మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి | we did not kidnap anybody, says cr saraswathi | Sakshi
Sakshi News home page

మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి

Published Fri, Feb 10 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి

మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి

తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు వస్తున్న కథనాలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఖండించారు. పన్నీర్ సెల్వం వర్గీయులే తమను బెదిరిస్తున్నారని, ఫోన్‌లో తనను కూడా బెదిరించారని ఆమె చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని, గవర్నర్ నిర్ణయం కోసమే తాము వేచి చూస్తున్నామని తెలిపారు. 
 
ఇక తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువడగానే తామంతా బయటకు వస్తామని, అలాగే ఇక్కడ క్యాంపులో ఎవరూ నిరాహార దీక్షలు చేయడం లేదని కూడా రామ జయలింగం చెప్పారు. 
 
ఎమ్మెల్యేల క్యాంపు వద్దకు డీజీపీ రాజేంద్రన్ బయల్దేరారన్న కథనాలు రాగానే శశికళ వర్గం అప్రమత్తమైంది. తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ప్రకటనలు ఇప్పించడంతో పాటు తేడాగా చెబుతారని భావించిన ఎమ్మెల్యేలను కూడా క్యాంపు నుంచి వేరే ప్రాంతాలకు తరలించేసినట్లు తెలిసింది. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement