Cooking workers
-
బస్సులో వెళ్తుండగా గుండెపోటు.. కనికరించని డ్రైవర్, కండెక్టర్
సాక్షి, చైన్నె: బస్సులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఓ వంట మాస్టరు పట్ల ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ నిర్దయగా వ్యవహరించారు. మార్గం మధ్యలో ఆసుపత్రులు ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద బస్సు ఆపి దించేసి వెళ్లిపోయారు. దీంతో సకాలంలో చికిత్స అందక, సాయం చేసే వారు లేక రోడ్డుపైనే వంట మాస్టర్ గుండె ఆగింది. కాగా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు నల్ల కుట్రాలం ప్రాంతానికి చెందిన జ్యోతి భాస్కర్(55) వంట మాస్టర్, శంకరన్ కోయిల్‌లోని ఓ హోటల్లో పనిచేస్తాడు. రోజూ శ్రీవిళ్లిపుత్తూరు – శంకరన్ కోయిల్ మధ్య బస్సు ప్రయాణంతో విధులకు వెళ్లేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటిలాగే వేకువజామున ఇంటి నుంచి శంకరన్ కోయిల్‌కు తిరునల్వేలి వైపుగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ మార్గంలో చైన్నె వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం సహజం. కనికరం లేకుండా.. ఈ బస్సులో ప్రయాణించే సమయంలో మార్గం మధ్యలో రాజ పాళయం వద్దకు జ్యోతి భాస్కర్‌కు ఛాతినొప్పి రావడంతో తల్లడిల్లిపోయారు. సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉన్నా, డ్రైవర్, కండెక్టర్ మహేశ్, గోపాల్ కనికరించ లేదు. మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కనీసం ప్రథమచికిత్స కూడా అందించకుండా శంకరన్ కోయిల్‌కు వెళ్లకుండా క్రాస్ రోడ్డులో బస్సును ఆపేశారు. ఛాతి నొప్పితో తల్లడిల్లుతున్న వంట మాస్టర్‌ను బలవంతంగా బస్సు నుంచి దించేశారు. రోడ్డు పక్కగా ఉన్న ఓ టీ దుకాణం వద్ద కూర్చోబెట్టి బస్సును లాగించేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు పెద్దగా ఎవ్వరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. అయితే, బస్సులో ఉన్న ఓ యువకుడు ఎవరినో బలంతంగా కిందకు దించుతుండడాన్ని గుర్తించాడు. అయితే, అతడికి ఛాతినొప్పి విషయం తెలియనట్లుంది. చివరకు ఆ టీ కొట్టు వద్ద గుండె నొప్పితో కొట్టుకుని వంట మాస్టారు మరణించాడు. కాసేపటికి ఈ సమాచారం శంకరన్ కోయిల్ పరిసరాల్లో వ్యాపించింది. ఈ సమాచారం విన్న శంకరన్ కోయిల్ వరకు బస్సులో ప్రయాణించిన ఓ యువకుడి ద్వారా డ్రైవర్, కండెక్టర్ల దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కగా భాస్కర్‌ను వదిలి పెట్టి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, కండెక్టర్, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవత్వం మరిచిన ఈ ఇద్దరిన కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
‘గౌరవ’మేదీ..?
