cow row
-
వీడియో: నన్నెవరూ ఆపలేరు.. ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు
ఆసుపత్రిలో ఐసీయూ అనగానే అందరికీ.. విషమంగా ఉన్న పేషంట్స్‌కు మాత్రమే చికిత్స అందించే ప్లేస్ అని తెలుసు కదా. అయితే, ఒక్కోసారి ఐసీయూలోకి పేషంట్‌ను చూసేందుకే ఇతరులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించరు. ఇలాంటి క్రమంలో ఐసీయూలోకి ఏకంగా ఓ ఆవు ప్రవేశించి చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో ఉన్న ఓ ఆసుపత్రిలోని ఐసీయూలోకి ఆవు ప్రవేశించింది. అనంతరం.. ఆవు కొద్దిసేపు ఐసీయూ, ఆసుపత్రిలో చక్కర్లు కొట్టింది. అక్కడే తిరుగుతూ ఆసుపత్రి ఆవరణలోని చెత్త డబ్బాలో అన్న మెడికల్ వ్యర్థాలను తిన్నది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆసుపత్రి యాజమాన్యంపై పేషంట్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఐసీయూలోకి ఆవు ప్రవేశించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే, పాత కోవిడ్ వార్డులోకి ఆవు వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఆసుపత్రి ఇన్చార్జ్, గార్డును సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. WATCH: #BNNIndia Reports On Friday, a cow was seen roaming freely and eating medical waste from the hospital's garbage cans in the intensive care unit (ICU) of a hospital in Madhya Pradesh's Rajgarh district. pic.twitter.com/15ktUQprhj — Gurbaksh Singh Chahal (@gchahal) November 19, 2022 -
చంద్రబాబుకు బాధ్యత లేదా?
≈ సీఎంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు ≈ దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే తీరిక లేదా? ≈ మొక్కుబడిగా రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందా? ≈ ఒక్కొక్కరికి రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే ≈ బాధితుల గోడు వింటే గుండె బరువెక్కుతోంది ≈ దళితులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ≈ అమలాపురం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రతిపక్ష నేత సాక్షిప్రతినిధి, కాకినాడ: పాశవిక దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే సమ యం, తీరిక, బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేవా? అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గోదావరి అంత్య పుష్కరాల ముగింపు ఉత్సవాలకు రాజమహేంద్రవరానికి వచ్చి కూడా బాధితులను కనీసం పలకరించాలనే మానవతా దృక్పథం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితులను పట్టించుకోకుండా వెళ్లిపోయిన చంద్రబాబును ఏమనుకోవాలని ప్ర శ్నించారు. బాధితులకు ఏదో మొక్కుబడిగా తలో రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుచుకుంటున్న దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమలాపురం ఏరి యా ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. మీడియాతో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నిన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చారు. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి, ఏం జరిగిందో అడిగి ఉంటే.. వారిలో మనోధైర్యం పెరిగేది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబితే బాధితుల్లో నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఈవాళ చంద్రబాబు ఇవ్వగలుగుతున్నారా? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం ప్రకారం.. ఇలాంట దారుణమైన ఘటనలు జరిగితే ప్రభుత్వం తరుపున బాధితులకు రూ.లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి మాత్రం అందులో మొదటి చెప్పిన రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబే చెప్పాలి. చట్టంలో ఉన్నట్టుగా నలుగురు బాధితులకు రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలి. ప్రజలకు తోడుగా ఉంటామనే భరోసాను కల్పించాలి. హోం మంత్రి సొంత మండలంలో ఘోరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన విషయాలు వింటే గుండె బరువెక్కుతోంది. వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా? వారు దశాబ్దాలుగా చర్మాలు వలుచుకునే వృత్తిలో ఉన్నారు. బతుకు తెరువు కోసం వారికి మరో మార్గం లేదు. ఆవు చర్మం తీస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరిని శ్మశానం నుంచి దాదాపుగా 300 మీటర్లు చొక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా లాక్కొని పోయారు. శ్మశానం నుంచి బయటకు వచ్చిన తరువాత చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దుర్భాషలాడుతూ చెప్పు తీసుకుని మరీ కొట్టారు. చిన్న పిల్లవాడిని కూడా వదిలిపెట్టలేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. వ్యక్తులను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, చెట్లకు కట్టేసి చెప్పులతో కొట్టడమన్నది సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అరగంట తరువాత పోలీసులు వచ్చారు. పోలీసుల సమక్షంలోనే తమను తీవ్రంగా కొట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్లని కాపాడేందు కోసం వారి పిల్లలు కూడా వచ్చారట. పిల్లలను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ కొట్టారు. రాష్ట్ర హోం మంత్రి సొంత మండలంలో ఇది జరగడం అత్యంత హేయం. ఏం జరిగిందో తెలుసుకోవాలని దళిత సంఘాలు వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే బాధితులను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసు స్టేషన్లో వ్యాను డ్రైవర్ లక్ష్మీప్రసాద్‌ను లెంపకాయలు కొట్టారు. నిజంగా పేదవాళ్లంటే ఇంత అలుసా? చట్టాలన్నీ ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఇక ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది? తోటి మనిషిని మనిషిగా చూడాలి మన వ్యవస్థలో మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే మనం ముందుండి గట్టిగా అడగాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి. ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. మొన్న విశాఖ జిల్లా ఫాల్మన్పేటలో మత్స్యకారులకు ఇదేరమైన అన్యాయం జరిగింది. అక్కడ యనమల రామకృష్ణుడు అనే మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి తన తమ్ముడిని, మనుషులను పంపించి బీభత్సం సృష్టించాడు. మేమంతా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలిచాం. వారికి భరోసా ఇచ్చాం. ఇక్కడ కూడా దళితులకు అన్యాయం జరిగిందని వచ్చాను. తప్పు చేశారని భావిస్తే పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టాలి. అంతేకానీ ఎవరికి వారు నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టకూడదు. ఇలా కొట్టేవారిని కఠినంగా శిక్షస్తేనే సమాజానికి సందేశం వెళ్తుంది’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు. -
గోవధ అపోహ బాధితులకు పరామర్శ
-
21వ శతాబ్ధంలో కూడా ఇలాంటి ఘోరమా?
-
21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్
అమలాపురం: దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్పత్రిలో పేషెంట్లుగా ఉన్న దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని అడిగితే వీళ్ల చెప్పిన విషాయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఇది ధర్మమేనా.. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా?. ఏం జరిగిందని అడిగినప్పుడు వాళ్లు చెప్పింది వింటే బాధ అనిపిస్తుంది. అరవింద్ అనే సామిల్ ఓనర్ తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఇక్కడున్న ఎలిషా, వెంకటేశ్వరరావులను కోరారు. వీళ్లు జంతు చర్మం మీదే ఆధారపడి బతుకుతారు. వాళ్ల వృత్తే అది. అరవింద్ ఫోన్ చేసిన తర్వాత వాళ్లు ఆ ఆవును వ్యాన్‌లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చిపెడుతున్నారు. అది వాళ్ల వృత్తి.. అది తప్ప వేరే ఆదాయమార్గం లేదు. దశాబ్దాలుగా అదే పని చేసుకుంటున్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది - పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భాషలాడుతూ, చెప్పు తీసుకుని మొహాన కొట్టారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. వాళ్లు చేసింది తప్పని అనిపిస్తే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ నలుగురినీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయమేనా. పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు. వీళ్లను కాపాడేందుకు పిల్లలు వస్తే వాళ్లను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. వాళ్ల ముందు మళ్లీ కొట్టారు.అర్ధగంట తర్వాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీళ్లు చెప్పే మాటలను కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు. ఈ ఆవు యజమాని స్వయంగా చెబితేనే వెళ్లి ఆవు మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పినా, ఆ సామిల్లు ఓనర్‌తో మాట్లాడండని చెప్పినా కనీసం పోలీసులు ఆ మాటలు కూడా వినిపించుకోలేదు. పైపెచ్చు నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం, హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. ఆయన సొంత ఊరు అయినా కూడా ఇక్కడే ఈ ఘటన జరగడం బాధాకరం. మర్నాడు ఆ అరవింద్ దగ్గరకు పోవాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు. బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలి. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అమలాపురం: ‘గోవధ అపోహ’ బాధితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం మధ్యాహ్నం కలుసుకుని ఘటన పూర్వాపర్వాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల ఇద్దరు దళితులపై దుండగులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. -
'తూర్పు'లో చర్మకారులపై దాడి: ఉద్రిక్తత
అమలాపురం: ఇన్నాళ్లూ ఉత్తరాదికే పరిమితం పరిమితం అయిందనుకున్న ఆవు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆవును దొంగతం చేసి, చర్మం వొలుస్తున్నారనే నెపంతో ఇద్దరు చర్మకారులపై పాశవికదాడి జరింది. అమలాపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రధాని మోదీ దళితులపై దాడులను ఖండించిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ దాడి వార్త జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కడం గమనార్హం. అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు చర్మకారులు. వీరిద్దరూ ఓ మినీవ్యాన్ డ్రైవర్ తో కలిసి సోమవారం రాత్రి ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వొలిచేపనిలో ఉండగా.. కామనగరువు గ్రామానికి చెందిన ఎనిమిది మంది అక్కడికి వచ్చి, 'మా ఆవును దొంగిలించి, చింపి, తోలు వొలుస్తా' అంటూ ఆగ్రహంతో ఎలీషా, వెంకటేశ్వర్ రావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ లను బంధించి, తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది గమనించిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు సమచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దుండగులు పారిపోయారు. రక్తపు మడుగులో పడిఉన్న ముగ్గురినీ పోలీసులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ ఆవు ఎవరిది? కామనగరువు గ్రామస్తులకు చెందిన మూడు ఆవులు ఆది, సోమవారాల్లో తప్పిపోయాయి. వాటిని వెదుక్కుంటూ ఆవుల యజమానులైన రైతులు వివిధ ప్రాంతాలు గాలించారు. మరోవైపు అమలాపురానికి చెందిన బూరగాలయ అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం విద్యుదాఘాతానికి గురై మరణించింది. అతని అభ్యర్థనమేరకు ఎలీషా, లాజర్ లు ఆ ఆవును తీసుకెళ్లి, దూరంగా స్మశానంలో చర్మం వలిచేందుకుప్రయత్నించారు. సరిగ్గా అదేసమయానికి అక్కడికి చేరుకున్న కామనగరువు రైతులు.. ఆ ఆవు తమదేనని భావించి దళితులపై దాడిచేశారు. కనీసం వివరణ కూడా వినకుండా పాశవికంగా కొట్టారు. దీంతో కామనగరువుకు చెందిన పలువురిపై ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భగ్గుమన్న దళిత సంఘాలు: సెక్షన్ 30 అమలు దళితులపై దాడి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దాడిని నిరసిస్తూ అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు. వైఎస్సార్ సీపీ నాయుకడు ఇజ్రాయెల్ దాడి ఘటనను ఖండించారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా దళితులు రోడ్డెక్కి ఆవు, ఎద్దు మాంసాలతోనే వంటావార్పులకు దిగుతారని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 30 అమలులోకి తెచ్చినట్లు తూర్పుగోదావరి ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో ఆగస్టు 31 వరకు సెక్షన్ 30 అమలవుతుందని చెప్పారు.