Corporate Culture
-
కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్‌లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్‌నవూలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాయ్ రాజా.. కాయ్
- జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు - రూ.కోట్లలో పందేలు - నిండా మునుగుతున్న జనం - వ్యవహారమంతా ఫోన్, ఆన్లైన్లోనే.. - కార్పొరేట్ కల్చర్‌కు ఖాకీల వత్తాసు! మెదక్ టౌన్: జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ వ్యవహారం భారీగా సాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. క్రికెట్ మాయలో పడ్డ కొందరు బెట్టింగ్ కడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు అప్పులు సైతం చేసి ఇందులో పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో పోలీసులు సరైన తీరుగా స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్-8లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. కార్పొరేట్ విష సంస్కకృతి నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలు, పచ్చని పల్లెల్లోనూ చిచ్చు రేపుతోంది. జెంటిల్మెన్ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్ ఆట ప్రపంచీకరణలో భాగంగా పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. ఇందులో భాగంగా బెట్టింగ్‌ల వ్యవహారమంతా ఫోన్లు, ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పొట్టిఫార్మాట్ 20-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లను అంగట్లో సరుకుగా కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. దీనికి బడా పారిశ్రామికవేత్తలు, సినీ బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కో టీమ్‌ను చేజిక్కించుకోవడాన్ని చూస్తే కార్పొరేట్ విష సంస్క ృతి ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జోగిపేట, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో కేవలం ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్టు సమాచారం. బెట్టింగ్‌లను అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన 20-20 మ్యాచ్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బెజుగం నరేన్కుమార్, తునికి లక్ష్మణ్‌రెడ్డి, భాను, మాడపాటి స్వామిసతీష్, పట్లోళ్ల సంతోష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.6 వేల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్‌లో ఆరుగురిని పట్టుకున్నారు. స్థానికంగా పలుకుబడి గల అధికార పార్టీ నేత అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ‘ఖాకీలకు’ లక్ష రూపాయలిచ్చి వారిని తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. యువకులు పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు కూడగట్టుకుంటున్న వారు కొందరైతే... ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతూ లబోదిబోమంటున్న వారు కొందరు. ఇంకొందరూ భార్య మెడలోంచి పుస్తెలతాడు, వాహనాలు, సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని సైతం తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. నిఘా పెట్టాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతోపాటు భారీగా డబ్బులు వసూళ్లు చేస్తూ ఈ దందాను అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు శాఖ మొద్దునిద్ర వీడి బెట్టింగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. అమాయకులు బలి... క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటూ మెదక్ పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని చూపెడతామంటూ సాయంత్రం 6.30 గంటలకు మీడియాను ఆహ్వానించారు. కబురు అందుకొని స్టేషన్‌కు వచ్చిన విలేకరులను గంటపాటు కూర్చోబెట్టారు. అనంతరం స్థానిక సీఐ సాయీశ్వర్‌గౌడ్ మళ్లీ వస్తానంటూ బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో సీఐ తీరుపై విలేకరులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్ర్కమించారు. -
తమ్ముళ్లతోనే తస్మాత్ జాగ్రత్త బాబూ!
