గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్‌కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది.
మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం.
ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్‌ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్‌లతో లింక్‌లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది.
కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్‌లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది.
#WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR
— ANI (@ANI) September 10, 2022
#WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6
— ANI (@ANI) September 10, 2022