Coromandel
-
అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు
పెడన: అయోధ్య బాలరాముని ఆలయానికి కృష్ణా జిల్లా పెడన నుంచి సహజ సిద్ధ కలంకారి వస్త్రాలను పంపించగా వాటిని మంగళవారం అలంకరించినట్లు పెడన కోరమండల్ కలంకారి వస్త్ర సంస్థ యాజమాని పిచ్చుక వరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. అయోద్య బాలరాముని ఆలయానికి చెందిన డిజైనర్ సహజ సిద్ధ కలంకారి వస్త్రాలు కావాలని కోరడంతో ఇటీవల ఆల్ ఆవర్, ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన ఎరుపు వస్త్రాన్ని పంపించామన్నారు. 10.5 మీటర్ల వస్త్రాన్ని స్వామి వారికి అలంకరించి ఆలయ వర్గాలు ఫొటోలు పంపించారని తెలిపారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్ కలర్, శనివారం నీలం, ఆదివారం పింకు రంగులలోని వస్త్రాలను కావాలని సూచించారని, ప్రస్తుతం ఎరుపు రంగు వస్త్రాన్ని డిజైన్ చేసి పంపించామన్నారు. మిగిలిన రంగులలో వస్త్రాలను కూడా త్వరలోనే పంపుతామన్నారు. డాక్టర్ వైఎస్సార్ లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు కుమారుడినయిన తనకు ఈ అవకాశం రావడం స్వామి అనుగ్రహమని వరుణ్ కుమార్ తెలిపారు. -
వైజాగ్‌లో కోరమాండల్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఎంఈసీఎస్ (మోన్శాంటో ఎన్విరో–కెమ్ సిస్టమ్స్), టీకేఐఎస్ (థిసెన్‌క్రప్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రోజుకు 1,650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. భారత్ ప్రస్తుతం సల్ఫ్యూరిక్ యాసిడ్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలన్న స్వావలంబన భారత్ లక్ష్య సాకారం దిశగా కొత్త ప్లాంటు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం వార్షికంగా 6 లక్షల టన్నులుగా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యం .. మరో 5 లక్షల టన్నుల మేర పెరిగి 11 లక్షల టన్నులకు చేరుతుంది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రస్తుతం వైజాగ్‌లోని కోరమాండల్ ఫ్యాక్టరీ ఏటా 13 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, దాదాపు 4 లక్షల టన్నుల క్యాప్టివ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. -
కోరమాండల్ లాభం రూ.366 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో క్రితంతో పోలిస్తే నికరలాభం సుమారు 5 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరింది. టర్నోవరు 36 శాతం అధికమై రూ.5,018 కోట్లకు ఎగసింది. ‘దక్షిణాదిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఏడాది రెండో భాగం అనుకూలంగా ఉంటుంది’ అని కంపెనీ ఎండీ సమీర్ గోయల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 3.03 శాతం పెరిగి రూ.391.55 వద్ద స్థిరపడింది. -
కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవం: నాగార్జున ఫెర్టిలైజర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోరమాండల్ ఇంటర్నేషనల్ తమ సంస్థను కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎఫ్సీఎల్) ఖండించింది. కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవాలని తెలిపింది. కంపెనీ గానీ ప్రమోటర్లు గానీ ఇందుకు సంబంధించి ఏ సంస్థతోనూ చర్చలు జరపడం లేదని ఎన్ఎఫ్సీఎల్ వివరించింది. తమకున్న వివిధ వ్యాపార విభాగాల్లో యూరియా కూడా ఒకటని తెలిపింది. గెయిల్ పైప్‌లైన్ ప్రమాదం కారణంగా యూరియా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని, నష్టాలు భర్తీ చేసుకునేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించింది. ప్రభుత్వం తాజాగా గ్యాస్ కేటాయింపులు జరపడంతో యూరియా ఉత్పత్తి మళ్లీ ప్రారంభించామని ఎన్ఎఫ్సీఎల్ తెలిపింది. -
ఎరువుల కంపెనీల పైనా హుదూద్ ప్రభావం