
ప్రతీకాత్మక చిత్రం
నాగినా, ఉత్తరప్రదేశ్ : సాధరణంగా సినిమాల్లో హీరోయిన్‌కి మరో వ్యక్తితో వివాహం జరుగుతుంటే హీరో బైక్ వేసుకుని వచ్చి హీరోయిన్‌ను తనతో తీసుకెళ్లడాన్ని పలు చిత్రాల్లో అందరం చూశాం. రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనను చూశారా?.
ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి అద్భుతం జరిగింది. నాగినా ప్రాంతంలో తను ప్రేమించిన అమ్మాయికి వివాహం జరుగుతున్న చోటుకు ఓ యువకుడు బైక్ వేసుకుని వెళ్లాడు. మండపంలో బండిని ఆపుతూనే వెంట తెచ్చుకున్న పూల దండను ఆమెకేసి విసిరాడు.
అతడు విసిరిన దండ ఆమె మెడలో పడటం చూసిన వరుడు షాక్‌లో ఉండిపోయాడు. వెనువెంటనే పెళ్లిపీటల మీది నుంచి లేచిన వధువు తన కోసం వచ్చిన యువకుడి మెడలో దండ వేసింది. ఈ ఘటనతో అవాక్కైన వరుడి తరఫు బందువులు యువకుడిపై దాడి చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని రక్షించారు. యువకుడు, వధువు కలసి చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారని పోలీసులు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment