
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో క్రితంతో పోలిస్తే నికరలాభం సుమారు 5 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరింది. టర్నోవరు 36 శాతం అధికమై రూ.5,018 కోట్లకు ఎగసింది. ‘దక్షిణాదిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఏడాది రెండో భాగం అనుకూలంగా ఉంటుంది’ అని కంపెనీ ఎండీ సమీర్ గోయల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 3.03 శాతం పెరిగి రూ.391.55 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment