గుర్తుతెలియని వారి చేతిలో మొసలి హతం
- తల, మొండెం వేరుచేసిన వైనం
- కర్నూలు మండలం బావాపురం వద్ద ఘటన
కర్నూలు సీక్యాంప్: మండల పరిధిలోని బావాపురం తుంగభద్ర తీరాన మంగళవారం ఒక మొసలిని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైంది. కొంత కాలంగా నదిలో నీరు తక్కువగా ఉండడంతో మొసలి దారి తప్పి పొలాల్లోకి వచ్చింది. అప్పటికే రాత్రి వేళల్లో పంటలకు నీరు పెట్టేందుకు వచ్చిన స్థానికులు మొసలిని చూసి భయంతో చంపేసినట్లు తెలుస్తోంది. మొసలి తల, మొండెం వేరు చేసి వెళ్లారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు ఆరా తీశారు.