cr saraswathi
-
రజనీపై మండిపడ్డ సీఆర్ సరస్వతి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా నటి, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్ సరస్వతి... రజనీకాంత్‌పై మండిపడ్డారు. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ కొత్త పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న సీఆర్ సరస్వతి మాట్లాడుతూ ...రజనీకాంత్ కు రాజకీయ పరిపక్వత లేదని మండిపడ్డారు. తూత్తుకుడి ఘటనలో సంఘ విద్రోహక శక్తులు చనిపోలేదని, సామాన్యులు మృతి చెందారని, నిజంగానే వారు హింసకు పాల్పడితే ఒక్క సంఘ విద్రోహక శక్తి ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. తమిళుల పోరాటాలను రజనీకాంత్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన మానసిక పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనలో పూర్తగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పేందుకు ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభను బహిష్కరించటం మంచిదికాదని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండగా ప్రభుత్వ వైఖరి నచ్చక ఈ సెషన్స్ మొత్తం బహిష్కరించటం ద్వారా సామాన్యుల సమస్యలు మరుగున పడిపోతాయని సరస్వతి వాపోయారు. -
ఆర్కేనగర్లో చిన్నమ్మ వర్గానికి చేదు అనుభవం
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆర్కే నగర్లో శశికళ వర్గానికి చెందిన సీఆర్ సరస్వతి ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. దినకరన్‌కు మద్దతుగా సరస్వతి ప్రచారం చేశారు. ఈ నెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది బరిలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. -
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
-
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు వస్తున్న కథనాలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఖండించారు. పన్నీర్ సెల్వం వర్గీయులే తమను బెదిరిస్తున్నారని, ఫోన్లో తనను కూడా బెదిరించారని ఆమె చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని, గవర్నర్ నిర్ణయం కోసమే తాము వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువడగానే తామంతా బయటకు వస్తామని, అలాగే ఇక్కడ క్యాంపులో ఎవరూ నిరాహార దీక్షలు చేయడం లేదని కూడా రామ జయలింగం చెప్పారు. ఎమ్మెల్యేల క్యాంపు వద్దకు డీజీపీ రాజేంద్రన్ బయల్దేరారన్న కథనాలు రాగానే శశికళ వర్గం అప్రమత్తమైంది. తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ప్రకటనలు ఇప్పించడంతో పాటు తేడాగా చెబుతారని భావించిన ఎమ్మెల్యేలను కూడా క్యాంపు నుంచి వేరే ప్రాంతాలకు తరలించేసినట్లు తెలిసింది. సంబంధిత కథనాలు చదవండి.. ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి? శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు'
-
'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు'
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని, పన్నీర్ సెల్వం పేరు ఎత్తడమే తమకు ఇష్టం లేదని తెలిపారు. పార్టీని చీల్చాలని చూస్తున్నవాళ్ల గురించి తాము పట్టించుకునేది లేదని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి చిన్నమ్మ మాట్లాడతారని తెలిపారు. ఇన్నాళ్లుగా పన్నీర్ సెల్వం చాలా మంచివాడనే అనుకున్నామని, కానీ ఇంత స్వార్థపరుడని ఇప్పుడే తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. తమిళ హాస్యనటుడు వడివేలుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని ఆమె పోల్చారు. నిజంగా అమ్మకు ఆయన విశ్వాసపాత్రుడే అయితే.. ఇదంతా చేయకుండా సైలెంట్‌గా ఉంటారన్నారు. -
‘అమ్మకు ప్రతిరూపం చిన్నమ్మ’
చెన్నై: జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే నాయకురాలు సీఆర్ సరస్వతి అన్నారు. జయ మృతిపై అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం వాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వమే సమాచారం తీసుకుందని వెల్లడించారు. న్యాయస్థానం అవసరమనుకుంటే కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు. శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి గుర్తు చేశారు. చిన్నమ్మ.. అమ్మ ప్రతిరూపమని, ఆమె పార్టీని సమర్థవంతంగా నడపగలరని పేర్కొన్నారు. జయలలిత మరణంపై అన్నాడీఎంకే కార్యకర్తల్లో అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన జోసఫ్ తరపు న్యాయవాది గీత అన్నారు. జయ మరణం వెనుకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. జయను అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు. జయ స్నేహితురాలు శశికళ నటరాజన్, సీఎం పన్నీరు సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పీసీ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చినట్టు లాయర్ గీత వెల్లడించారు.