త్రీడీలో ‘డోడో’
లండన్: అంతరించిపోయిన డోడో అనే పక్షి అస్థిపంజరం నిర్మాణాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు త్రీడీ అట్లాస్‌ను ఆవిష్కరించారు. శతాబ్దానికిపై పైగా అధ్యయనం చేయకుండా మిగిలిపోయిన రెండు డోడోల అస్థిపంజరాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీని కోసం ఐదేళ్ల పాటు శ్రమించగా ఈ అట్లాస్ తయారైంది. మానవ కార్యకలాపాల వల్ల అంతరించి పోయిన జాతులకు డోడో పక్షి మంచి ఉదాహరణ.
ఎగరలేని పావురం జాతికి చెందిన ఈ పక్షి ఎముకలపై చాలా వివరాలు అట్లాస్‌లో ఉన్నాయి. పేలియోబయాలజీలో పరిశోధనలకు ఈ అట్లాస్ పనికొస్తుందని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన జులియన్ హూమ్ చెప్పారు.