sasikala camp
-
ఆర్కేనగర్లో చిన్నమ్మ వర్గానికి చేదు అనుభవం
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆర్కే నగర్లో శశికళ వర్గానికి చెందిన సీఆర్ సరస్వతి ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. దినకరన్‌కు మద్దతుగా సరస్వతి ప్రచారం చేశారు. ఈ నెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది బరిలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. -
పన్నీర్ ఇప్పుడేం చేస్తారు?
చెన్నై: శశికళ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన పళనిస్వామికి గవర్నర్ బలనిరూపణకు అవకాశం ఇవ్వడంతో పన్నీర్ సెల్వం ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వెంటే ఉండడంతో పన్నీర్ ఆశలకు గండిపడింది. సుప్రీంకోర్టు తీర్పు రాక ముందు వరకు శశి, సెల్వం వర్గాలకు అవకాశాలు సమానంగా ఉన్నట్టు కనబడ్డాయి. శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ విఫలమవడంతో ఆయన వెనకబడ్డారు. శశికళ జైలు శిక్ష పడడంతో పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందన్న అంచనాలు తప్పాయి. పళనిస్వామిని తెరమీదకు తీసుకొచ్చి 'చిన్నమ్మ' గట్టి దెబ్బ కొట్టారు. గవర్నర్ పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో పన్నీర్ వర్గం డీలా పడిపోయింది. బలనిరూపణకు 15 రోజులు సమయం ఇవ్వడంతో సెల్వం శిబిరం ఆశలు చిగురించాయి. తమ ముందున్న మార్గాలను పన్నీర్ వర్గం భావిస్తోంది. 1. పళని వెనుకవున్న ఎమ్మెల్యేలను బుజ్జగించి తనవైపు తిప్పుకోవడం 2. ఎమ్మెల్యేల మద్దతు పొంది బలనిరూపణలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించడం 3. శశికళతో రాజీకి వచ్చి తిరిగి అన్నాడీఎంకేలో చేరడం 4. చీలిక వర్గంగానే కొనసాగుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వరకు పోరాడటం -
పంతం నెగ్గించుకున్న 'చిన్నమ్మ'
చెన్నై: అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం కొలిక్కి వచ్చింది. శశికళ వర్గంతో జరిగిన పోరుతో పన్నీర్ సెల్వం ఓడిపోయారు. జైలుకు వెళ్లినా పార్టీలో 'చిన్నమ్మ' మాటే నెగ్గింది. తనపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు దిమ్మతిరిగేలా చేసి ఆమె కారాగారానికి వెళ్లిపోయారు. తన కనుసన్నల్లోనే కొత్త ప్రభుత్వం నడిచేలా ఏర్పాటు చేసుకున్నారు. జైలు వెళ్లే ముందు వ్యూహాత్మకంగా పార్టీలో తన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టారు. జయలలితకు విశ్వాసపాత్రుల్లో ఒకరైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొపెట్టి పన్నీర్ కు సీఎం కుర్చీ దక్కకుండా చేశారు. 'చిన్నమ్మ' ఆశీస్సులతో సీఎం పదవిని దక్కించుకున్న పళనిస్వామి సాహసాలకు పోకుండా 'అమ్మ' కుదిర్చిన మంత్రివర్గాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. శశికళ జైలుకు వెళ్లిన మరుసటి రోజే పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు శశికళపై ఫిర్యాదు చేసేందుకు పన్నీర్ సెల్వం వర్గం జాతీయ ఎన్నికల సంఘం తలుపు తట్టింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం పరంగా ఏమీ చేయలేకపోయినా, కనీసం పార్టీ పరంగానైనా ఆమెను ఓడించాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్టు కనబడుతోంది. బలనిరూపణకు వరకు ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉన్నప్పటికీ సెల్వంకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనబడడం లేదు. 'విధేయుడు'కి ఓటమి అంగీకరించక తప్పేట్టు లేదు. -
ఇంతకీ.. శశికళ క్యాంపు రిసార్టు బిల్లు ఎంత?
దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వాళ్లకు సహాయంగా (కాపలాగా) దాదాపు మరో 200 మందికి పైగా బౌన్సర్లు దాదాపు వారం రోజుల నుంచి విలాసవంతమైన బీచ్ రిసార్టులో ఉంటున్నారు. వాళ్లకు అక్కడ సకల మర్యాదలు జరుగుతున్నాయి. మరి వీళ్లందరూ అక్కడ ఉండేందుకు ఎంత బిల్లు అయ్యిందో ఎవరైనా అడిగారా, ఆ డబ్బులు ఎవరు పెట్టుకుంటున్నారో చూశారా? గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 60 గదులున్నాయి. వాటిలో మూడు రకాలు ఉంటాయి. ట్రాంక్విల్ రూంలు అయితే రోజుకు రూ. 5,500 చొప్పున, బే వ్యూ రూంలు అయితే రూ. 6,600 చొప్పున, పారడైజ్ సూట్లు అయితే రూ. 9,900 చొప్పున అద్దెలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని రకాల గదులను రూ. 7వేల చొప్పున రోజుకు బుక్ చేసుకున్నారని అనుకున్నా కూడా.. దాదాపు ఆరు రోజులకే బిల్లు రూ. 25 లక్షల వరకు వెళ్తుంది. ఇది కాక ఇంకా ఆహారం, మంచినీళ్లు, స్నాక్స్, పండ్లు, మద్యం.. ఇతర ఖర్చులన్నీ వేరు. దాదాపు ప్రతిరోజూ రాత్రి పూట ఎమ్మెల్యేల వినోదం కోసం భారీ ఎత్తున పార్టీలు జరుగుతున్నాయని సమాచారం. సుమారు 200 మంది మాత్రమే రిసార్టులలో ఉన్నారని అనుకున్నా, వాళ్లకు తిండి, ఇతర పానీయాల ఖర్చు రోజుకు రూ. 2వేలు మాత్రమే వేసుకుంటే మరో రూ. 25 లక్షలు అవుతుంది. బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిన తర్వాత అటునుంచి అటే వాళ్లందరినీ రిసార్టుకు తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్లు అసలు కనీసం దుస్తులు కూడా తెచ్చుకోలేదు. దాంతో ప్రతి ఒక్కరికీ ఇన్నిరోజులకు సరిపడా కొత్త దుస్తులు కొని తెచ్చారు. దానికోసం రోజుకు వెయ్యిరూపాయలు వేసుకున్నా, ఆరు రోజులకు కలిపి రూ. 12 లక్షలు అవుతుంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు ఏవైనా అదనపు సదుపాయాలు, సేవలు కోరుకుంటే వాటిని కూడా కల్పించాల్సిందే కాబట్టి వాటి ఖర్చు కూడా లెక్క వేసుకోవాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఈ వారం రోజులకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన వీకే శశికళకు తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించే అధికారం లేదని ఓ పన్నీర్ సెల్వం ఇప్పటికే చెప్పడమే కాదు, బ్యాంకులకు లేఖలు కూడా రాసేసి, అన్నాడీఎంకే పార్టీ నిధులన్నింటినీ స్తంభింపజేశారు. మరి అలాంటప్పుడు ఈ రిసార్టుల బిల్లులు ఎవరు భరిస్తున్నారో, దానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయనేది కూడా అనుమానించాల్సిన విషయమేనని అంటున్నారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
పన్నీర్ ఎన్ని ఎత్తులు వేసినా.. వృథా ప్రయాసే!
