corporate india
-
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
ప్యాకేజీ ఇవ్వాలి: కార్పొరేట్ ఇండియా
న్యూఢిల్లీ: మూడు వారాల లాక్‌డౌన్‌కే దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చన్న అంచనాలు ఉండగా, ప్రధాని మోదీ ఈ లాక్‌డౌన్‌ను మరో మూడు వారాలు అంటే మే 3 వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశీ పరిశ్రమలు(కార్పొరేట్ ఇండియా) స్వాగతించాయి. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఈ వైరస్‌ను నివారించేందుకు లాక్డౌన్ కొనసాగింపు తప్పనిసరి అని కార్పొట్లు అభిప్రాయ పడ్డారు. కాకపోతే ఈ వైరస్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించుకునేందుకు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని కోరాయి. హాట్‌స్పాట్ (వైరస్ కేసులు లేని) కాని ప్రాంతాల్లో ఈ నెల 20 తర్వాత ఆంక్షలను కొద్ది మేర సడలించనున్నట్టు ప్రధాని తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి బుధవారం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రోజూ రూ.40,000 కోట్ల నష్టం: ఫిక్కీ ‘దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల దేశం రోజూ రూ.40,000 కోట్లను నష్టపోతుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. అంటే మొదటి 21 రోజుల లాక్డౌన్ వల్ల ఏర్పడే నష్టం రూ.7–8 లక్షల కోట్లు. పైగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 4 కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడనుంది. కనుక సత్వరమే ఉపశమన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. దశలవారీగా ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ప్రధాని ఇచ్చిన సంకేతాలు కొంత ఉత్పత్తి ఆరంభానికి వీలు కల్పిస్తుంది’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. తగిన విధంగా సన్నద్ధం కావచ్చు: సీఐఐ ‘వైరస్ కేసుల క్రమాన్ని చూస్తే లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న ప్రధాని నిర్ణయం అవసరం. ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌ను క్రమంగా ఉపసంహరించడంపై ప్రధాని మార్గద్శకం చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగింపు వల్ల క్రమ పద్ధతిలో, సురక్షితంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం తగిన విధంగా నన్నద్ధం కావచ్చు. అదే విధంగా పరిశ్రమలు సైతం కార్యకలాపాల ప్రారంభానికి తగిన వ్యూహాలు రూపొందించుకోవచ్చు’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. తక్షణ సాయం...: అసోచామ్ ‘‘ఈ మహమ్మారిని ఎదుర్కొ నేందుకు ప్రధాని తీసుకున్న లాక్డౌన్ కొనసాగింపు నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఎంఎస్ఎంఈ, లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ పేర్కొన్నారు. రిటైల్ నష్టం రూ.3.15 లక్షల కోట్లు: సీఏఐటీ నోయిడా: లాక్డౌన్ కాలంలో రిటైల్ వర్తకులు రూ.3.15 లక్షల కోట్ల మేర నష్టపోయారని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. దేశవ్యాప్తంగా 7 కోట్ల ట్రేడర్లు ఉండగా, వారిలో 1.5 కోట్ల మంది నిత్యావసర వస్తువుల విక్రయాల్లో ఉన్నారని, వీరిలోనూ 40 లక్షల మందే లౌక్‌డౌన్ కాలంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. దీనికి కారణం అధికారుల నుంచి పాస్‌లు అందకపోవడమేనని పేర్కొంది. సరైన నిర్ణయం... కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్న ప్రధాని నిర్ణయం సరైనదే. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరమే మెరుగైన భౌతిక టీకా. కఠిన నియంత్రణల అమలు అవసరం. లాక్డౌన్ మార్గదర్శకాల అమలులో ఏదైనా అలసత్వం ఉంటే పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. – కిరణ్మజుందార్ షా,బయోకాన్ చైర్పర్సన్ జీతాలిచ్చేందుకు నిధుల్లేవు: ఎఫ్ఐఈవో ఎంఎస్ఎంఈల కార్యకలాపాలకు అనుమతించండి లాక్డౌన్ కాలంలో ఎటువంటి కార్యకలాపాలు లేనందున ఏప్రిల్ నెలకు వేతనాలు చెల్లించేందుకు సూక్ష్మ, మధ్య, చిన్న స్థాయి పరిశమల (ఎంఎస్ఎంఈ) వద్ద తగినన్ని నిధుల్లేవని భారతీయ ఎగుమతుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) తెలిపింది. కనుక ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేసింది. తయారీ కేంద్రాల్లో, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత యూనిట్లలో పాక్షికంగా అయినా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరత్‌కుమార్ కోరారు. ప్రధాని ప్రసంగంలో ఈ దిశగా నిర్ణయం వెలువడుతుందని ఆశించినట్టు చెప్పారు. నిర్ణీత వ్యవధిలో ఎగుమతుల ఒప్పందాలను అమలు చేయలేకపోతే ఆర్డర్ల రద్దు, పెనాల్టీలు, మార్కెట్ వాటా నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలకు బకాయిలు చెల్లించాలి... ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరింది. రుణ హామీల నుంచి సడలింపులు ఇవ్వాలని, రుణ చెల్లింపులపై మారటోరియం కొనసాగించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ, పలు ఇతర శాఖలకు సమర్పించిన వినతి పత్రాల్లో సీఐఐ సూచనలు చేసింది. ఎంఎస్ఎంఈలకు ఫండ్ ఆప్ ఫండ్ కోసం యూకే సిన్హా కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని కోరింది. ‘‘పరిమిత వనరులతో ఉన్న ఎంఎస్ఎంఈలకు కరోనా వైరస్ సాకులను తట్టుకుని నిలబడే శక్తి లేదు. సరఫరా వ్యవస్థల్లో ఎంఎస్ఎంఈలు ఎంతో ముఖ్యమైనవి. వీటి ఆరోగ్య పరిస్థితి అటు సరఫరా వ్యవస్థపై, పెద్ద కార్పొరేట్ కంపెనీలపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ సంక్షోభ సమయంలో ఎంఎస్ఎంఈలకు మద్దతుగా చర్యలు అవసరం’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ బెనర్జీ కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఎంఎస్ఎంఈల రంగంలో ఒత్తిళ్లు నేపథ్యంలో వాటికి చెల్లించాల్సిన బకాయిలను కార్పొరేట్ సంస్థలు ముందుగానే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. లౌక్‌డౌన్ తర్వాత కార్యకలాపాల పునః ప్రారంభానికి వీలుగా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఫిక్కీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. లాక్ డౌన్ 2.0 జీడీపీ ‘జీరో’! ముంబై: భారత దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనావేసింది. తొలి మూడు వారాల లాక్డౌన్ వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్క్లేస్ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్డౌన్ పొడిగింపు వల్ల ఈ అంచనాలను భారీగా 234.4 బిలియన్ డాలర్లకు పెంచింది. వెరసి 2020 క్యాలెండర్ ఇయర్లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8% ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్డౌన్ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్ ఇయర్లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసిన బ్రోకరేజ్ సంస్థ, 2020–21లో వృద్ధి 3.5% ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ తగ్గించడం గమనార్హం. ఒక శాతం...ఇక్రా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా ఒకశాతం క్షీణత నమోదయ్యే వీలుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాల తదుపరి పరిస్థితి ఏదైనా బాగుంటే, కనీసం ఒకశాతం వృద్ధి నమోదవుతుందనీ ఇక్రా పేర్కొంది. అయితే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థికవృద్ధి ఏకంగా –15 క్షీణతలో ఉంటుందని ఇక్రా అంచనావేయడం గమనార్హం. కాగా క్యాలెండర్ ఇయర్లో – 0.5 శాతం క్షీణ రేటు ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది. మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) అసలు వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని అంచనావేసింది. తీవ్ర మాంద్యంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 1930నాటి మాంద్యం తరువాత అంత దారుణ ఆర్థిక స్థితి ఇదని ఐఎంఎఫ్ విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – 0.3 శాతం క్షీణత నమోదు చేసుకుంటుందని పేర్కొంది (జనవరిలో 6.3% అంచనా). భారత్‌కు సంబంధించి 2020 అంచనాలను 5.8 శాతం (జనవరి అంచనా) నుంచి 1.9 శాతానికి కుదించింది. అయితే 2021 భారత్ వృద్ధిరేటు 7.4 శాతం, చైనా 9.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంటాయని విశ్లేషించింది. ఉద్దీపన ప్యాకేజీ ఆశిస్తున్నాం: నాస్కామ్ ప్రభుత్వ నిర్ణయాన్ని నాస్కామ్ స్వాగతించింది. ‘‘దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్డౌన్ వైరస్ నియంత్రణకు సాయం చేసింది. వైరస్ నియంత్రణకు పటిష్ట విధానాన్ని రూపొందించుకోవడంతోపాటు లాక్డౌన్ తర్వాత ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై సన్నద్ధం అయ్యేందుకు మే 3 వరకు లాక్డౌన్ కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుంది. గ్రీజ్ జోన్లలో (కేసుల్లేని ప్రాంతాల్లో) ఆంక్షలను సడలించడం సంతోషకరం. ప్రభుత్వం వెంటనే ఆర్ధిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. దాంతో ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించొచ్చు’’ అని నాస్కామ్ తన ప్రకటనలో పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించాలి... మే 3 వరకు లాక్డౌన్ కొనసాగించాలన్న ప్రధాని నిర్ణయానికి నా మద్దతు. ఎన్నో చర్యలు, విధానాల ద్వారా ప్రభుత్వానికి మద్దతునిస్తున్న కార్పొరేట్ ఇండియా, ప్రభుత్వం నుంచి సరైన ఉద్దీపనల ప్యాకేజీని కోరుకుంటోంది. అది మన ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతునిస్తుంది. – పవన్‌ముంజాల్,హీరో మోటో చైర్మన్ మంచి ఆలోచన కరోనా వైరస్ కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపు మంచి ఆలోచన. అమలు తీరును సమీక్షించడం ద్వారా ఏప్రిల్ 20 తర్వాత క్రమంగా కొన్ని ఆం క్షలను సడలించనున్నట్టు ప్రక టించడం ఆహ్వానించతగినది. – నవీన్ జిందాల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ రియల్టీ ధరలు 20 శాతం తగ్గుతాయ్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. దీని ప్రభావంతో రియల్ ఎస్టేట్ ధరలు 20 శాతం తగ్గుతాయని ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అంచనా వేశారు. తక్కువ డిమాండ్, ఇన్వెంటరీ యూనిట్లు కారణంగా ఇప్పటికే రియల్టీ రంగం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో), కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) సంఘాలతో వీడియో సమావేశంలో డెవలపర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రియల్టీ ఖాతాల పునర్వ్యవస్థీకరణ కోసం ఎన్పీఏ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఖాతా 90 రోజుల పాటు సర్వీస్ చేయకపోతే అది ఎన్పీఏగా మారిపోతుంది. దీన్ని కనీసం 180 రోజులకు పొడిగించాలని ఆయన కోరారు. ప్యాకేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: గడ్కరీ రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్దరించేందుకు అవసరమైన వన్ టైం రీస్ట్రక్చరింగ్ ప్యాకేజీకి సంబంధించిన అధ్యయన ప్రతిపాదనలను అందించాలని నిర్మాణ సంఘాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు తగిన ఫలితాలివ్వలేదని, అందుకే ఈ రంగాన్ని పునరుద్దరించడానికి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పరిమిత పనులకు అనుమతించాలి: క్రెడాయ్ రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు గడువు ముగిసేలోగా పూర్తి చేసేందుకు పరిమిత నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించాలని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా కోరారు. ఎస్బీఐతో కలసి ఫండ్ రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు గాను ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఎస్బీఐ చైర్మన్‌తో మాట్లాడనున్నట్టు దీపక్ పరేక్ చెప్పారు. యస్ బ్యాంకులో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పెట్టుబడులు పెట్టినట్టుగానే, ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగం కోసం సంయుక్త నిధి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు. ఇది సాకారం అయితే ఐఎఫ్‌సీ వంటి విదేశీ సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందన్నారు. -
కార్పొరేట్ భారతంలో భారీ కుదుపు
బెంగళూర్ : కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ విషాదాంతం కార్పొరేట్ భారతం ఎదుర్కొంటున్న సంక్షోభం, లిక్విడిటీ క్షీణతలను ప్రతిబింబిస్తోంది. సిద్ధార్ధ బలవన్మరణానికి పాల్పడే ముందు కంపెనీ బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు భారత పారిశ్రామికవర్గాల్లో భారీ కుదుపునే రేపాయి. రుణదాతలు, ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన ఒత్తిళ్లు అప్పుల ఊబిలో మూసుకుపోయిన దారులు సిద్ధార్థను ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కార్పొరేట్ భారతానికి పెను ప్రమాద సంకేతాలు పంపాయి. రెండున్నర దశాబ్ధాల సుదీర్ఘ వ్యాపార పయనంలో కేఫ్ కాఫీ డే(సీసీడే)ను ఆయన శాఖోపశాఖలుగా విస్తరించిన తీరు, కాఫీ తోటల నుంచి కస్టమర్‌కు పొగలు కక్కే కాఫీని కాఫీ టేబుల్‌పైకి అందించే వరకూ అన్ని దశల్లో ఆయన ఒడుపు అనితరసాధ్యమే. తేనీరును ఆస్వాదించే భారత్‌లో ఏకంగా 1700 స్టోర్లు, 54,000 వెండింగ్ మెషీన్లతో ఒంటి చేత్తో కాఫీని దశదిశలా చేర్చిన సిద్ధార్థ రుణభారంతో తనువు చాలించడం విషాదకరం. అప్పులు గుదిబండగా మారడంతో పాటు కంపెనీలో తనఖాలో ఉన్న తన షేర్లను రుణదాతలు తమకు మళ్లించాలని కోరడం, మరోవైపు హామీలున్నా అత్యధికంగా 14 శాతం వడ్డీతో కొత్త రుణాలను సమీకరించాల్సి రావడం రుణభారాన్ని ఇబ్బడిముబ్బడి చేసింది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ షేర్లను బైబ్యాక్ చేయాలని ఒత్తిడి చేయడం, మైండ్‌ట్రీ విక్రయం ద్వారా సమకూరిన నిధులపై తమకు రావాల్సిన మొత్తం కోసం ఆదాయ పన్ను అధికారుల నుంచి ఒత్తిళ్లతో సిద్ధార్థ తీవ్ర నిర్ణయం దిశగా కదిలారు. తన ముందున్న సంక్లిష్ట పరిస్ధితుల్లో తనువు చాలించడం మినహా మరోమార్గం లేదనే రీతిలో తను రాసిన లేఖలో సిద్ధార్ధ స్వయంగా వెల్లడించారు. ‘వీజీ సిద్ధార్ధ ఒక్కరే కాదు దేశంలో ఇలాంటి వారు మరో 100 మంది ఇతర పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కంపెనీల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవడం, రీఫైనాన్సింగ్ లభించకపోవడంతో వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నార’ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్‌కు చెందిన చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పడం కార్పొరేట్ భారతంలో సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. -
మూడింతలైన కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కార్పొరేట్ ఇండియాలో కరోడ్‌పతి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకునే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 422 నుంచి 2017లో ఏకంగా 1,172 మందికి పెరిగింది. కాపిటాలైన్ ఇతర వార్షిక నివేదికల గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. బడా కంపెనీలు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించడం, లాభాలు పెరగడంతో పలు మధ్యస్ధాయి కంపెనీల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పలువురు ప్రమోట్ కావడంతో కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య పెరిగింది. బీఎస్ఈ 200 గ్రూప్‌లో ప్రతి కంపెనీలో సగటున రూ 5.5 కోట్ల ప్యాకేజ్‌తో ఐదుగురు కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ 5000 కోట్లు (నికర లాభంలో 1.1 శాతం) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలకు వెచ్చించాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ కోటికి పైగా వేతనం అందుకుంటున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా 105 కాగా, టీసీఎస్‌లో 91, భారతి ఎయిర్‌టెల్‌లో 82 మంది కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. -
వృద్ధికి రైలు కూత...
