councilling shedule
-
TG: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి. -
డిగ్రీ తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
♦ ఈనెల 22 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ♦ ఆగస్టు 4న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ నిర్వహణకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. ఈనెల 20వ తేదీ నుంచే తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావించినా, ఏర్పాట్లకు సమయం సరిపోదన్న ఆలోచనతో ఈనెల 22కు వాయిదా వేసింది. ఆ మేరకు ఈనెల 22 నుంచి 31 వరకు తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని కమిటీ బుధవారం నిర్ణయించింది. దీని కోసం మీసేవా కేంద్రాల్లో అథెంటికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీన సీట్లను కేటాయించనుంది. సీట్లు పొందిన విద్యార్థులంతా ఆగస్టు 4వ తేదీ నుంచి 11లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కమిటీ పేర్కొంది. మొదటి, రెండు దశల్లో సీట్లు పొందిన వారిలో 1,51,588 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, తుది దశ కౌన్సెలింగ్‌లో 2,57,479 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.