బొమ్మలరామారం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని యువకుడి వేదింపులు తాళలేక రాంలిగంపల్లికి చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలిలా.. మెదక్ జిల్లా, జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన గుర్రం కర్ణాకర్ అనే యువకుడు తనవద్ద ట్యూషన్‌కోసం వచ్చిన యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాలని అనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడేవాడు.
అతనికి దూరంగా ఉండటానికి స్వగ్రామానికి వచ్చినా వెంటపడుతూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఇటీవలే ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. విసిగిపోయిన పోలీసులను ఆశ్రయించగా కర్ణాకర్‌పై నిర్బయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నర్సింహారావు తెలిపారు. ఇదిలావుం డగా యువతి బంధువులు తనపై దాడి చేశారని యువకుడు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యువకుడిపై నిర్భయ కేసు నమోదు
Published Sat, Aug 1 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement