Courageous act
-
వేధించడానికి 30 ఫోన్లు మార్చాడు!
అదే సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగం ఎట్టకేలకు షీ-టీమ్‌కు చిక్కిన నిందితుడు మరో కేసులో ఓ విద్యార్థికీ అరదండాలు సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సంక్షిప్త సందేశాల ద్వారా ఓ వివాహితను వేధించడానికి ఏకంగా 30 సెల్ఫోన్లు మార్చాడు. అదే సంఖ్యలో సిమ్కార్డులూ వినియోగించాడు. చివరకు విషయం షీ-టీమ్స్‌కు చేరడంతో బుధవారం పట్టుబడి కటకటాల్లోకి చేరాడు. ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. అంబర్పేట్ పరిధిలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితను వేధించడం ప్రారంభించిన ఇతగాడు దీనికోసం వివాహితకు సంబంధించిన అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో ఆమె భర్త, అత్తమామల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీనికోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. ఓ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసి ఈ చర్యలతో వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. విసిగిపోయిన బాధితురాలు షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు. ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఆమె తండ్రికీ ఆన్లైన్లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు. -
యువకుడిపై నిర్భయ కేసు నమోదు
బొమ్మలరామారం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని యువకుడి వేదింపులు తాళలేక రాంలిగంపల్లికి చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలిలా.. మెదక్ జిల్లా, జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన గుర్రం కర్ణాకర్ అనే యువకుడు తనవద్ద ట్యూషన్‌కోసం వచ్చిన యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాలని అనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడేవాడు. అతనికి దూరంగా ఉండటానికి స్వగ్రామానికి వచ్చినా వెంటపడుతూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఇటీవలే ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. విసిగిపోయిన పోలీసులను ఆశ్రయించగా కర్ణాకర్‌పై నిర్బయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు. ఇదిలావుం డగా యువతి బంధువులు తనపై దాడి చేశారని యువకుడు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘గాంధీ’లో ‘నిర్భయ’ సెల్
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ‘నిర్భయ’సెల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. అత్యాచారాలు, వేధింపులకు గురైన మహిళలకు అన్నివిధాలా వైద్యసేవలతోపాటు సహాయసహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సెల్లో స్త్రీవైద్యనిపుణురాలు, పోలీస్ అధికారి, సైక్రియాట్రిస్ట్ (కౌన్సిలర్)తోపాటు చైల్డ్ హెల్త్ వెల్ఫేర్‌కు చెందిన మరో అధికారి సభ్యులుగా ఉంటారు. నిర్భయ చట్టం ద్వారా నమోదైన కేసుల్లోని బాధితులను ఈ సెల్ సభ్యులు విచారించి, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతారు. ‘వన్ స్టాప్ క్రైసెస్ సెంటర్ ఫర్ ఉమెన్’ పేరిట ఏర్పాటవుతున్న ఈ సెల్‌కు త్వరలోనే పేరు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్భయసెల్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 1వతేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను గాంధీ ఆస్పత్రిలో కల్పించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ పి. ధైర్యవాన్ తెలిపారు. -
రెండో సారి షీకి చిక్కితే నిర్భయ కేసు
రెండు నెలల్లో 80 మంది అరెస్టు అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్ కేసులో రెండో సారి పట్టుబడితే వారిపై నిర్భయ చట్టం ప్రయోగిస్తామని అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) స్వాతిలక్రా హెచ్చరించారు. రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్’లకు శనివారం వరకు 80 మంది యువకులు చిక్కారని ఆమె తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాత్రిలక్రా వివరాలు వెల్లడించారు. షీ బృందాలకు చిక్కిన వారిలో 16 మందిని కోర్టులో హాజరుపర్చగా, ఎనిమిది మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఈవ్‌టీజింగ్ ఎక్కువగా మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాల, దిల్సుఖ్నగర్ లోని ఎన్ఆర్ఐ కళాశాల, మలక్‌పేటలోని వాణి కళాశాల, కోఠి, ఎస్ఆర్నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్ బస్టాప్‌లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో చోటు చేసుకున్నాయన్నారు. బాధితుల నుంచి 100కు ఫోన్లు రాగానే సీసీఎస్ ఏసీపీ కవిత వెంటనే స్పందించి ఆ ఏరియాలోని షీ టీమ్స్‌ను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది కరపత్రాలు, బుక్లెట్లు పంచుతూ ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదు చేయాలని మహిళలకు ధైర్యం చెబుతున్నారని వివరించారు. నగరంలో అన్ని పాఠశాలలో త్వరలో చైల్డ్ అబ్యూజింగ్ మేనేజింగ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయివేటు సంస్థలు కూడా మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కమిటీలు వేసుకోవాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌పై షార్ట్‌ఫిలింలు రూపొందించామని, వాటిని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి, పట్టుబడిన కొందరు యువకులు మీడియాతో మాట్లాడుతూ, తాము సైతం ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ జె.రంజన్త్రన్, ఏసీపీ కవితలు పాల్గొన్నారు. -
బెల్ట్ షాపులు రద్దు చేయాలి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో బెల్ట్ షాపులను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. తిరుపతికి వచ్చిన ఆమె గురువారం పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడడం తో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల విషయంలో నిర్భయ చట్టం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, మనిషి ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రావాలని అన్నారు. వరకట్న వేధింపులపై ఫిర్యాదు వరకట్నం కోసం భర్త, అత్త వేధిస్తున్నారంటూ చిత్తూరుకు చెందిన పీ.పర్వీన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురన వెంకటరత్నంకు ఫిర్యాదు చేశారు. వడమాలపేటకు చెందిన నజీర్ సాహెబ్ కుమార్తెనైన తనకు చిత్తూరుకు చెందిన మహబూబ్ బాషాతో 2008లో పెళ్లి అయిందని, ఆ రోజు నుంచే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత నెల ఒకటో తేదీన తీవ్రంగా కొట్టారని, అదే నెల నాలుగో తేదీన మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని కన్నీరుమున్నీరయ్యా రు. తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలి జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న పారి శుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని సంఘమిత్ర సర్వీస్ సొసైటీ ప్రతినిధులు అమర్నాథ్, చలపతి, కౌసల్య మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. ఈ మేరకు వారు ఆమెకు వినతిపత్రం అందజేశారు. -
బాలికపై అత్యాచారం, హత్య
భువనేశ్వర్: అత్యాచారాలను నిరోధించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా మార్పు మాత్రం కనిపించడంలేదు. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ కామాంధుడి ఘాతుకానికి అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలిక బలైపోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భువనేశ్వర్‌లోని సాలియా సాహి మురికివాడలో ఓ కుటుంబం నివసిస్తోంది. అదే వాడకు చెందిన అశోక్ సాహు(22) మంగళవారం వారి దగ్గరకు వచ్చి ఓ వ్యక్తి చిరునామా చూపించాలని కోరాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు.. నాలుగో తరగతి చదువుతున్న బాలికను అతడితోపాటు పంపించారు. అయితే అశోక్.. ఆమెను అదే మురికివాడలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఎంతసేపటికీ తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా, ఓ మైదానంలో ఆమె శవం కనిపించింది. పోలీసులు అక్కడకు సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజ్ గేటు వద్దనున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, అశోక్ సాహు నిందితుడని తేలింది. వెంటనే స్థానికులు అతడ్ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు బాధితురాలి కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసులు తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన... బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ ఘటనపై సీఎం నవీన్‌పట్నాయక్ క్షమాపణ చెబుతూ ఓ ప్రకటన చేయాలని విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, ఆందోళనతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సభలో ఓ ప్రకటన చేశారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ బాధితురాలి కుటుంబానికి సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.