కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్ కమింగ్..కన్ఫాం..
చైనా మొబైల్ మేకర్ కూల్ ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో త్వరలో లాంచ్ చేయనుంది. కూల్ ప్లే 6 పేరుతో ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఫేస్బుక్ పేజి, ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. అయితే మే నెలలో సాఫ్ట్ గోల్డ్ ,బ్లాక్ రంగులలో దీన్ని చైనాలో లాంచ్ చేసింది.
ద్వంద్వ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్‌సెన్సర్, 6 జీబీ ర్యామ్, పేరులోనే పేర్కొన్నట్టుగా గ్రేట్ గేమింగ్ డివైస్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా చెబుతున్న కంపెనీ దీని ధరను 1,499 యెన్లు(సుమారుగా రూ .14,000)గా నిర్ణయించింది. బ్యాటరీ సామర్ధ్యం 252గంటల స్టాండ్‌బై ఉంటుందనీ, దీంతో 9గంటలపాటు ఇండర్నెట్ బ్రౌజింగ్, 8 గంటల పాటు వీడియోలు వీక్షణం, 6గంటల పాటు వీడియో గేమింగ్ సౌలభ్యం ఉంటుందని కూల్‌ప్యాడ్ ప్రకటించింది.
కూల్ ప్లే 6 ఫీచర్లు
5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్
1080x1920 పిక్సెల్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653 ప్రాసెసర్
6 జీబీర్యామ్,
64జీబీ స్టోరేజ్,
విస్తరించుకునే సదుపాయం కూడా
రెండు 13-మెగాపిక్సెల్ కెమెరాలు విత్ సోనీ సెన్సార్
8 ఎంపీ సెల్పీ కెమెరా
4060ఎంఏహెచ్ బ్యాటరీ
Get ready to witness the new era of gaming with our upcoming flagship device on 20th August. #LiveToPlay pic.twitter.com/68WlJaMRIG
— Coolpad India (@CoolpadInd) August 11, 2017