చరణ్ సింగ్ బల్లీ ఓం ప్రకాష్ చౌతాలా ఫూలన్ దేవి బాలముకుంద్ గౌతమ్ సంతోక్‌బెన్ జడేజా పప్పూ కలానీ మాయా కొద్నానీ రషీద్ మసూద్ జగన్నాథ మిశ్రా మహ్మద్ సుర్తీ నీలలోహితదాసన్ నాడార్ రాజు పాల్ మనోజ్ ప్రధాన్ ప్రబోధ్ పురకాయత్ గోపాల్ రాజ్‌వానీ టీఎం సెల్వగణపతి మహ్మద్ షహాబుద్దీన్ జగదీష్ శర్మ సాధు శెట్టి సిబకతుల్లా అన్సారీ అక్షయ్ ప్రతాప్ సింగ్ సురభజన్ సింగ్ శిబు సోరెన్ మహ్మద్ తస్లీముద్దీన్