Creditor
-
అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది. కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్‌కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. -
‘రేషన్’ కోసం మైళ్ల దూరం..
కామారెడ్డి : జిల్లాలో ఒక మున్సిపాలిటీతో పాటు 323 పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 478. మరో వందకుపైగా శివారు గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లాలో 2,22,513 కుటుంబాల్లో 9,72,625 నివసిస్తున్నారు. అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి 2,46,039 ఉన్నాయి. వీరికి 578 రేషన్ షాపుల ద్వారా నెలనెలా 48.50 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అలాగే కిరోసిన్, గోధుమలు, చక్కెర సరఫరా చేస్తున్నారు. అయితే అన్ని సరుకులను ఒకేసారి అందించడం లేదు. బియ్యం, చక్కెర ఒకసారి, కిరోసిన్ మరోసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయా సరుకులను తెచ్చుకోవడానికి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రెండు సార్లు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో 30 రేషన్ షాపులు ఉండగా, బాన్సువాడ, ఎల్లారెడ్డిలాంటి పట్టణాల్లో పదికిపైగా రేషన్ షాపులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేకపోవడంతో ప్రజలు సరకుల కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 70కి పైగా హాబిటేషన్లలో రేషన్‌షాపులు లేవు. ఆయా గ్రామాల ప్రజలంతా సమీపంలో ఉన్న రేషన్‌షాప్‌లకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లేసరికి డీలర్ లేకుంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఒక్కోసారి డీలర్లు సమయానికి రాలేదంటూ రేషన్ సరకులు ఎగ్గొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో.. మారుమూల మండలాల్లోని చాలా గ్రామాల్లో రేషన్ షాపులు అందుబాటులో లేవు. జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన జుక్కల్‌లో పరిస్థితి మరీ దారుణం. జుక్కల్ మండలంలో లొంగన్, చిన్నగుళ్ల, కత్తల్వాడి, మంగాపూర్, మెబాపూర్, సిద్దాపూర్, దోస్పల్లి, బంగారుపల్లి, సావర్గావ్, శక్తినగర్, మైలార్ తదితర గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. ఈ మండలంలో 24 రేషన్ షాపులు ఉండగా 13 మంది డీలర్లు మాత్రమే ఉన్నారు. 11 దుకాణాలు ఇన్చార్జీల పాలనలో నడుస్తున్నాయి. మద్నూర్ మండలంలో 42 గ్రామాలుండగా 33 గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఉన్నాయి. గోజేగావ్, సలాబత్పూర్, ఇలేగావ్, లచ్మాపూర్, రాచూర్, చిన్న తడ్గూర్, ఖరగ్, అంతాపూర్, సోమూర్ గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేవు. ఆయా గ్రామాల ప్రజలు పక్క గ్రామంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో తుక్కోజీవాడి, ముద్దొజీవాడి గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. లింగంపేట మండలంలో గట్టుమైసమ్మతండా, ఒంటరిపల్లి, కొట్టాల్‌గడ్డ తండా, రాంపల్లి గ్రామాల ప్రజలు కూడా రేషన్ సరకుల కోసం పొరుగు గ్రామాలపై ఆధారపడాల్సిందే. గాంధారి మండల కేంద్రానికి ఆవాస గ్రామాలైన మాధవపల్లి, గుడిమెట్, పిసికిల్గుట్ట, తిమ్మాపూర్ గ్రామాల ప్రజలు గాంధారికి వెళ్లాల్సి. కరక్వాడీ గ్రామస్తులు బూర్గుల్కు వెళతారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా లాభం లేకుండాపోయిందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో రేషన్ షాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఉచిత విద్యుత్‌కు మంగళమేనా?
