సాక్షి, న్యూఢిల్లీ : కార్పొరేట్ ఇండియాలో కరోడ్‌పతి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకునే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 422 నుంచి 2017లో ఏకంగా 1,172 మందికి పెరిగింది. కాపిటాలైన్ ఇతర వార్షిక నివేదికల గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
బడా కంపెనీలు సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించడం, లాభాలు పెరగడంతో పలు మధ్యస్ధాయి కంపెనీల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పలువురు ప్రమోట్ కావడంతో కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య పెరిగింది. బీఎస్‌ఈ 200 గ్రూప్‌లో ప్రతి కంపెనీలో సగటున రూ 5.5 కోట్ల ప్యాకేజ్‌తో ఐదుగురు కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ 5000 కోట్లు (నికర లాభంలో 1.1 శాతం) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలకు వెచ్చించాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ కోటికి పైగా వేతనం అందుకుంటున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా 105 కాగా, టీసీఎస్‌లో 91, భారతి ఎయిర్‌టెల్‌లో 82 మంది కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment