court petition
-
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
ఆరేళ్ల తర్వాత ధిక్కరణ పిటిషన్ విచారణార్హం కాదు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఏడాదిలోగా మాత్రమే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2009లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ 2015లో దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్, రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులకు సింగిల్ జడ్జి జస్టిస్ అమర్నాథ్గౌడ్ ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వీరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 383 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమి తమదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ల అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 2015లో వారు కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
నా వర్గం వారిని రక్షించేందుకే చేరా...
పోలీసు విచారణలో ఐఎస్ఐఎస్ సభ్యుడు సల్మాన్ వెల్లడి అతడి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: విజిట్ వీసా మీద దుబాయ్‌కు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం పోలీసులకు పట్టుబడిన ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ సభ్యుడు సల్మాన్ మొహియుద్దీన్ విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు. సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న తమ వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్ఐఎస్లో చేరానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ‘దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు నక్కీ జోసెఫ్ అలియాస్ ఆయేషాతో కలసి దుబాయ్ నుంచి టర్కీ మీదుగా రహస్యంగా సరిహద్దులు దాటి సిరియా చేరాలనుకున్నా, అమెరికాలో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించా. అక్కడ వీసా రాకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చా. ఐఎస్ఐఎస్లో శిక్షణ తరువాత ఇక్కడ కూడా (హైదరాబాద్‌లో) ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయాలనుకున్నా’ అని సల్మాన్ విచారణలో పోలీసులకు తెలిపాడు. సల్మాన్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్... విమానాశ్రయంలో సల్మాన్ తమకు చిక్కకుండా ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్‌లో భారీ విధ్వంసం జరిగేదని పోలీసులు అంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న లాప్టాప్ హార్డ్‌డిస్క్‌ను విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సల్మాన్‌ను పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఆర్జీఐఏ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, చర్లపల్లి జైలులో ఉన్న సల్మాన్‌ను చూసేందుకు శనివారం కుటుంబసభ్యులు వచ్చివెళ్లారు. ఫేస్బుక్, ట్వీటర్లపై ఆరా.. ‘దౌలాన్ న్యూస్’ పేరుతో సల్మాన్ నడుపుతున్న ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలో ఉన్నవారి జాబితాపై కూడా పోలీసులు దృష్టిసారించారు. అక్టోబర్‌లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాక సల్మాన్ ఎన్ని పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరిచాడు, ఎంత మందితో పరిచయం పెంచుకున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని తేలింది. సల్మాన్ మొబైల్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘ఐఎస్’వైపు 87 మంది హైదరాబాదీలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 87 మంది విద్యావంతులు కూడా ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులైన వారిలో ఉన్నారు. వీరిలో 44 మంది యువకులకు సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మిగతావారిపై గట్టి నిఘా పెట్టారు. వీరంతా శివార్లలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో చదువుతున్నవారే కావడం గమనార్హం. అప్రమత్తమైన పోలీసులు... ఐఎస్ఐఎస్ జాడలు మరోసారి నగరంలో కనిపించడంతో జంట పోలీసు కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేస్బుక్ ఖాతాలపై నిఘాను సైతం పెంచారు. ‘‘ సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న మా వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్ఐఎస్లో చేరా. దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు అయేషాతో కలిసి టర్కీ నుంచి రహస్యంగా సిరియాకు వెళ్లాలనుకున్నాం. అమెరికా నుంచే దుబాయ్‌కి విజిటింగ్ వీసా మీదా వెళ్లాలనుకున్నా.. కానీ, వీలుకాలేదు. అందుకే హైదరాబాద్‌కు వచ్చి నాలుగు నెలల తర్వాత మళ్లీ దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించా.’’ - పోలీసుల విచారణలో ఐఎస్ఐఎస్ సభ్యుడు సల్మాన్ -
భర్త కోసం మౌనపోరాటం
వాళ్లిద్దరిదీ అన్యోన్య దాంపత్యం.. వాళ్ల సంసారం కొన్నేళ్లపాటు ఆనందంగా సాగింది. చిన్న చిన్న మనస్పర్ధలే వారి మధ్య ఎడబాటుకు కారణయ్యాయి. సర్ది చెప్పాల్సిన పెద్దలు కూడా ఆమెకు అన్యాయం చేశారు. వారు కూడా భర్త వైపే మాట్లాడటంతో పాపం ఆ అభాగ్యురాలు మూడేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఇప్పుడు నా మొగుడు నాక్కావాలంటూ ఆమె మౌనపోరాటానికి దిగింది. అమెకు మహిళా సంఘాల వారు అండగా నిలిచారు. - ప్రొద్దుటూరు క్రైం ఓ భార్య మౌన పోరాటం ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన కూరగాయల వ్యాపారి షంషీర్ కుమార్తె గౌసియా వివాహం 2008వ సంవత్సరంలో రాజాజీరోడ్డు ప్రాంతానికి చెందిన ఎస్ఎండీ కరీముల్లా అనే డాక్టర్‌తో అయింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో గౌసియా తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదుతో పాటు 45 తులాల బంగారాన్ని ఇచ్చారు. వారికి మున్నీ సాదిన్ అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొన్నేళ్ల వరకు వారి సంసారం సజావుగా సాగింది. చిన్న చిన్న సమస్యలే పెద్ద అగాధంగా... ఆ తరువాత చిన్న చిన్న సమస్యలు తలెత్తి పెద్ద అగాధం ఏర్పడింది. నలుగురు ఆడపడచులు, ఒక మరిది ఉండగా, తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గౌసియా నెల తప్పింది. అదే సమయంలో ఆడబిడ్డ కూడా నెల తప్పింది. ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బందిగా ఉందని బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని గౌసియా కన్నీటిపర్యంతమయ్యారు. భర్తతో పాటు అత్తింటి వారిపై 2011 నవంబర్ 26న కడప మహిళా పోలీస్ స్టేషన్లో గౌసియా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, మామతో పాటు నలుగురు ఆడపడచులపై 26/11 క్రైం నెంబర్ కింద కేసు నమోదైంది. భర్త, మామకు జైలు శిక్ష ఖరారు ఈ ఏడాది జూన్ 20న భర్త కరీముల్లా, మామ ఖాసీంపీరాకు కోర్డు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తరువాత బాధితురాలు ప్రొటెక్షన్ ఆర్డర్, భరణం కావాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గౌసియాకు తలాక్ ఇచ్చినట్లు కరీముల్లా కుటుంబ సభ్యులు అంటున్నారు. తర్వాతనే ఆమెకు నెలకు రూ.6 వేలు భరణం చెల్లిస్తున్నామని వారు చెబుతున్నారు. తన ప్రమేయం లేకుండా తలాక్ ఇచ్చారని గౌసియా ఆవేదన వ్యక్తం చేస్తోంది. తలాక్ నోటీసులో తాను సంతకాలు చేయలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగానే రెండో పెళ్లికి... కోర్టులో కేసు నడుస్తుండగనే తన భర్త రెండో పెళ్లికి ప్రయత్నం చేస్తున్నాడని గౌసియా నాలుగు రోజుల కిందట ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తన భర్తకు వచ్చే ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లులో రెండో పెళ్లి జరుగుతోందని సమాచారం అందడంతో భర్త ఇంటి ఎదుట మంగళవారం నుంచి ఆమె మౌనపోరాటానికి కూర్చున్నారు. విష యం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు తరలివచ్చారు. గౌసియాకు న్యాయం జరిగే వరకు ఇక్క డి నుంచి కదిలేది లేదని భీష్మిం చారు. కరీముల్లా హైదరాబాద్ నుం చి బుధవారం ఉదయం వస్తాడని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. అంత వరకూ ఇక్కడే అన్నపానీయాలు ముట్టుకోకుండా కూర్చుం టానంటూ గౌసియా గద్గద స్వరంతో అన్నారు. తనకు పెళ్లి అయ్యేనాటికి భర్తకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, కట్నం డబ్బులతో అప్పులు తీర్చుకున్నాడని గౌసియా వివరిం చింది. తనకు భర్తే కావాలని ఆమె అంటోంది. అక్కడికి వచ్చిన మహిళందరూ కరీముల్లా ఫొటోను చూపి స్తూ నిరసన తెలిపారు. దీంతో రాకపోకలు నిలిచి పోగా పోలీసుల రాక తో వారు రోడ్డుపై నుంచి కరీముల్లా ఇంటి ప్రాంగాణానికి మారారు.