cracker factory
-
TN: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డవారిని శివకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ఆదేశించారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ -
డబ్బులు కాలి బూడిదవుతున్నాయి!
దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. చెడు పై మంచి గెలిచినందుకు చిహ్నంగా ఆరోజు ఆనందంతో దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుతూ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం భారతీయ సంసృ్కతి. అయితే ఆనందాన్ని పంచుకోవల్సిన దీపావళి నాడు టపాసుల పేరుతో వాతావరణంలో కాలుష్యాన్ని పెంచేస్తూ అనేక తప్పిదాలకు పాల్పడుతున్నాం. దీపావళినాడు టపాసులు పేల్చడానికి సైంటిఫిక్ కారణము ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం శరదృతువులో దీపావళి పండుగ వస్తుంది. ఆ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. వర్షాకాలం నుంచి చలి కాలానికి మారే ఈ సమయంలో తేమ వాతావరణం, చలి కారణంగా అనేక అంటువ్యాధులను రోగాలను కలిగించే క్రిములు, దోమలు అభివృద్ధి చెందుతాయి. దీపావళి నాడు నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, టపాసులు కాల్చడం వలన వచ్చే పొగతో వీటిని నివారించవచ్చు. అందుకే భారతీయ సంస్కృతిలో దీపావళినాడు టపాసులు కాల్చే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.కానీ ఇప్పుడు మతాబులు, కాకరపువ్వొత్తులు లాంటి చిన్న చిన్న టపాసులుకాల్చే అలవాటు పోయు పెద్ద పెద్ద శబ్దాలు చేసే లక్ష్మీ బాంబులు, థౌజెండ్వాలాలు పేల్చే పనిలో పడ్డారు. వీటి వల్ల కేవలం వాతావరణ కాలుష్యం, శబ్ధకాలుష్యం లాంటివి పెరగడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కాలిబూడిద అవుతున్నాయి. భారతదేశంలో మత, కుల, ప్రాంతీయ బేధాలు లేకుండా చిన్న పెద్ద అందరూ కలసి చేసుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. అయితే ఆరోజు భారతదేశం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలను ఒక్కరోజు సరదా కోసం భారతీయులు ఖర్చుచేస్తున్నారు. ఈ దుబారా ఖర్చు ప్రతి యేడాది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కొన్ని సర్వేల ప్రకారం భారతదేశంలో 120 బిలియన్ల టపాసుల వ్యాపారం జరుగుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా 120కోట్లు (ఇప్పుడు 130 కోట్లు పైన పెరిగే అవకాశం ఉంది). అయితే వీరిలో ఒక్కొక్క కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు అనుకున్న మొత్తంగా 30 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు లెక్క. వీరిలో హిందువులు కానీ వారు 30శాతం మంది ఉన్నారు. మిగిలిన 70శాతంగా ఉన్న హిందువుల కుటుంబాలు దీపావళి నాడు ఎంతో కొంత టపాసులపై ఖర్చు చేస్తున్నాయి. సరాసరి ఒక కుటుంబం వచ్చి 500వందల నుంచి వేయి రూపాయల వరకు ఖర్చుచేసిన రూ. 21000 వేల కోట్లు ఒక్కదీపావళి నాడే కాల్చి బూడిద చేస్తున్నాం. భారతదేశంలో 1923వ సంవత్సరం నుంచి బాణసంచా కాలుస్తున్నాము. అప్పటిలో పశ్చిమ బెంగాల్లో ఉండే టపాసుల పరిశ్రమ చెన్నైలోని శివకాశీలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం భారతదేశంలో బాణసంచా తయారు చేసే సంస్థలు 8000లకు పైనే ఉన్నాయి. ఇక్కడ 2000వేల కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంటే బయట మార్కెట్లో వీటిని రూ.20,000వేల కోట్ల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కవగా బయట మార్కెట్లో అమ్ముతూ పండుగ రోజు జనాలను దోచుకుంటున్నారు. భారతదేశంలో నేటికి అనేక మంది మూడుపూట్ల తిండి దొరక ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా విడుదలయిన ఆకలి సూచిలో భారతదేశం 102 వ స్థానంలో ఉంది. దీపావళినాడు మన సంతోషం కోసం చేసే ఖర్చుతో ఎంతో మంది ఆకలి తీర్చొచ్చు. 2019-20 సంవత్సరానికి గాను మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్రప్రభుత్వం రూ.12,054కోట్లు కేటాయించింది. దీని ద్వారా దాదాపు 12కోట్ల మంది పిల్లలకు సంవత్సరం పాటు భోజనాన్ని అందించగలుగుతున్నాం. కానీ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బాణాసంచా పేరుతో ఒక్కరోజులో తగులబెడుతున్నాం. మనం ఒక్కరోజు ఖర్చు చేసే ఈ మొత్తం సిక్కిం(రూ. 8,665.36కోట్లు, మణిపూర్(రూ.14,636కోట్లు) లాంటి ఎన్నో రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపు అంటే ఆశ్చర్యపడకతప్పదేమో! కాబట్టి మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. దీపావళినాడు కేవలం టపాసుల రూపంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను కాల్చేస్తేనే ఆనందం వస్తుందా? అదే ఆ డబ్బుతో ఎవరో ఒక్కరికైనా సహాయం చేస్తే ఆనందం వస్తుందా అని. కాలుష్యాన్ని తగ్గించండి అంటూ ఏ కోర్టోలో, పర్యావరణవేత్తలో చెబితే మారే బదులు స్వయంగా మారుదాం.దీపావళినాడు ఆనందాన్ని టపాసులతో కాకుండా మిఠాయిలతో పంచుకుందాం. -