సాక్షి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పాఠశాలకు వచ్చే పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. పథకం విజయవంతంగా సాగుతున్నా.. భోజనం వండి వడ్డించే కార్మికుల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా ఉంది. నాలుగు నెలలుగా వీరికి గౌరవ వేతనం అందకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో.. వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ దసరాకైనా వేతనం అందుతుందని భావించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఇచ్చేది రూ.వెయ్యి.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహం భోజనం వండిపెట్టే కార్మికులకు గౌరవ వేతనం రూ.1000 ఇస్తున్నారు. కార్మికులు భోజనం వండి పెట్టడడంతోపాటు వడ్డించాలి కూడా. ఇన్ని పనులు చేసినా వారికి ఇచ్చే వేతనం ఎంతో తక్కువ. అదికూడా పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్ నుంచి కూడా అందడం లేదు. ఇచ్చే కొద్ది పాటి గౌరవ వేతనం కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అధికారులను అడిగినా వారు కూడా తెలియదని చెబుతున్నారు. వంట పని మానేస్తున్న కార్మికులు.. వేతనాలు సక్రమంగా అందక.. బిల్లులు సరిగా విడుదల కాక చాలా మంది కార్మికులు విధుల నుంచి తప్పుకుంటున్నారు. బయట వేరే పనిచేసుకున్నా అధికంగా డబ్బు సంపాధించవచ్చని.. ఇక్క నెల రోజులు కష్టపడి పనిచేసినా ఇచ్చేది.. వెయ్యి రూపాయలని.. అదీ సక్రమంగా అందకపోవడంతో చేసేదిలేక చాలా మంది కార్మికులు పని మానేస్తున్నారు. అదేబాటలో మరికొందరు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. జిల్లాలో 1700 మంది కార్మికులు.. జిల్లాలో మధ్యాహ్నా భోజన కార్మికులు దాదాపు 1700 మంది ఉన్నారు. వారు ప్రతి రోజు 1,11, 616 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. అయితే 2010 నుంచి కార్మికులకు గౌరవ వేతనం ఇస్తున్నారు. అప్పటి నుంచి సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతం. ఆశతో పనిచేస్తున్నాం మేము ఏళ్లతరబడి పనిచేస్తున్నాం. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అది ఎటూ సరిపోవడం లేదు. ప్రభుత్వం జీతం పెంచకపోవతుందా అన్న ఆశతో పనిచేస్తున్నాం. ఇచ్చే జీతం కూడా నెల నెల ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీతం పెంచి.. సక్రమంగా విడుదల చేసిన మమ్ములను ఆదుకోవాలి. – రమణ, మధ్యాహ్న భోజన కార్మికురాలు వంట పని మానేయమంటున్నారు.. నెలరోజులు కష్టపడి వంట చేస్తే అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎన్నోసార్లు వేతనం పెరుగుతుందని ఎదురుచూశాం.. కానీ పెంచలేదు. వంట పని మానివేయమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. ప్రభుత్వం అందరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తుంది. మాకు జీతాలైనా పెంచకపోతాతుందా.. అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతున్నాం. – స్వప్నారాణి, కార్మికురాలు -
అప్పుచేసి ‘మధ్యాహ్నం’
మూన్నెళ్లుగా అందని బిల్లులు * ఏజెన్సీ నిర్వాహకుల ఆందోళన * వంట కార్మికులకూ వేతనాలు కరువు నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘మధ్యాహ్న భోజన’పథకానికి సంబంధించిన బిల్లు లు మూడునెలలుగా పేరుకుపోయాయి.దీంతో పథకాన్ని అమలు పర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి పథకాన్ని అమలు పర్చక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం వారు నిత్యం మండల కేంద్రాల్లోని విద్యావనరుల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.11కోట్ల వరకు బకాయి పడినట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలుపుతున్నారు. జిల్లాలోని 2,303 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. వంటకార్మికులకు వెతలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండిపెడుతున్న కార్మికులకు సైతం మూడునెలలుగా వేతనాలు అందడంలేదు. 1నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు మధ్యాహ్నభోజనం తింటే ఒక్కొక్కరికి రూ.4.35 పైసలు, 6 నుండి10వ తరగతి వరకు చదివే విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.6 చొప్పున వేతనాలు ఇస్తారు. దీంతోపాటు 100 మందిలోపు విద్యార్థులు మధ్యాహ్నభోజనం చేసే పాఠశాలల్లో వంటచేసే వారికి నెలకు రూ.వెయ్యి, 100-200 మంది విద్యార్థులు భోజనంచేసే పాటశాలల్లోని నెలకు రూ.2వేలు, 200-300మంది విద్యార్థులు భోజనంచేసే పాఠశాలల్లో నెలకు రూ.3 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ఏజెన్సీ నిర్వాహకులకు, వంటచేసే కార్మికులకు సకాలంలో బిల్లులు, వేతనాలు అందకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల విద్యార్థులు సైతం నాణ్యమైన భోజనం పెట్టించేందుకు ఏజెన్సీలపై ఒత్తిడి చేయలేకపోతున్నారు.