corporate bank
-
చిన్న పరిశ్రమలకు సాయం చేద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా కష్ట సమయంలో రీచార్జ్ ప్యాకేజితో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. ఎంఎస్ఎంఈల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నాబార్డు కూడా దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. రాష్ట్రంలో 2022 –23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.52,468.55 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇందులో మూల ధనం కింద రూ.18,400.93 కోట్లు, పెట్టుబడి రుణం కింద రూ.34,067.62 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహాయం అందించాలని చెప్పింది. మూత పడిన యూనిట్ల పునరుద్ధరణకు బ్యాంకులు ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ పత్రంలో నాబార్డు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సమీక్షించనుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సిఫారసులు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించనుంది. -
ఎంఎస్ఎంఈలకు రూ.42,206 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు రూ.42,206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ఉద్యోగావకాశాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ పత్రంలో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘వైఎస్ఆర్ నవోదయం’ పేరిట ఒన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ(రీస్ట్రక్చరింగ్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ఇందులో భాగంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు చెందిన రూ.3,900 కోట్ల మేరకు రుణాలను ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న 86 వేల ఎంఎస్ఎంఈల్లో 80 వేల ఎంఎస్ఎంఈలు రూ.పది లక్షలలోపు రుణాలు కలిగి ఉండగా వాటన్నింటినీ ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా ఎంఎస్ఎంఈలు పది లక్షల రూపాలయకుపైగా రుణాలు కలిగినవి ఉండగా, వాటిలో ఇప్పటివరకు 2,500కుపైగా ఎంఎస్ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు, రైతులకు అవసరమైన నైపుణ్యత పెంపు, అలాగే ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ ఫోకస్ పత్రంలో వివరించింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని నాబార్డు కోరింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. -
ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్ షేర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ శైలేష్ జైన్ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్ త్రైమాసికం నుంచి మార్కెట్ పరిస్థితులు మరింత సానుకూలంగా ఉండవచ్చని జైన్ చెప్పారు. రంగాలవారీగా చూస్తే కార్పొరేట్ బ్యాంకులు, టెలికం వంటివి ఆకర్షణీయంగా బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు. క్వాంట్ ఫండ్..: ఈ సందర్భంగా టాటా క్వాంట్ ఫండ్ వివరాలను జైన్ వెల్లడించారు. జనవరి 3న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం 17న ముగియనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతల ఆధారంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి విధానం ఉంటుందని జైన్ చెప్పారు. మెరుగైన రాబడులు ఇచ్చేందుకు, రిస్కులను తగ్గించేందుకు ఇది గణనీయంగా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
దారుణం!
సాక్షి, నిజామాబాద్: పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ నైజాన్ని కొనసాగిస్తున్నారు. ఖరీఫ్‌లో అంతంత మాత్రం గానే రుణాలిచ్చిన బ్యాంకులు ఈ రబీలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. రైతులు పంటలు సాగు చేసుకుని రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ బ్యాంకర్లు మాత్రం నిర్దేశిత లక్ష్యంలో కనీసం సగం మందికి కూడా అప్పులివ్వలేదు. అప్పు కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన పరి స్థితి రైతన్నలకు ఎదురవుతోంది. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా రూ. 768.40 కోట్ల మేరకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ నవంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు కేవలం రూ. 312.58 కోట్లు మాత్రమే విది ల్చాయి. ఈ నెలలో కూడా నామమాత్రంగానే రుణ మంజూరు జరిగింది. మొత్తం మీద రబీ నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా రుణాలివ్వలేదు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో జరగనుంది.గతంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హెచ్చరించినా బ్యాంకర్ల తీరు మాత్రం మారడం లేదు. ఈసారి కూడా ప్రజాప్రతినిధులు బ్యాంకర్ల తీరుపై మండిపడే అవకాశాలున్నాయి. కీలక సమయంలో అప్పుపుట్టక.. సాధారణంగా పంటలు విత్తుకునే సమయంలోనే రైతులకు పెట్టుబడులు అవసరపడుతాయి. దుక్కిదున్నుకోవడానికి, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చులు ఇలా ఎకరానికి సుమారు రూ.పది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్యాంకర్లు మాత్రం ఈ కీలక సమయంలో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వడ్డీల భారం మీద పడి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నపరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకర్లు మాత్రం రబీ రుణాల మం జూరుకు మార్చి వరకు గడువుందనే సాకుతో దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో రైతులు సంస్థేతర రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. అన్ని బ్యాంకులదీ ఇదే తీరు.. జిల్లాలో 30 బ్యాంకులకు సంబంధించి 293 శాఖల ద్వారా పంట రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది రుణ ప్రణాళిక నిర్దేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి ఆయా బ్యాంకులు ఇచ్చిన రబీ రుణాల తీరును పరిశీలిస్తే.. 65 ఎస్బీహెచ్ శాఖల ద్వారా రూ.175.86 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, ఈ బ్యాంకు కేవలం రూ. 73 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఆంధ్రాబ్యాంకు రుణ మంజూరు అధ్వానంగా తయారైంది. 29 శాఖల ద్వారా రూ.130 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.49.68 కోట్లు మాత్రమే విదిల్చింది. 25 సిండికేట్ బ్యాంకు శాఖల ద్వారా రూ. 93.71 కోట్ల అప్పులివ్వాల్సి ఉండగా, రూ. 36 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎస్బీఐ 18 శాఖల ద్వారా రూ. 14.97 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 6.23 కోట్లతో సరిపెట్టింది. సహకార బ్యాంకుల తీరు ఇలాగే ఉంది. దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎన్డీసీసీబీ కలిపి 85 శాఖల ద్వారా రూ.282.67 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం రూ.117.76 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయి. ఇక ప్రైవేటు సెక్టార్లో ఉన్న పది బ్యాంకుల తీరు మరీ దారుణంగా ఉంది. వీటికి నిర్దేశించిన నామమాత్ర లక్ష్యం మేరకు కూడా రుణాలివ్వలేదు. హెచ్డీఎఫ్సీ, ఇంగ్వైశ్య, ఐసీఐసీఐ, యాక్సిస్, ధనలక్ష్మి, కరూర్‌వైశ్య, సిటీయూనియన్, కర్నాటక బ్యాంకులకు చెందిన 32 శాఖల ద్వారా రూ. 15.78 కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించగా, కేవలం రూ. 6.52 కోట్లు మాత్రమే ఇచ్చాయి. -
కార్పొరేట్ బ్యాంకుల దోపిడి దొంగల అరెస్టు