తూర్పు గోదావరిలో బాణాసంచా పేలుడు కలకలం
-
తూర్పు గోదావరిలో బాణాసంచా పేలుడు కలకలం
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ జీ వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని కాకినాడ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన పార్వతీపరమేశ్వర ఫైర్ వర్క్స్కు అనుమతులు ఉన్నాయని తెలిపారు. చిచ్చుబుడ్డులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని చెప్పారు. గత నెల 30న సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణసంచా పేలుడు చోటుచేసుకున్న తరువాత అన్ని తయారీ కేంద్రాలకు క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా.. తయారీ కేంద్రం యాజమాని అంజనేయులు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నలుగురికి మించి పని చేయిస్తున్నట్లు గుర్తించి హెచ్చరించామన్నారు. కాగా బాణసంచా పేలుడు ఘటనలోని క్షతగాత్రుల వివరాలిలా ఉన్నాయి... ఎర్రంనీడి సత్యం(50), నీలం వెంకటేష్(18), నీలం రామకృష్ణ(35), ఎర్రంనీడి బ్రహ్మం(30), వై నాగబాబు(20), వై సత్యనారాయణ(40), వై కృష్ణ మూర్తి(45), వై గోవింద రాజులు(35), గండి గోవింద్(18), వై నాగేశ్వరరావు(45)లు ఉన్నారు. బాధితులను పరామార్శించిన మంత్రి కన్నబాబు జి.వేమవరం బాణాసంచా పేలుడు బాధితులను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామార్శించారు. ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళి.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరవై రోజుల వ్యవధిలో మరో బాణాసంచా పేలుడు ఘటన జిల్లాలో చోటు చేసుకొవడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనీఖీలలో ఏ ఒక్క లోపం ఉన్నా.. వెంటనే ఆ బాణాసంచా కేంద్రాన్ని సీజ్ చేయాలని అధికారులకు మంత్రి కురసాల స్పష్టం చేశారు. చదవండి: మేడపాడులో బాణసంచా పేలుడు -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం 17 మంది మృతి
-
భారీ అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం సాయంత్రం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఊపిరాడక లేదా మంటల్లో సజీవంగా దహనమై వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. సహాయక చర్యలకు 10 ఫైరింజన్లు... బాణసంచా నిల్వ ఉంచిన గోదాములో మొదలైన మంటలు దాని పైఅంతస్తులో ఉన్న రబ్బరు ఫ్యాక్టరీలోకి విస్తరించినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలను ముమ్మరం చేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులను బయటికి పంపించారు. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపుచేశామని అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. బవానా పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సాయంత్రం 6.20 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే సంఘటనా స్థలికి 10 ఫైరింజన్లను పంపినట్లు వెల్లడించారు. మంటలను ఆర్పివేయడానికి సుమారు 3 గంటలు పట్టిందని పేర్కొన్నారు. ఆ భవనంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, దానిపైన మరో రెండు అంతస్తులున్నాయి. సెల్లార్లో ఒక మృతదేహం, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు, మొదటి అంతస్తులో 13 మృతదేహాలను కనుగొన్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీసీ మిశ్రా వెల్లడించారు. మంటలు ఎగిసిపడిన సెక్టార్5 లోని ఎఫ్–83కి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, అంబులెన్స్లను తరలించామని, ప్రమాదానికి నిర్దిష్ట కారణం ఇంకా తెలియరాలేదని డీసీపీ రజనీశ్ గుప్తా తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకిన ఓ వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఢిల్లీ మేయర్ ప్రీతి అగర్వాల్ ప్రమాదం జరిగిన చోటును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మోదీ, కేజ్రీవాల్ విచారం... ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం దురదృష్టకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. -
తుని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
-
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్లాల్ గంజ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. కాగా బాణాసంచా ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేనట్లు సమాచారం. అయినా అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.