చెన్నై: సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ.. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించలేదని పోలీసులు తేల్చడం పన్నీర్ సెల్వం వర్గానికి కాస్త మింగుడు పడని విషయమే. తమను ఎవరూ నిర్బంధించలేదని ఎమ్మెల్యేలు చెప్పినట్లు మద్రాస్ హైకోర్టుకు పోలీసులు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ వీరవిధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం సీఎం కుర్చీ కోసం ఎన్ని జిత్తులు వేసినా, ఎలాంటి కుట్రలకు పాల్పడ్డా అవన్నీ వృథా ప్రయాసే అవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం శశికళ అవుతారని తమ పార్టీ నేతలకు నూటికి నూరుపాళ్లు నమ్మకం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసత్వాన్ని చిన్నమ్మ శశికళ అందిపుచ్చుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. బలమైన నాయకురాలిగా, మంచి పాలనాదక్షురాలుగా శశికళ పేరు తెచ్చుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు శశికళకే ఉందని, ఆమెనే సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని అన్నారు. జయలలితకు సన్నిహితురాలిగా ఉంటూ పరిపాలనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఆమెపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టులో ఉన్న 119 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. తమను ఎవరూ బంధించలేదని, స్వచ్ఛందంగా అక్కడ ఉంటున్నట్లు నేటి ఉదయం వారు పోలీసులకు వెల్లడించారు. దీంతో పన్నీర్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం శశికళ మరోసారి రిసార్టుకు వెళ్లడం.. తనకు మద్ధతివ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పన్నీర్ క్యాంపులో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడంలేదని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు కథనాలు చదవండి... తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? ఢిల్లీని ఢీ కొడతా జయలలిత చనిపోయినపుడే తెలిసింది -
శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరిగాయి. నిన్న మొన్నటి వరకు మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలను నిర్బంధించారని, ఒక్కొక్కరికి నలుగురు గూండాలను కాపలాగా పెట్టారని చెప్పగా.. అవన్నీ తప్పేనని చెన్నై పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రిసార్టులో మొత్తం ఎమ్మెల్యేలను నిర్బంధించి, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు స్పందించి, వారి విషయంలో వాస్తవాలు ఏంటన్నది చెప్పాలని పోలీసులను ఆదేశించింది. దాంతో డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు రిసార్టు వద్దకు వెళ్లి, అక్కడున్న ఎమ్మెల్యేలందరితో మాట్లాడారు. అక్కడ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తామంతా స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నట్లుగా వాళ్లు తమకు చెప్పారని నివేదికలో పేర్కొన్నారు. దాంతో ఒక్కసారిగా పన్నీర్ సెల్వం శిబిరం ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అసెంబ్లీలో బల నిరూపణ వచ్చేవరకు ఇక సెల్వం క్యాంపునకు ఎలాంటి అవకాశాలు లేనట్లేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇంతకుముందు రిసార్టులలో 92 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని పోలీసుల వైపు నుంచి సమాచారం రాగా, ఇప్పుడు 119 మంది ఉన్నారని, వాళ్లలో ఎవరూ తమను నిర్బంధించినట్లు చెప్పలేదని అధికారికంగా కోర్టుకు చెప్పడంతో.. మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు!
-
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. రంగంలోకి శశి!
-