కొత్త ఫ్రైట్ కారిడార్లతో తగ్గనున్న రవాణా వ్యయం రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం సవాలే... రైల్వే బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాల స్పందన... న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్.. ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. 2019కల్లా ఏర్పాటు కానున్న మూడు కొత్త ఫ్రైట్ కారిడార్ల(సరుకు రవాణా)తో రవాణా వ్యయం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం గట్టి సవాలేనని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. కొత్తగా మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్‌పూర్-ముంబై), ఈస్ట్‌కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం చాలా ఎక్కువ. జీడీపీ వృద్ధికి ఆటంకాలు, ఇతరత్రా అంశాలను చూస్తే.. ఈ లక్ష్యం పెద్ద సవాలే. పే కమిషన్ సిఫార్సుల ప్రభావం రైల్వేలపై రూ.30 వేల కోట్ల వరకూ పడుతుంది. అయినప్పటికీ 92% నిర్వహణ పనితీరును సాధించాలన్న లక్ష్యం సవాలుతో కూడుకున్నదే. 2019 కల్లా కొత్త ఫ్రైట్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం గొప్పదే కానీ, అనేక సవాళ్లు ఉన్నాయి’ అని ఎల్అండ్టీ సీఈఓ(రైల్వే బిజినెస్) రాజీవ్ జ్యోతి పేర్కొన్నారు. పోర్టు కనెక్టివిటీ పెంపుపై ఎగుమతిదారుల హర్షం పోర్టులతో మరింత అనుసంధానం అయ్యేవిధంగా రైల్వే నెట్వర్క్ పెంచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని ఎగుమతిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ట్రేడర్లకు ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పారు. రైల్వే లైన్లకు అనుసంధానంగా గిడ్డంగుల ఏర్పాటు ప్రతిపాదనల వల్ల ఫ్రైట్ టెర్మినళ్ల వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కోల్డ్ స్టోరేజీల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) పేర్కొంది. రైల్వేలకు పోర్టులతో కనెక్టివిటీ పెంపువల్ల ఎగుమతి, దిగుమతిదారులకు వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుందని, తద్వారా వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఈఈపీసీ) వ్యాఖ్యానించింది. అదేవిధంగా లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కూడా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ టీఎస్ భాసిన్ పేర్కొన్నారు. ఫ్రైట్ కారిడార్లు, స్టేషన్ల అభివృద్ధితో రియల్టీకి బూస్ట్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, 400 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించడాన్ని రియల్ ఎస్టేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల రియల్టీ మార్కెట్‌కు చేయూత లభిస్తుందని ప్రాపర్టీ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. అయితే, వీటికి నిధులు సమకూర్చడం, నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాజెక్టులను పూర్తిచేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘400 స్టేషన్లను పీపీపీ విధానంలో ఆధునీకరించనుండటం వల్ల దేశవ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో రియల్టీ అభివృద్ధికి వీలు కలుగుతుంది. పెద్ద నగరాల్లో రైల్వే శాఖకు ఉన్న భారీ స్థలాలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు’ అని జేఎల్ఎల్ ఇండియా చైర్మన్, కంట్రీ హెడ్ అనుజ్ పురి పేర్కొన్నారు. సాహసోపేతమైన ముందుచూపు.. ప్రధానంగా ప్రాజెక్టుల పూర్తి, అమలుపై బడ్జెట్లో అత్యధికంగా దృష్టిపెట్టడం మంచి పరిణామం. కొత్తగా మూడు రైల్వే ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుతో రవాణా వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, భద్రతపై దృష్టిపెడుతూ సాహసోపేతమైన ముందుచూపుతో రూపొందించిన బడ్జెట్ ఇది. వృద్ధికి ఊతమిస్తూ.. పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలను కల్పించారు. - సుమిత్ మజుందార్, సీఐఐ ప్రెసిడెంట్ ప్రైవేటు రంగాన్ని ఆకర్షిస్తుంది... సరుకు రవాణా పాలసీని హేతుబద్ధీకరించడం, పీపీపీ విధానాన్ని సమీక్షిస్తామని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు కంపెనీలను ఆకర్షించేలా చేస్తుంది. దీనివల్ల రైల్వే రవాణా మెరుగుపడటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, పోర్టులతో అనుసంధాన్ని మరింత పెంచడం వంటివాటిపై దృష్టిపెట్టడం ఆహ్వానించదగిన విషయం. ఇది అత్యంత ఆచరణాత్మక బడ్జెట్. ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేలను వెన్నెముకగా మార్చాలన్న లక్ష్యం అత్యంత ప్రధానమైనది. అధునాతన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ బాటలు వేసింది. - హర్షవర్ధన్ న్యోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నా... పెట్టుబడి వ్యయాల విషయంలో రాజీపడకుండా... చార్జీల పెంపు కూడా లేకుండా రైల్వే శాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటి సామర్థ్యాలనూ పెంచే విధంగా చర్యలు ఉన్నా యి. కమోడిటీ రంగాల్లో తీవ్ర మందగమనం కారణంగా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు పొంచిఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్లో వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయం. - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ -
బీజేపీ విజయంతో సంస్కరణలకు బూస్ట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించడాన్ని కార్పొరేట్ ఇండియా స్వాగతించింది. రానున్నరోజుల్లో కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో తాజా ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని పారిశ్రామిక మండళ్లు వ్యాఖ్యానించాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ పైచేయితో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరింత బలపడనుందని... దీనివల్ల వస్తు-సేవల పన్ను(జీఎస్టీ), సబ్సిడీ యంత్రాంగాన్ని మెరుగుపరచడం, కార్మిక చట్టాల్లో సరళీకరణ వంటి కీలక సంస్కరణలకు మోక్షం లభించవచ్చని అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రాజ్యసభలో కూడా బీజేపీ పట్టు పెరిగేందుకు తాజా ఎన్నికల ఫలితాలు తోడ్పడనున్నట్లు తెలిపింది. ఆర్థికపరమైన చట్టాలకు ఆమోదం పొందడానికి ఈ పరి ణామం కీలకంగా మారనుందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, వృద్ధి పెంపునకు వీలుగా పారిశ్రామిక రంగంపై కొత్త సర్కారులు దృష్టిపెట్టాల్సి ఉందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శరద్ జైపూరియా వ్యాఖ్యానించారు. -
దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్!
ముంబై: భారత కార్పొరేట్ కంపెనీల మెడపై దివాలా కత్తి వేలాడుతోంది. ఆర్థిక మందగమనానికి తోడు దేశీయంగా వినియోగ డిమాండ్ పడిపోవడం పారిశ్రామిక రంగాన్ని తూట్లు పొడుస్తోంది. భవిష్యత్తుపై భారీ ఆశలతో ఎడాపెడా అప్పులు చేసి విస్తరణకు పరుగులు తీసిన కంపెనీలు ఇప్పుడు చివురుటాకుల్లా వణుకుతున్నాయి. తీసుకున్న రుణాలు యమపాశాల్లా మారుతున్నాయి. ఇవేవో అల్లాటప్పా చిన్నకంపెనీలనుకుంటే పొరపాటే. దేశంలో టాప్ కంపెనీల్లో అనేకం ఇదే బాటలో నడుస్తున్నాయి. దేశంలోని అగ్రగామి కార్పొరేట్ సంస్థల్లో మూడోవంతు ఇప్పుడు ఆర్థికంగా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ) 500 టాప్ కంపెనీల ఇండెక్స్‌లో 143 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మొత్తం షేర్ల విలువ) కంటే వాటి అప్పులే అధికం కావడం గమనార్హం. నాన్-బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు మినహా మొత్తం 406 