వ్యవసాయ కనెక్షన్లకు ఆధార్ గండం సేకరణలో అధికారులు -ఆందోళనలో అన్నదాతలు నెల్లూరు (రవాణా): దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులేస్తుంది. కొద్దిరోజుల క్రితం గ్యాస్ కనెక్షన్లు, మొన్న రేషన్‌కార్డులు, నిన్న పింఛన్లు, నేడు ఉచిత విద్యుత్.. ఇలా ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించే దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత నెల రోజులుగా వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లను విద్యుత్ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదంతా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడటానికేనా? అనే సందేహాన్ని అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులందరూ తప్పని సరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 90శాతంకుపైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,44,864 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 1,43,625 మంది రైతులు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధిపొందుతున్నారు. కేవలం 1,239 మంది రైతులు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి బిల్లులు చెలిస్తున్నారు. అంటే దాదాపు 95శాతం పైగా రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే కొద్దిరోజులుగా విద్యుత్ అధికారులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలని రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈనెలాఖరు చివరి గడువుగా పెట్టారు. దీంతో వ్యవసాయ కనెక్షన్‌ను ఎక్కడ తొలగిస్తారోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు, రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిలో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి భారీస్థాయిలో లబ్ధిదారులను తొలగించారు. ఆ మాదిరిగానే ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు కూడా తొలగించనున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో అన్నదాతలు అయోమయపరిస్థితిలో ఉన్నారు. రైతులపై అధిక భారం ఆధార్ లింకేజీ పేరుతో రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తే రైతులపై అధిక భారం పడుతుంది. ఇప్పటికే ఎరువులు, కూలీరేట్లు, పురుగుమందుల ధరలు పెరిగి వ్యవసాయం చేయాలా వద్దా? అనే సందేహంలో రైతులున్నారు. ఇప్పటికే అరకొర విద్యుత్ సరఫరాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 7 గంటలని చెబుతున్నా.. అది 5 గంటలకు మించడంలేదు. జిల్లాలో 5 హార్స్పవర్, 7 హార్స్పవర్, 10 హార్స్పవర్ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్‌ను రూ.3.75 లకు కొనుగోలు చేస్తోంది. ఉదాహరణకు 5 హార్స్పవర్ మోటారుకు గంటకు 3.8 యూనిట్లు ఖర్చవుతుంది. ఈలెక్కన 5 గంటలకు రోజుకు 19 యూనిట్లు ఖర్చవుతుంది. అంటే రోజుకు రూ.71.25 అవుతుంది. ఈలెక్కన నెలకు రూ.2,137 బిల్లు రైతులు విద్యుత్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే నెలకు రూ.2,993 బిల్లు వస్తుంది. అదే 7 హార్స్పవర్, 10 హార్స్పవర్ మోటార్లకు దాదాపు నెలకు రూ.5వేలు బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ రీతిలో నెలనెలా బిల్లు చెల్లించాల్సిన పరిస్థితే వస్తే వ్యవసాయం చేయడం కన్నా మానుకోవడం మేలన్న అభిప్రాయంలో రైతులు ఉన్నారు. ఇవేమి పట్టించుకోని విద్యుత్ అధికారులు మాత్రం ఆధార్ నంబర్‌ను సేకరించే ప్రయత్నాల్లో ముమ్మరంగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే, ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లును అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో సగానికిపైగానే కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేశాం. మిగిలినవి కూడా ఈనెలాఖరు లోపు పూర్తిచేస్తాం. - వెంకటేశ్వరరావు, టెక్నికల్ డీఈ -
స్లిప్పులపై విజి‘లెన్స్’
తుఫాన్ బాధితులకు సరకుల పంపిణీలో ‘తమ్ముళ్ల’ ప్రమేయం 12 టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చిన రేషన్ డీలర్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడ్డ వైనం సింహాచలం : రేషన్‌కార్డులు లేని తుఫాన్ బాధితులకుసరకుల పంపిణీలో సిఫార్సు స్లిప్పులు వ్యవహారం రచ్చకెక్కింది. రేషన్ దుకాణాల్లో సరుకులు తెచ్చుకోండంటూ అడవివరంలో టీడీపీ కార్యకర్తలు నడిపిన ఘటన మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది. తెలుగు తమ్ముళ్లు పంపించిన సిఫా ర్సు స్లిప్పులపై సరకులు ఇచ్చామంటూ రేషన్ డీలర్లు సైతం విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఒప్పుకోవడం విశేషం. రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలోకి వెళ్తే రేషన్ కార్డులు లేని తుఫా న్ బాధితులకు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అవసరం ఉండగా, అడవివరంలో మాత్రం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్ పేరిట స్లిప్పులు జారీ అ య్యాయి. సంబంధిత విషయాన్ని ఒక స్థానికుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. జిల్లా కలెక్టర్ యువరాజ్ ఈ విషయాన్ని పరిశీలించమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పికి ఆదేశించారు. దీనిపై ఎస్పి సురేష్‌బాబు తమ అధికారులను అడవివరంలో ఉన్న 93,94, 95 రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించమని ఆదేశించారు. విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిఈ కె.అజయ్‌కుమార్, ఏఈ సత్యకుమా ర్ రేషన్ దుఖాణాల్లో తనిఖీలు నిర్వహించారు. 93 రేషన్ దుకాణంలో 369 మందికి, 94 రేషన్‌షాపులో 33మందికి, 95 రేషన్ దుకాణంలో 105 మందికి అనధికార స్లిప్పులపై బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చినట్టు గుర్తించారు. పాశర్ల ప్రసాద్ పంపించిన సిఫార్స్ లేఖపై సరుకులు ఇచ్చామని సబంధిత రేషన్ డీలర్లే అధికారుల సమక్షంలో ఒప్పుకున్నా రు. మూడు రేషన్ దుకాణాల్లో కలిపి 12 టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులు అనధికార స్లిప్పులపై ఇచ్చినట్టు గుర్తిం చారు. 93 రేషన్ షాపులో 62 బస్తాలు, 94 షాపులో 21 బస్తాలు స్టాకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ తరుణంలో 93 రేషన్ దుకాణం వద్దకు వచ్చిన పాశర్ల ప్రసాద్ తాను స్లిప్పులు జారీ చేశానని అంగీకరించారు. డీఈ మాట్లాడుతూ సిఫార్స్ స్లిప్పులు జారీ చేసే అధికారం ఎమ్మెల్యేకే ఉందని మరెవరికీ లేదన్నారు. అనధికార స్లిప్పుల జారీ, రేషన్ డీలర్ల నిర్వాకం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. -
మొద్దు నిద్ర వదిలిస్తా
కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం ఎవరూ పట్టించుకోకపోయినా నేనున్నా తుపాను బాధితులకు వైఎస్ జగన్ భరోసా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటన సాక్షి, విశాఖపట్నం:‘సూరీడమ్మా..పోలమ్మా.. జోగమ్మా..పరసన్న.. అంతా కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. తుపాను వచ్చి నాలుగు రోజులైంది. ఇప్పటికీ బాధితులకు ప్రభుత్వం తిండి, గుడ్డ, నీరు ఇవ్వలేకపోతోంది. ఎవరు పట్టించుకున్నా. పట్టించుకోకపోయినా మీకు నేనున్నాను. మీ కు న్యాయం జరిగేలా చూస్తాను’ అని బాధితులకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్, పెదజాలరిపేట, పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి బాధితుల గోడు విన్నారు. జగన్ రాకతో ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఇల్లు కూలిపోయి, వాహనాలు పాడైపోయి, బోట్లు మునిగిపోయి ఉపాధి కోల్పోయామని, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా గంగలో కలిసిపోయాయని కన్నీరుమున్నీరయ్యారు. బాబు అయిదు నిమిషాలైనా లేడు ఉదయం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న జగన్ పోర్టులో ఎండు చేపలు అమ్ముకుంటూ బతుకుతున్న పుక్కళ్ల సత్యవతి, కొమరు అప్పాయమ్మ, పైడిపల్లి కాసులమ్మలను పరామర్శించారు. తుపానుకు బోట్లు కొట్టుకుపోయాయని, చేపలు పాడైపోయాయని వారు జగన్‌కు తెలిపారు. ‘చేపలు పోయాయి కదమ్మా ఎవరైనా వచ్చి చూశారా, ఏమైనా ఇచ్చారా’ అని జగన్ వారిని అడిగారు. ఎవరూ మీ ఇవ్వలేదని, చంద్రబాబు వచ్చి ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారని విలపించారు. అక్కడి నుంచి ముందుకెళ్లిన జగన్ సముద్రంలో మునిగిపోయిన బోట్లను పరిశీలించారు. నష్టపరిహారం కోసం ఒత్తిడి తెస్తా ప్రతి సారీ తుఫాన్లు వచ్చి ‘వెసల్స్’ మునిగిపోతున్నా తొలగించడం లేదని, వాటివల్లే తమ బోట్లు దెబ్బతింటున్నాయని మత్స్యకార సంక్షేమ నేతలు, సోనాబోటు యూనియన్ అధ్యక్షుడు పీసు అప్పారావు జగన్ వివరించారు. తమ బోట్లకు బీమా చేయించాలంటే ఏటా రూ.60 వేలు కట్టాల్సి వస్తుందని, అంత వ్యాపారం లేకపోవడంతో ఎవరూ బీమా చేయించడం లేదని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా సోనా బోటుకు రూ.25లక్షలు, ఫైబర్బోటుకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తానని జగన్ వారికి ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న బోటు మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.20 వేలతో పాటు ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. బోట్లే ఆధారంగా జీవిస్తున్న 20వేల మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారి వృత్తిని కాపాడాలన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మీ అందరితో కలిసి రోడ్డుమీద కూర్చొని ధర్నాలు చేస్తానని, అధైర్య పడొద్దని చెప్పారు. కొవిరి నాయుడు అనే యువకుడు తాను బోటు కోల్పోయానని వివరించాడు. అక్కడి నుంచి జగన్ వెనుదిరిగి వెళ్తూ మార్గమధ్యంలో కరుకు ఎర్రమ్మ అనే వికలాంగ వృద్ధురాలి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదజాలరిపేట (వాల్తేరు డిపో) చేరుకున్న జగన్ అక్కడ ప్రజల నరకాన్ని కళ్లారా చూశారు. కానూరి సరస్వతి ఇంట్లోకి వెళ్లి కూలిపోయిన పైకప్పును చూశారు. భర్త, ముగ్గురు పిల్లలు, అత్త ఆడపడుచుతో ఒకే ఇంట్లో ఉంటున్నానని, ఇప్పుడు అది కూడా పోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. తమ వందలాది బోట్లు, వలలు పోయాయని, జనం ఆకలితో అలమటిస్తున్నారని కులపెద్ద తెడ్డు పరసన్న జగన్‌కు వివరించారు. ‘బాబూ నాకు రేషన్ కార్డులేదు, ఇల్లులేదు, ముగ్గురు పిల్లలను చదివించాలనుకుంటే ముందు ఫీజు లేదని ఇప్పుడు కట్టమంటున్నారు. ఎంతమంది కాళ్లు పట్టుకున్నా ఫలితం లేదు’ అని తాటిపూడి పైడిరాజ్ అనే మహిళ తన వెతలను వివరించింది. మా జీవితాలే పోయాయంటూ ఇంటర్మీడియేట్ విద్యార్ధిని వెగలపు భార్గవి జగన్ వద్ద వాపోయింది. గెలిచినోళ్లు పట్టించుకోలేదు ‘మేం ఓట్లేసి గెలిపించినోళ్లు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వచ్చారు నాయనా’ అని సొల్లు పోలమ్మ కృతజ్ఞతను వ్యక్తం చేసింది. మొబైల్ బండిలో మెషీన్ పెట్టుకుని పాత బట్టలు కుట్టుకుని జీవించే తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఇల్లు లేదని చోపేటి సూరీడమ్మ విలపించింది. జోగులు అనే వృద్ధుడు బోట్లు పోయాయని చెప్పడంతో ‘జోగులు తాతా..మనం ఇద్దరం ప్రతిపక్షంలోనే ఉన్నాం..పోరాటం చేస్తేనే ఏమైనా సాధించుకోగలం. కనీసం జగన్ వస్తున్నాడని తెలిసి మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటుందనే నేను వచ్చాను. మన ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఒక్క నెలలో మీ సమస్యల్ని పరిష్కరిద్దాం’ అని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ తరపున ఆదుకుంటా మధ్యాహ్నం పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. సింహగిరికాలనీలో ప్రతి ఇంటికి వెళ్లారు. తొంభై ఏళ్ల రెడ్డిపైడితల్లమ్మ తన పింఛన్ తీసేశారని జగన్‌కు చెప్పుకుంది. తనకు తండ్రి లేడని, ముగ్గురు పిల్లలతో మా అమ్మ కష్టాలు పడుతోందని తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.సుధ జగన్‌కు తెలిపింది. కర్రి భవాని అనే పద్నాలుగేళ్ల బాలిక, కండేల లక్ష్మి అనే మహిళ చెవిటి, మూగ బాధితులని తెలిసి జగన్ చలించిపోయారు. వారిని పార్టీ తనపున అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. పెదగదిలి సాయిబాబా గుడి వద్ద ఇంటి గోడకూలి చనిపోయిన కుమారి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కొండలపైకి ఇరుకు సందుల గుండా కాలినడకన వెళ్లి అందరితో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని చూసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రాత్రి అంధకారంలోనూ జగన్ పర్యటించి నగరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శు లు ధర్మాన ప్రసాదరావు, గొల్లబాబూరావు, తలశిల రఘురాం, నియోజక వర్గ సమన్వయకర్తలు కోలా గు రువులు, వంశీకష్ణ, చొక్కాకుల వెంకట్రావు, కర్రి సీతారాం, తిప్పల నాగిరెడ్డి, మళ్ల విజయప్రసాద్, ఉమాశంకర్ గణేష్, పార్టీ నేతలు తైనాల విజయకుమార్, హ నోక్, సత్తి రామకష్ణారెడ్డి, కోరాడ రాజబాబు,కొయ్యా ప్రసాదరెడ్డి, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.