The cost of the election
-
'లెక్క' లేదు
ఎన్నికల ఖర్చును చూపని అభ్యర్థులు కొందరి సమాచారంలో తేడా అన్ని పార్టీలదీ అదే తీరు సిటీబ్యూరో: ఓ అభ్యర్థి... ఆయన వెనుక బస్తీ నిండా కార్యకర్తలు... వాహనాల బారులు... ఇది అందరికీ కనిపించే వాస్తవం. రెండే వాహనాలు... 20 మందే కార్యకర్తలు...ఇదీ కాగితాల్లోని ‘లెక్క’. వీరికి వెచ్చించే మొత్తంలోనూ ఆ తేడా ‘చూపిస్తున్నారు’. ఇదీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము చేసే ఖర్చుకు సంబంధించి ఏ రోజుకారోజు లెక్కలను రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి. ప్రతి రోజూ కాకపోయినా.. మూడు రోజులకోమారు తమ ఖర్చులను చూపించాలి. ప్రచారంలో భాగంగా చేసే ఖర్చులన్నీ పొందుపరచాలి. అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొనే వారు వినియోగించే వాహనాలు.. వారికి అందజేసే టీలు, టిఫిన్ల నుంచి సమస్త సమాచారం పొందుపరచాలి. బహిరంగ సభల వేదికలు.. టెంట్లు, కుర్చీలకు సైతం లెక్కలు చూపాలి. గతంలో ఎన్నికలు ముగిశాక 45 రోజుల్లోగా ఖర్చులన్నీ చూపే అవకాశం ఉండేది.తాజాగా మూడు రోజులకోమారు ‘లెక్క’ చెప్పాల్సిందిగా నిబంధనలు మార్చారు. అయినప్పటికీ అభ్యర్థులెవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మొత్తం 1,333 మంది. వీరిలో దాదాపు 650 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మిగతా వారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు. అంతో ఇంతో ఇండిపెండెంట్ అభ్యర్థులే లెక్కలు చూపుతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మాత్రం రిటర్నింగ్ అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. ప్రచారానికి, లోపాయికారీ బేరాలకే తమకు సమయం సరిపోవడం లేదని... ఇప్పుడు లెక్కలు ఎలా చెప్పేదని కొందరు అభ్యర్థులు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఖర్చు భారీ... లెక్క స్వల్పం ఇప్పటికే అనేక వార్డుల్లో ఇబ్బడిముబ్బడిగా ఓటర్లకు తాయిలాల ఎర వేశారు. వివిధ వస్తువులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు ముట్టజెబుతున్నారు. ఇంకొందరికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సరఫరా చేస్తున్నారు. మహిళలు, యువకులు.. ఇలా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వారికి చీరలు, గాజులు, ప్లేట్ల నుంచి క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు... గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చే స్తున్నా రు. ఇంకొందరు నేరుగా ఓటర్లకే ఫోన్ చేసి ‘అన్నా.. మీ ఇంట్లో ఐదు ఓట్లున్నాయి.. మూడు ఫుల్‌బాటిళ్లు పంపిస్తానన్నా... జర చూడు’ అంటున్నారు. ఈ బహుమతులు, నజరానాలు ఒక ఎత్తయితే... ప్రచారం చేసే కార్యకర్తలు.. వారి విందులకు చెల్లిస్తున్నవి మరో ఎత్తు. చాలామంది అభ్యర్థులు అడ్డా మీది కూలీలనే ప్రచారాలకు తీసుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 200 మందిని వెంట తీసుకువెళ్తున్నారు. వారికి భోజనంతో పాటు ఒక పూట ప్రచారమైతే రూ.150 నుంచి రూ.200 వరకు... రెండు పూట లైతే రూ.300 నుంచి రూ. 500 వరకు చెల్లిస్తున్నారు. ఇవన్నీ లెక్కల్లో చూపడం లేదు. సాధారణ భోజన ఖర్చు మాత్ర మే చూపించే ఎత్తుగడలు వేస్తున్నారు. అంతేకాదు.. 200 మందితో ప్రచారం చేసినా... లెక్కల్లో 40 నుంచి 50 మందినే చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి నోటీసులు పంపుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 2.08 కోట్లను సర్వెలెన్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. సమాచారం కరువు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఏరోజుకారోజు వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు సెలవిచ్చినప్పటికీ... అమలు కావడం లేదు. సర్కిళ్ల స్థాయిలో లెక్కలను తాము వెల్లడించబోమని.. ప్రధాన కార్యాలయానికే పంపుతామని అక్కడ చెబుతుండగా... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ అధికారిక సమాచారం లేదు. ఈ సమాచారం తమ వద్ద లేదని చెప్పలేక... సర్కిళ్ల నుంచి పంపించలేదని చెప్పుకోలేక సంబంధిత అధికారులు సతమ తమవుతున్నారు. -
ఈసీ ఉత్తర్వులు సరికాదు
నిధుల సేకరణపై పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయం, నిధుల సమీకరణలో పారదర్శకత పాటించాలంటూ ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అసందిగ్ధంగా ఉన్న వీటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. రూ.20,000 దాటిన విరాళాలను నగదుగా స్వీకరించరాదని, చెక్కుల ద్వారానే సేకరించాలని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయంది. దీనిపై పార్టీలు అభ్యంతరం తెలిపాయి. న్యాయపరంగా ఇవి చెల్లుబాటు కావని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని పార్టీలతో చర్చించటంతోపాటు న్యాయశాఖ సలహా తీసుకోవాలని కాంగ్రెస్ నేత వోరా సూచించారు. ఈమేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. సమావేశాలు, వీధుల్లో చందాల సేకరణ ద్వారా విరాళాలు సమకూర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. హుండీలో చందాలు వేసే దాతలకు రసీదులు ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. ఈసీ ఉత్తర్వులో పలు అంశాలు చెల్లవని, వీటికి తప్పుడు భాష్యాలు చెప్పే అవకాశం ఉందని సీపీఎం పేర్కొంది. -
కోట్లు కుమ్మరింత
ఎన్నికల ఖర్చు రూ.200 కోట్లు పోటాపోటీగా ‘ఓటుకు నోటు’ వెనుకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో సెగ్మెంట్లో రూ.10 కోట్లకు పైనే పంపిణీ జనగామ సెగ్మెంట్లో అత్యధికం కాగితాల్లో మాత్రం కాకిలెక్కలు హన్మకొండ, న్యూస్‌లైన్ : ఈసారి జరిగిన ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డుకెక్కాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్లు ఖర్చరుునట్లు రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముద్ర వేసుకోవాలనే తపనతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీగా తారుులాలు సమర్పించినట్లు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ. 70 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ... ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెదజల్లారు. ఇక అధినేతలు, ప్రధాన నాయకులు పోటీ పడిన సెగ్మెంట్లలో ప్రలోభ పర్వం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగగా... ధన, మద్య ప్రవాహం ఏరులై పారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 153 మంది అభ్యర్థులు పోటీ చేయగా... వారిలో 36 మంది ప్రధాన పార్టీలు, మరొక్కరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా ఎనిమిది మంది తలపడ్డారు. వీరందరూ ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. పది మంది సభ్యులుగా ఉన్న సంఘానికి ఒక పార్టీ అభ్యర్థి రూ. ఐదు వేలు ఇస్తే... మరో పార్టీ అభ్యర్థి ఏకంగా రూ.పది వేలు ఇచ్చారు. ఇలా ఒకరి కంటే ఒకరు రెండింతల డబ్బును వారి చేతిలో పెట్టారు. జిల్లాలోని 43 వేల మహిళా సంఘాలు, 14 వేల యువజన సంఘాలు, గ్రామగ్రామాన ఉన్న కుల సంఘాలు, వాడవాడలా ఉన్న కాలనీ అభివృద్ధి కమిటీలకు ఈసారి అన్ని పార్టీల నుంచి ప్రలోభాలు దక్కాయి. సంఘాల వారిగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా ఒక్కొక్కరికి ఎన్నికల్లో లాభం చేకూరింది. ఇలా కాగితాల్లోకెక్కని ఖర్చు కోట్లకు చేరింది. నిన్నటివరకు ఆయా సెగ్మెంట్లలో తమ పార్టీ తరఫున నోట్లను పంచిన పార్టీల నేతలు... ఇప్పుడు జిల్లా కేంద్రంలో అంచనాలు వేసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంపిణీ చేశాం... నోట్లకు ఓట్లు ఎన్ని రాలాయి... అనే లెక్కల్లో మునిగిపోయూరు. కాగా, అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా... అధికారులకు మాత్రం లక్షల్లో ఖర్చు చూపించారు. ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలు... ఎంపీ అభ్యర్థి రూ. 60 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు కాకిలెక్కలు చూపించారు. అధికారులు కెమెరా కళ్లతో నిఘా పెట్టినా... పట్టుబడలేదు. చివరిరోజు మాత్రం పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్తోపాటు పలు ప్రాంతాల్లో రూ. 70 లక్షలు పట్టుకున్నారు. కోటీశ్వరులు పోటీ చేసిన జనగామ సెగ్మెంట్లో తాయిలాలు జోరుగా సాగా యి. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు నోట్ల వరద పారిం చారు. ఓ అభ్యర్థి రూ.15 కోట్లు ఇక్కడ వెదజల్లినట్లు ప్రచారం సాగుతోంది. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు రూ.పది కోట్ల చొప్పున ఖర్చు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు. మొత్తం రూ.30 కోట్ల వరకు ప్రలోభ జాతర సాగినట్లు అంచనా. పాలకుర్తిలో ఓ పార్టీలో ప్రధాన పదవిలో కొనసాగుతున్న అభ్యర్థి రూ.15 కోట్ల నుంచి రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నారుు. మిగిలిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సైతం నోట్ల కట్టలను వెదజల్లినట్లు నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్ సెగ్మెంట్లలో ఒక్కో అభ్యర్థి రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. వరంగల్ తూర్పులో ఓ పార్టీ అభ్యర్థి తరఫున వ్యాపారులే డబ్బులు పంపిణీ చేశారు. ఆర్వోబీ నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పలువురు వ్యాపారులు తలా కొంత వేసుకుని కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ పశ్చిమ, మానుకోట, వర్ధన్నపేట, ములుగు నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి రూ. 4 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు వెదజల్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు. వరంగల్ ఎంపీ స్థానంలో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నోట్ల కట్టలను వెద్దజల్లినట్లు ఆయూ శ్రేణులు ముచ్చటించుకుంటున్నారుు. మానుకోటలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఇచ్చినట్లు తెలిసింది.