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌నే పదవీ భ్రష్టుణ్ని చేసిన చంద్రబాబు పార్టీలో సెంటిమెంటుకు, నిబద్ధతకు విలువ ఏముంటుంది? అసంతృప్తితో రగులుతున్న తెలుగు తమ్ముళ్లు అవసరం వస్తే బాబునూ ఆపదలోకి నెట్టగలరు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే వింత పరి ణామాన్ని చూస్తున్నాం. తమ అంతేవాసులు, తాము పైకి తెచ్చిన వారు, తమకు పదవి లభించడంలో ప్రధానపాత్ర పోషించిన వారి చేతులలోనే అటు నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు నాయుడు బందీ లైనట్లు కన్పిస్తోంది. ఇరువురూ ఆంతరంగికుల వద్దనైనా తమ పరివారం తెప్పిస్తున్న తలనొప్పులకు తలలు నొక్కుకోక తప్పడంలేదు. పైకి అంతా నేతలే చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తున్నా తెరవెనుక శక్తులేవో వీరిని ఆడిస్తున్నట్లు కనబడుతోంది. కేంద్రం సంగతి అలా పక్కన ఉంచి రాష్ట్రంలో చంద్రబాబుకు పార్టీ రూపంలో ఎదురవుతున్న తలనొప్పులను పరిశీలిద్దాం. భారత దేశాన్ని అన్ని మతాలకు తావులేని అఖండ హిందూ రాష్ట్రంగా మార్చాలని, ఆర్ఎస్ఎస్ పరివారం బరి తెగించి హడావుడి చేస్తున్నా, ఒక్కసారైనా మన ‘లౌకిక’నాయకుడు చంద్రబాబు ఖండించనైనా లేదు. కానీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నేత ఒకరు న్నారు. ఆయనే సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి. చంద్ర బాబుకు మంచి మిత్రుడిగా ఒకప్పుడు, ఆ జిల్లాలో ఆయన ఒక వెలుగు వెలిగారు. కాని ప్రస్తుతం చంద్ర బాబుగారి ప్రాధాన్యాలలో కార్పొరేట్ దిగ్గజాలతో మైత్రి ముందుకొచ్చిన పిదప, సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గి పోయింది. దీంతో గుర్రుగా ఉన్న సోమిరెడ్డి చంద్రబాబు బయటకు చెప్పలేని, విమర్శించలేని అంశాలను ప్రస్తా విస్తూ చంద్రబాబుకు తోడ్పడుతున్నట్లు కనపడాలని భావించినట్లున్నారు.‘‘ప్రపంచంలో జీవించే ప్రతి శిశువు మా ప్రవక్త ప్రకారం ముస్లిమే...’’ అంటూ ఎంఐఎం నేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సోమిరెడ్డి. ఆయన పెద్ద ఎత్తుగడతోనే ఇలా అని ఉండొచ్చు. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడేందుకు నిజంగానే సీరియస్‌గా ప్రయత్నిస్తే నేను ఒకణ్ని ఉన్నా నని బీజేపీకి భరోసా ఇచ్చి పార్టీలో ఖర్చీఫ్ వేసి ఉంచే ప్రయత్నం ఇలాంటి ప్రకటనల ద్వారా సోమిరెడ్డి చేసి ఉండవచ్చు. తస్మాత్ జాగ్రత్త బాబుగారూ! ‘సంక్రాంతికి చంద్రన్న కానుక’ అని ప్రభుత్వం పేదలకు పండుగ స్పెషల్‌గా ఇస్తానని చెప్పిన ప్యాకేజీని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ కానుక, పేదలకు చేరి కనీసం పండుగనాడైనా వారు తృప్తిగా భోజనం చేయకముందే, ఆ ప్యాకేజీ టెండర్లు పాడిన తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు పండుగ చేసుకుంటున్నా రని పత్రికలు కోడై కూస్తున్నాయి. దాదాపు రూ.27 కోట్ల మేరకు ఆ కాంట్రాక్టర్లు లాభపడ్డారట. ఇక చంద్రబాబు పార్టీలో కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేసిన పారిశ్రా మిక దిగ్గజాలు తమ కార్పొరేట్ సంస్కృతిని, సెల్ఫ్ ప్రమోషన్‌ను, తమ అధికార దర్పాన్ని బాహాటంగా ప్రకటించుకుంటున్న తీరు గమనార్హం. ‘‘అవును నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఎక్కడైనా, అది రాజధాని అయినా కాకున్నా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదా?’’, ‘‘నాకు డబ్బులున్నాయి. నాకు నంది గామలోనే కాదు. ఆమాట కొస్తే గన్నవరం వద్ద కూడా భూములు కొన్నాను. తప్పా! డబ్బులుంటే మీరూ (పాత్రికేయులు) కొనుక్కోండి’’. ప్రజాప్రతినిధులమని ప్రజల ముందు కాస్త నమ్రతగా మాట్లాడాలని కూడా ఎరుగని వారిని బాబు ఎక్కడా మందలించినట్లు లేదు. గతంలో రాజ్యసభ, కౌన్సిల్ స్థానాలకు ఇలాంటి వారిని చంద్రబాబు ఎన్నిక చేసినప్పుడు సహజంగానే ఆ పార్టీ జెండా మోస్తున్న పాతకాపులు అలిగితే వారిని బాబు బుజ్జగించారు. ఈ సారీ ఎన్నికలలో గెల్చిన పిదప, ఆ కార్పొరేట్ దిగ్గజాలకే చంద్రబాబు పెద్దపీట వేయడమే కాదు.. సీనియర్ నేతలు, మంత్రుల మధ్య విభేదాలు, అపోహలు వస్తే పరిష్కరించేందుకు సైతం ఈ కొత్త కాపులనే పురమాయించడమూ చూశాం. ఇది మింగుడుపడని సీనియర్ నేతలు బహిరంగ ప్రకట నలకు దిగుతున్నారు. ఇటీవల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ‘‘అసెంబ్లీలో మాలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఇతరులూ, చంద్రబాబుగారూ పదేపదే మాట్లాడి, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి, మంచివక్తగా ప్రజల్లో మార్కులు కొట్టేసే అవకాశం ఇచ్చార’’ని ఉన్న వాస్తవం చెప్పారు. దీనిపై అధినేత ఏమన్నారో గానీ మర్నాడు ‘‘నేనలా అనలేదు. పత్రికలు వక్రీకరించాయి. జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరారు’’ అంటూ ఆయనే మరో ప్రకటన చేశారు. చివరిగా, వైఎస్సార్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు జగన్, ప్రజా సమస్యలను సహేతు కంగా లేవనెత్తిన పుడల్లా, సమాధానం లేని పాలకపక్షం ముఖ్యమంత్రితో సహా జగన్ జైలుశిక్ష అనుభవించారని, ఆయనపై సీబీఐ కేసులు నడుస్తున్నాయని, ఎదురు దాడికి దిగుతున్నారు. అయితే జగన్ దోషి అని ఇంత వరకు తుది తీర్పు రానే లేదు. విచారణ పూర్తి కానే లేదు. అలాగే చంద్రబాబుపై కూడా సీబీఐ ముందుకు కేసులు వస్తే బాబును విచారించేందుకు తగినంతమంది సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంది. అలాగే నాట్ బిఫోర్ అనే క్లాజును అడ్డం పెట్టుకుని విచారించవలసిన న్యాయమూర్తుల ముందు కేసులు విచారణకు రాకుండా చంద్రబాబు చేసుకున్నారు. పైగా చంద్రబాబు దోషి కాదు అని ఏ కోర్టూ నిర్ధారించలేదు. బాబుగారూ తస్మాత్ జాగ్రత్త! తమ్ముళ్లే అవసరం వస్తే ఆపదలోకి నెట్టగలరు. ఆ పార్టీ సంస్కృతిలో అదొక భాగం! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు) మొబైల్ : 9848069720 -
కొత్త పుస్తకాలు
1.కార్పొరేట్ సంస్కృతి- కమ్యూనిస్టు విలువలు రచన: వి.శ్రీనివాసరావు పేజీలు: 144; వెల: 60 2.నేను... మందాకిని మాట్లాడుతున్నాను మలయాళ మూలం: విమలామీనన్ తెలుగు: ఎజి.యతిరాజులు పేజీలు: 64; వెల: 30 3.మోదీ కథ ఇది మూలం: వినోద్ కె.జోస్ తెలుగు: వి.వి.జ్యోతి పేజీలు: 72; వెల: 25 4. చరిత్ర మరచిన విజ్ఞానులు తమిళ మూలం: ఆర్.నటరాజన్ తెలుగు: ఎజి. యతిరాజులు పేజీలు: 102; వెల: 50 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, ఎమ్హెచ్ భవన్, ప్లాట్ నం.21/1, అజామాబాద్, ఆర్టిసి కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20. ఫోన్: 27660013 అలిపిరి నుండి ఆనంద నిలయానికి... (తిరుమల క్షేత్రయాత్ర) రచన: బి.వి.రమణ పేజీలు: 128; వెల: 120 ప్రతులకు: బి.బాలు, కేరాఫ్ మహిమ మీడియా, 6-3-221, మంచాల వీధి, రాజన్నపార్కు దగ్గర, తిరుపతి-517501 దీనకల్పద్రుమ శతకము (పునర్ముద్రణ) రచన: కేశిరాజు సీతారామయ్య పేజీలు: 56; వెల: ఇవ్వలేదు ప్రతులకు: పాలకోడేటి ఫౌండేషన్, గాడాల, తూర్పు గోదావరి జిల్లా; ఫోన్: 040-27006621 బ్రతుకువరం (కవిత్వం) ఆంగ్లమూలం: ఎన్.వి.సుబ్బరామన్ తెలుగు: శ్రీరాగి పేజీలు: 144; వెల: 150 ప్రతులకు: టి.కె.విశాలాక్షిదేవి, శ్రీకృష్ణా పబ్లికేషన్స్, 87-395, కమలానగరు, బి.క్యాంపు, కర్నూలు-518002. ఫోన్: 9502629095 సాహిత్య పాఠశాల సంపాదకుడు: డా.వీరాచారి పేజీలు: 120; వెల: 150 ప్రతులకు: సంపాదకుడు, అధ్యక్షుడు, అరసం, తెలంగాణ, 3-83, శ్రీ వెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, హన్మకొండ-506015; ఫోన్: 9963610842 -
స్కిల్స్ పెంచుకుంటే కొలువు సులువే!
భారత్‌లో ప్రతిఏటా 30 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసుకొని, ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తున్నారు. వారిలో దాదాపు 25 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హతలను కలిగి ఉంటున్నారు. ప్రతిభావంతుల్లో ఎక్కువ మంది ఐటీ, ఐటీఈఎస్ రంగాలను ఎంచుకున్నారు. మిగిలిన 75 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగ సాధనకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉంది. విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దడంలో పారిశ్రామిక రంగం పాత్ర కూడా ఎంతో కీలకం. కార్పొరేట్ కల్చర్ అవేర్నెస్, ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టుల్లో వారిని భాగస్వాములను చేయాలి. తగిన శిక్షణ ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను తరగతి గదిలో నేర్చుకున్నదాన్ని పరిశ్రమలో ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టినప్పుడే సుశిక్షితుడైన మానవ వనరుగా ఎదుగుతాడు. తన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతాడు. ఆంగ్ల భాషపై పట్టు టెక్నికల్ విద్యార్థులు ఆంగ్ల భాషపై తగినంత పట్టు సాధించలేకపోతే.. వారికి ఎంత విజ్ఞానం ఉన్నా నిరర్థకమే. కాల్‌సెంటర్లు, బీపీఓ, కేపీఓ, ఐటీఈఎస్, ఐటీ తదితర రంగాల్లో రాణించాలంటే మంచి ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంగ్లాన్ని మొదటి సంవత్సరం నుంచే బోధించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఆంగ్ల భాష విషయంలో ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వారిలో ఆంగ్ల భాషా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భాష ఏదైనా చదవడం, రాయడం, మాట్లాడడం సంపూర్ణంగా వచ్చినప్పుడే దానిపై పూర్తి పట్టు సాధించినట్లు భావించాలి. ఇటీవల కొత్తగా ఏర్పడుతున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్లంలో మెలకువలు నేర్పడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన ప్రయత్నం. అప్డేట్ నాలెడ్జ్ తప్పనిసరి ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన సిలబస్‌ను ఇంజనీరింగ్ కరిక్యులమ్‌లో తప్పనిసరిగా చేర్చాలి. లేకపోతే పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులు లభించవు. యూనివర్సిటీల్లోని అకడమిక్ కౌన్సిల్లో ఉండే సబ్జెక్టు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు కలిసి సిలబస్‌ను నిర్ణయిస్తుంటారు. ఈ విషయంలో పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆండ్రాయిడ్ టెక్నాలజీ, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డాట్నెట్ టెక్నాలజీస్, క్యాడ్ క్యామ్, ఆటోక్యాడ్, మెట్‌ల్యాబ్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కరిక్యులమ్‌లో ఆయా అంశాలు లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా బోధించాలి. ఆయా టెక్నాలజీలను ఉపయోగించే సంస్థల నుంచి నిపుణులను పిలిపించి, వారు తమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకొనే విధంగా ప్రత్యేక సదస్సులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులతో వివిధ రకాలైన సర్టిఫికేషన్స్ చేయించాలి. సిస్కో సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, ఎస్ఏపీ(శాప్) సర్టిఫికేషన్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు అప్డేట్ నాలెడ్జ్ సొంతమవుతుంది. ఈ సర్టిఫికేషన్స్ పూర్తిచేసిన విద్యార్థులను ఆయా రంగాలకు చెందిన సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా వారికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీ++, కోర్జావాలో నైపుణ్యం పెంచుకుంటే జావా డెవలపర్‌గా స్థిరపడేందుకు అవకాశాలుంటాయి. టి.వి. దేవీ ప్రసాద్ హెడ్- ప్లేస్మెంట్ ఐఐఐటీ- హైదరాబాద్