కంపెనీల్లో మూడో వంతు కంపెనీలు(ఇప్పటిదాకా ఆర్థిక ఫలితాలను ప్రకటించినవాటిలో) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రుణాలు గుదిబండగా మారడంతో వడ్డీలు అధికమై కంపెనీల లాభాలు ఆవిరవుతున్నాయి. డిమాండ్ పడిపోవడం కూడా లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో షేరు ధర పాతాళానికి జారిపోయి మార్కెట్ క్యాప్ కుదేలయ్యేలా చేస్తోంది. ఇవన్నీ ఆయా కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకొని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు. షేరు ధర అట్టడుగుకు పడిపోవడంతో నిధులను సమీకరించే పరిస్థితులు లేవు. మరోపక్క, అధిక వడ్డీరేట్లు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అప్పులు మొండిబకాయిలుగా మారడంతో బ్యాంకులు కూడా కార్పొరేట్లకు రుణాలపై వెనుకంజ వేస్తున్నాయి. ఇన్వెస్టర్లు దూరం... ప్రాజెక్టు వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, అధిక వడ్డీరేట్లు వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కాదని ఇన్వెస్టర్లు ఒక నిశ్చయానికి వస్తున్నారు. అప్పుల భారం, లాభదాయకంకాని ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రస్తుత ప్రతికూల ఆర్థిక వాతావరణం కారణంగా అనేకమంది ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు అవసరమయ్యే కంపెనీల షేర్లకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ 143 కంపెనీల నిర్వహణ లాభాలు బీఎస్ఈ-500(నాన్‌ఫైనాన్షియల్ సంస్థల్లో) జాబితాలోని మొత్తం కంపెనీలతో పోలిస్తే మూడో వంతు కూడా లేకపోవడం ఇన్వెస్టర్ల వెనుకంజకు కారణమనేది నిపుణుల విశ్లేషణ. ఇక మొత్తం కంపెనీల లాభాల్లో(క్యాష్) వీటి వాటా ఐదోవంతు మాత్రమే. ఇదే తరుణంలో అప్పులు మాత్రం 71 శాతం, స్థిర ఆస్తులు సగానికిపైగా ఉండటం గమనార్హం. ఇక జూలైలో స్టాక్‌మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా కేవలం 14 శాతమే కావడం విశేషం. కాగా, ఒక్కసారి వృద్ధి పుంజుకుంటే వీటికి నగదు ప్రవాహాలు పెరుగుతాయని, రుణాల చెల్లింపులకు మార్గం సుగమం అవుతుందని ఇండియా రేటింగ్స్ డెరైక్టర్ దీప్ నారాయణ్ ముఖర్జీ అంటున్నారు. ముఖ్యంగా అత్యధికంగా కార్పొరేట్ రుణాలతో ముడిపడిన ప్రాజెక్టులు మెటల్స్, మైనింగ్, విద్యుత్, చమురు-గ్యాస్ రంగాల్లోనే ఉన్నాయి. ఇక అప్పుల భారంతో బాగా సమస్యలు ఎదుర్కొంటున్న వాటిలో రియల్టీ, రిటైల్, విద్య, నిర్మాణ రంగాలు ముందువరుసలో ఉన్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. అప్పుల కుప్పలు... క్యాపిటలైన్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరినాటికి బీఎస్ఈ-500లోని ఈ 143 కంపెనీల మొత్తం అప్పులు రూ.13.2 లక్షల కోట్లుగా అంచనా. జూలై నాటికి వీటి సగటు మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే రుణాలు దాదాపు రెండింతలయ్యాయి. రెండేళ్ల క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2011 జూలైలో ఈ కంపెనీల మార్కెట్ విలువ వాటి నికర రుణాల కంటే 40 శాతం అధికంగా ఉంది. రెండేళ్లు తిరిగేసరికి అంతా తలకిందులైంది. రుణాలు 61 శాతం ఎగబాకి.. మార్కెట్ క్యాప్ 40 శాతం పడిపోయింది. దీంతో ప్రాజెక్టులకు ఈక్విటీ ఆధారిత నిధుల సమీకరణకు తలుపులు మూసుకుపోయాయి. అంతేకాదు రుణాల తిరిగి చెల్లింపుల విషయంలోనూ చేతులెత్తేసేలా సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అప్పుల కుప్పలుగా తయారైన కంపెనీల జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, టాటా పవర్, ఎల్అండ్టీ, జేపీ అసోసియేట్స్, అదానీ పవర్, జీఎంఆర్ ఇన్ఫ్రా, జీవీకే పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇన్ఫ్రా, శ్రీరేణుకా సుగర్స్, బజాజ్ హిందుస్థాన్, సుజ్లాన్ వంటి అనేక దిగ్గజాలు ఉన్నాయి.