రిసార్ట్ కు వెళుతున్న శశి.. క్షణక్షణం ఉత్కంఠ!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ కోసం పోరు ఇంకా కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం శశికళ 90కి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో ఉన్న గోల్డెన్ బే రిసార్టుకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను నేటి సాయంత్రం శశికళ కలుసుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ నేతల్లో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిసార్ట్ ప్రాంతానికి వెళ్లే ముందు చెన్నై మెరీనా బీచ్ లో జయ సమాధిని శశికళ సందర్శించనున్నారు. మెరీనా బీచ్ నుంచి నేరుగా తాను ఎమ్మెల్యేలను తరలించి ఉంచిన రిసార్ట్ వద్దకు వెళ్లనున్నారు. రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో నేరుగా భేటీలో పాల్గొని.. వారికి తాను ఏం చేయనున్నారో, ఎలాంటి ప్రయోజనాలు కల్పించనున్నారో వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సెల్వం వర్గంలో చేరుతుండటం ఆమె ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఈ తరుణంలో సీక్రెట్ రిసార్టుకు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలను తనకే మద్ధతు తెలపాలని మరోమారు కోరనున్నారు. రిసార్ట్ ప్రాంతానికి ఎమ్మెల్యేలకు అవసరమైన నూతన దుస్తులు, ఇతరత్రా సామాగ్రి పంపినట్లు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయాన్ని తెలపక పోవడంతో శశికళ కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి. తన కనుసన్నల్లో నడుచుకుంటున్న నేతలు పన్నీర్ వర్గంలో చేరకుండా ఉండాలంటే నేరుగా వెళ్లి వారితో చర్చించాలని శశికళ భావిస్తున్నారు. తమిళ రాజకీయాలకు సంబంధించి మరిన్ని కీలక కథనాలు: తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్! శరీరాలు రిసార్టులో.. మనస్సు సెల్వంపై! శశికళపై విజయశాంతి కామెంట్! గవర్నర్‌కు శశికళ మరో లేఖ -
రిసార్టులో ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పోలీసులు
శశికళ - పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న కుర్చీలాటలో భాగంగా రిసార్టులో దాచిపెట్టిన ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు ఎట్టకేలకు చేరుకున్నారు. మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. సుమారు 120 మంది వరకు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు సమాచారం రావడంతో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఉదయం అక్కడకు భారీ పోలీసు బలగాలతో వెళ్లిన విషయం తెలిసిందే. అదనపు డీఎస్పీ తమిళ్ సెల్వన్, డీఆర్వో రామచంద్రన్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ఉదయం 6.30 గంటలకే అక్కడకు చేరుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడటం మొదలుపెట్టింది. రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా లేక ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి అక్కడ ఉంచారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా చెప్పాలని కూడా పోలీసులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను నిజంగానే నిర్బంధిస్తే అది చాలా పెద్ద నేరం అవుతుందని మద్రాస్ హైకోర్టు మండిపడింది. సోమవారానికల్లా ఎమ్మెల్యేల విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని చెప్పింది. దాంతో పోలీసులు చురుగ్గా కదిలారు. అక్కడకు వెళ్లిన పోలీసులు, మీడియా ప్రతినిధులపై స్థానికులు, రిసార్టుల వద్ద ఉన్న ప్రైవేటు గార్డులు రాళ్లతో దాడులు చేశారు. కొంతమంది బౌన్సర్లను కూడా అక్కడ పెట్టి మరీ ఎమ్మెల్యేలను బయటకు కదలకుండా ఆపుతున్నట్లు కథనాలు వచ్చాయి. సంబంధిత వార్తలు చదవండి అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే.. సెల్వంకు మద్దతు.. చిన్నమ్మకు ఆందోళన గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాబలిపురం సమీపంలోని ద్వీపంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, శశికళ వర్గీయులతో పాటు కువత్తూర్కు చెందిన స్థానికులు కూడా పోలీసుల చర్యలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు వెళ్లిన మీడియా వర్గాల మీద కూడా లోపల ఉన్నవారు రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. డీఆర్వో కూడా అక్కడకు తమ సిబ్బందితో చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి అధికారులను గ్రామస్తులు బయటకు పంపేశారు. మరోవైపు లోపల ఉన్న ఎమ్మెల్యేలను మరో మార్గం గుండా బయటకు తీసుకొచ్చి, వారిని బెంగళూరు లేదా హైదరాబద్ తరలించేందుకు శశికళ వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు బయటకు వస్తే పన్నీర్ సెల్వం టీమ్‌లో చేరుతారన్నది శశి వర్గం ఆందోళనగా కనిపిస్తోంది. ఇదంతా రాజ్యాంగ సంక్షోభమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత వార్తలు చదవండి గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
-
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు వస్తున్న కథనాలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఖండించారు. పన్నీర్ సెల్వం వర్గీయులే తమను బెదిరిస్తున్నారని, ఫోన్లో తనను కూడా బెదిరించారని ఆమె చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని, గవర్నర్ నిర్ణయం కోసమే తాము వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువడగానే తామంతా బయటకు వస్తామని, అలాగే ఇక్కడ క్యాంపులో ఎవరూ నిరాహార దీక్షలు చేయడం లేదని కూడా రామ జయలింగం చెప్పారు. ఎమ్మెల్యేల క్యాంపు వద్దకు డీజీపీ రాజేంద్రన్ బయల్దేరారన్న కథనాలు రాగానే శశికళ వర్గం అప్రమత్తమైంది. తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ప్రకటనలు ఇప్పించడంతో పాటు తేడాగా చెబుతారని భావించిన ఎమ్మెల్యేలను కూడా క్యాంపు నుంచి వేరే ప్రాంతాలకు తరలించేసినట్లు తెలిసింది. సంబంధిత కథనాలు చదవండి.. ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి? శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
-
ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని.. నిజంగా వాళ్లు బందీలుగానే ఉన్నారా, ఎక్కడున్నా సోమవారానికల్లా అందరినీ తీసుకురావాలంటూ తమిళనాడు డీజీపీ టీకే రాజేంద్రన్‌ను మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా ఆదేశించింది. ఎమ్మెల్యేలు బందీలు కావడంపై ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. దాంతో క్యాంపు రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఇదే పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎస్, డీజీపీలు గవర్నర్‌కు వివరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు వద్దకు డీజీపీ స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా రిసార్టు.. ఎమ్మెల్యేలను నిర్బంధించినట్లు చెబుతున్న రిసార్టు ఒకరకంగా చెప్పాలంటే దుర్భేద్యమైనది. సముద్ర తీరానికి కిలోమీటరు దూరంలో సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఈ రిసార్టు ఉంటుంది. దానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా పడవల్లో వెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అక్కడినుంచి తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల మానసిక స్థితి ఎలా ఉందోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'సాక్షి' ప్రతినిధులు మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులకు ఫోన్లు చేసే ప్రయత్నం చేసినప్పుడు స్విచాఫ్ అని వచ్చింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు కలిశాయి గానీ .. అప్పుడు వాళ్లు చాలా ఆందోళనకరమైన స్వరంతో మాట్లాడారు. రిసార్టులకు తాము ఇష్టపూర్వకంగా వెళ్లామా లేదా ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా తంజావూరు నుంచి వచ్చిన రౌడీ మూకలు కాపలా ఉన్నాయి. దాంతో మీడియా కూడా అక్కడకు వెళ్లే ధైర్యం చేయలేకపోతోంది. సుప్రీంలో శశికి ఊరట మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది అంత అత్యవసరమైనది కాదని, అందువల్ల సాధారణ పద్ధతిలోనే ఈనెల 17న దాన్ని విచారిస్తామని తెలిపింది. దాంతో శశికళకు ప్రమాణస్వీకారం అవకాశాలు కాస్త పెరిగినట్లయ్యాయి. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!
-
మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!
తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు.. అచ్చంగా జైల్లో ఖైదీలలాగే వాళ్ల పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఏ ఒక్కరూ పన్నీర్ సెల్వానికి మద్దతు పలికే ప్రయత్నం కూడా చేయకుండా చూసేందుకు శశికళ మనుషులు.. మన్నార్గుడి మాఫియా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. వాళ్ల పరిస్థితి దాదాపు కిడ్నాప్ అయినట్లే ఉందని అంటున్నారు. వీళ్లందరినీ సుదూర ప్రాంతానికి తీసుకెళ్లారని, ముందుగానే అక్కడ మొబైల్ జామర్లు ఏర్పాటుచేసి ఏ ఒక్కరికీ సిగ్నల్ అన్నది రాకుండా చేశారని చెబుతున్నారు. సెల్ఫోన్లు తీసేసుకున్నా, ఎవరివద్దనైనా రెండోఫోన్ రహస్యంగా ఉంటే అది కూడా పనిచేయకుండా ఉండేందుకు ఇలా చేశారని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని గోల్డెన్ బే రిసార్టులకు తరలించారు. అక్కడ వందల సంఖ్యలో శశికళ మనుషులు కాపలా కాస్తున్నారు. ఎప్పుడూ అక్కడుండే సెక్యూరిటీని పక్కకు తప్పించి మరీ వాళ్లు ఆ బాధ్యత తీసుకున్నారు. ఎవరినీ లోపలకు వెళ్లనివ్వకుండా, ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. సాధారణ రోజుల్లో ఆ రిసార్టు వద్ద కేవలం ప్రవేశద్వారం వద్ద మాత్రమే సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి వంద మీటర్లకు ఒకరి చొప్పున కాపలా కాస్తున్నారు. అలా రిసార్టుకు కిలోమీటరు దూరం వరకు ఈ సెక్యూరిటీ ఉంటోంది. ప్రధానంగా జర్నలిస్టులు, టీవీ చానళ్ల సిబ్బంది అక్కడకు చేరుకోకుండా ఆపుతున్నారు. ఎప్పుడూ రిసార్టులలో అందుబాటులో ఉండే వై-ఫైని కూడా ఆపేశారు. లాండ్‌లైన్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ కూడా పూర్తిగా ఆపేశారు. పేపర్లు, టీవీలు ఏవీ అందుబాటులో లేవు. అసలు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో ఆ ఎమ్మెల్యేలకు తెలిసే అవకాశం లేనే లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకోడానికి హోటల్ సిబ్బంది కాఫీలు, టీలు ఇచ్చే వంకతో ప్రతి అరగంటకు అక్కడికెళ్లి, వాళ్ల మాటలు వింటున్నారు. ఇది కొన్ని సార్లు గొడవలకు కూడా దారితీసింది. తమ గదుల వద్దకు ఎందుకు వస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాళ్లను ప్రశ్నిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఇడ్లీ, వడ, దోశ, పొంగల్ లాంటి వాటితో పాటు మధ్యాహ్నం భోజనంలో చేపలు, మటన్ కర్రీ, రకరకాల కూరలు, బిర్యానీలు, థాలీలు, డెజర్టులు.. ఇలా అన్నీ ఉంటున్నాయి. ఇక మద్యం ప్రియుల కోసం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటితో సకల మర్యాదలు చేస్తున్నా, చీమ చిటుక్కుమనగానే తెలిసేలా చిన్నమ్మ మనుషులు జాగ్రత్త పడుతున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
శశికళకు షాక్: ఎమ్మెల్యేలు మిస్సింగ్!
తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న శశికళా నటరాజన్‌కు అనుకోకుండా పెద్ద షాక్ తగిలింది. అత్యంత జాగ్రత్తగా బస్సులలో ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటళ్లు, రిసార్టులకు తరలించి.. వాళ్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నా, అందులోంచి ఉన్నట్టుండి 43 మంది మిస్సయ్యారు. వీళ్లంతా పన్నీర్ సెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవి చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న శశికళకు ఇది అనుకోని షాక్ అయ్యింది. ప్రభుత్వం నిలబడాలంటే 233 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117 మంది మద్దతు అవసరం అవుతుంది. ఉన్న 130 మందిలోంచి 43 మంది వెళ్లిపోతే ఇక ఆమె వద్ద మిగిలేది 80-90 మంది మధ్య మాత్రమే. అలాంటప్పుడు ఆమె ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసినా, సభలో బలం నిరూపించుకోలేక వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలన, శాంతిభద్రతల గురించి చర్చించడానికే సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు చెబుతున్నా.. నిజానికి ఎమ్మెల్యేల క్యాంప్ ఎక్కడ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ విభాగం ఏమంటోందో తెలుసుకోడానికే పన్నీర్ వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇక గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చెన్నై రాజ్‌భవన్‌కు వస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు రాజకీయ నాయకులను కలుస్తారో లేదోనన్నది అనుమానంగానే ఉంది. ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇచ్చి, మిగిలినది తాను సభలో నిరూపించుకుంటానని చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ముందుగా డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితరులను పిలిపిస్తారు. ఆ తర్వాత తనవద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు సాయంత్రం తర్వాత మరింత వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.