Critical Care Unit
-
AP: అత్యవసర వైద్యం మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసరమయ్యే క్లిష్టమైన సంరక్షణ(క్రిటికల్ కేర్)ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గుండెపోటు, కార్డియో వాస్కులర్ స్ట్రోక్స్, శ్వాసకోశ రుగ్మతలు, పాయిజన్, సెప్టిక్ షాక్, ఇతర సందర్భాల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవల కోసం నెల్లూరు జీజీహెచ్, కడప, శ్రీకాకుళం రిమ్స్‌లలో క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించింది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా వైరస్ తెలియజేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీసీబీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.71.25 కోట్లతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెల్లూరు, కడప, శ్రీకాకుళంలో ఒక్కోచోట రూ.23.75కోట్ల ఖర్చుతో రూ.71.25 కోట్లతో 50 పడకల సామర్థ్యంతో సీసీబీలను ఏర్పాటుచేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జీజీహెచ్, కడప రిమ్స్‌లో సీసీబీల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించగా, వాటికి ఆమోదం లభించింది. సీసీబీల ఏర్పాటుకు టెండర్లను పిలవాలని ఎన్హెచ్ఎం నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రతిపాదనలను పంపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో సీసీబీ ఏర్పాటుకు డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి, శరవేగంగా సీసీబీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ ‘సాక్షి’తో చెప్పారు. -
చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం
చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. మంత్రి రజిని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తోందని చెప్పారు. దీని కోసం ఇప్పటికే రూ.18.57 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 4.147 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోందని, పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండు నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రిలో ఏకంగా 95 మంది సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. 23 మంది వైద్యులే ఉంటారని చెప్పారు. అన్ని స్పెషాలిటీల వైద్యులూ ఉంటారని వివరించారు. ఆస్పత్రిని ట్రామా కేర్ సెంటర్‌గా కూడా మార్చేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ, సిమెంట్ రోడ్లు, ఫర్నిచర్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి రజిని ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. మంత్రి వెంట ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏఎస్ఎంఎస్ఐడీసీ సీఈ శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ ప్రదీప్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, ఏఎంసీ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం ఉన్నారు. వచ్చే జూన్ నాటికి బైపాస్ పూర్తి వచ్చే ఏడాది జూన్ నాటికి చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ బైపాస్‌ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. రోడ్డుకిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, దేశంలోనే ఇలాంటి రహదారి నిర్మాణం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కోటప్పకొండకు ప్రభలు వెళ్లడానికి వీలుగా రహదారికి పురుషోత్తమపట్నం వద్ద అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని ఎంటీ కృష్ణబాబును మంత్రి కోరారు. గణపవరం–అప్పాపురం రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలని, నరసరావుపేట, కోటప్పకొండ రహదారి మధ్యన బైపాస్కు రెండో వైపునా సర్వీసు రోడ్డు నిర్మించేలా ప్రతిపాదించాలని సూచించారు. ఈ మూడు అంశాలను తాను ప్రత్యేకంగా పరిశీలిస్తానని, నేషనల్ హైవేస్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కృష్ణబాబు తెలిపారు. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) -
రాష్ట్రవ్యాప్తంగా ‘కార్పొరేట్’ వైద్యం
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను నెలకొల్పేలా ప్రోత్సహిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంపై నూతనంగా తీసుకున్న అనేక నిర్ణయాలను రాష్ట్రాలకు తెలియజేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయక వైద్య సేవల్లోనూ ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురానున్నారు. ఇక జిల్లా రెసిడెన్సీ పథకం కింద పీజీ మెడికల్ విద్యార్థులంతా తప్పనిసరిగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశిం చింది. మరోవైపు ముఖ్యమైన జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. మున్ము ందు కరోనా వంటి మహమ్మారులు ఎలాంటివి విజృంభించినా వాటిని ఎదుర్కొనేందుకు వీటిని ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశముంది. వీటిని కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో నెలకొల్పుతారు. గత పదేళ్లలో 75% కొత్త వ్యాధులు జంతువులు లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ప్రబలినట్లు గుర్తించారు. గతేడాది ప్రపంచంలో కరోనాతోపాటు 60కు పైగా అంటువ్యాధు లు జనంపై దాడి చేశాయి. అందువల్ల జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రుల బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. 25 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగు దేశవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కల సాగును చేపట్టనున్నారు. రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించ డం, పండించే సమయంలో నిర్వహణ, వాటికి అవసరమైన మార్కెట్ సదుపాయాల కోసం కేంద్రం రూ. 4 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరింది. తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయుష్ గ్రిడ్... డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఆయుష్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆయుష్ రంగంలో వైద్య సదుపాయాలు కల్పించడం, ఆస్పత్రులు, లేబొరేటరీలు ఏర్పా టు చేయడం దీని ఉద్దేశం. భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ స్థాయి కల్పనకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి గ్లోబల్ సెం టర్ను ఏర్పాటు చేస్తారు. ‘జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఆయుష్ రంగంలో నైపుణ్యాభివృద్ధి జరగాలి. ప్రైవేట్‌లో ఆయుష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలి. అందుకోసం ఆయుష్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆయుష్ వైద్య విద్యలో నాణ్యత, ప్రమాణాలను పెంచడం కోసం ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాలి’అని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 100 జిల్లాల్లో... జిల్లాస్థాయి ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. అన్ని జిల్లాల్లో ప్రజారోగ్య లేబరేటరీలు అన్ని జిల్లాల్లోనూ సమగ్ర ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతారు. వాటిల్లో వైద్య పరీక్షలు చేస్తారు. 2022 డిసెంబర్ నాటికి దేశంలో లక్షన్నర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అందులో 11,024 సెంటర్లను అర్బన్ మురికివాడల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా వెల్నెస్ సెంటర్లలో 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏంచేయాలన్న దానిపై దృష్టిపెడతారు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తారు. సరైన తిండి (ఈట్ రైట్), ఫిట్ ఇండియా, యోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అత్యవసర మందులు, వైద్య పరీక్షలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అలాగే దేశంలో మరిన్ని బల్క్ డ్రగ్ పార్కులు, మెడికల్ డివైజెస్ పార్కులను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. ఫార్మా టెక్నాలజీని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది. -
నాలుగు వారాల్లో జయలలిత డిశ్చార్జ్!
-
నాలుగు వారాల్లో జయలలిత డిశ్చార్జ్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో మూడు లేదా నాలుగు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యం మెగురుపడుతోందని క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)నుంచి రెండు,మూడురోజుల్లో రూమ్‌లోకి మార్చనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి బాగా కోలుకుంటున్నారని, తన చుట్టు ఏం జరుగుతుందో ఆమె గుర్తిస్తున్నారని ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తనకు ఏం కావాలో జయలలిత అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలలిత సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సీసీయూ నుంచి బయటకు అమ్మ!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి గదిలోకి మారుస్తారట. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వివరించారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలితను (68) సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇప్పటికీ కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని, అందువల్ల మరికొంత కాలం పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల కన్సల్టెంటులు, డయాబెటాలజిస్టు, ఎండోక్రినాలజిస్టు తదితర నిపుణులు ప్రస్తుతం జయలలితకు చికిత్స అందిస్తున్నారు. చిట్టచివరి సారిగా అక్టోబర్ 21వ తేదీన ఆమె హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. అప్పుడు ఆమె మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. అమ్మను ఎప్పుడు ఆస్పత్రి నుంచి పంపాలన్నది వైద్యుల నిర్ణయమేనని పొన్నియన్ చెప్పారు. ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, మిగిలిన సమస్యలను ఆమె గదిలో ఉండగా లేదా ఇంట్లో ఉండగా నయం చేయొచ్చని ఆయన అన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత కారణంగానే ఆమె దాదాపు 18 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారని పొన్నియన్ తెలిపారు. తగిన చికిత్స తర్వాత జ్వరం తగ్గిందని, ఆ తర్వాత బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు అంతా కలిసి అమ్మను సాధారణ స్థితికి దగ్గరగా తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. -
వేదన ..రోదన
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట గర్భిణిలు, బాలింతలకు భరోసా ఇవ్వని వైనం క్రిటికల్ కేర్ యూనిట్ లేక ఇబ్బందులు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ఆస్పత్రులకు తరలింపు వైద్యం అందక ఐదు నుంచి ఏడు శాతం మంది బాలింతలు మృతి నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిపుణులైన వైద్యసిబ్బంది.. ఆధునిక పరికరాలు, వసతులు లేక ప్రసవం కోసం వస్తున్న గర్భిణులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అతిముఖ్యమైన క్రిటికల్ కేర్ యూనిట్ లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో డెలివరీ కోసం వస్తున్న గర్భిణిలకు, డెలివరీ అయ్యాక అస్వస్థతకు గురైన బాలింతలకు వైద్యం అందడం లేదు. ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో క్లిష్టమైన ప్రసవాలను సైతం చేస్తారనే పేరు, గుర్తింపు ఉన్న పేట్లబురుజు, సుల్తాన్‌బజార్, నిలోఫర్ ప్రసూతి ఆస్పత్రుల్లోని దుస్థితి ఇది. వేలాది రూపాయలు పోసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరలేని నిరుపేద మహిళలకు ఆసరాగా ఉండాల్సిన ప్రసూతి ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో మహానగరం నలుమూలల నుంచి పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం పేట్లబురుజు, సుల్తాన్‌బజార్, నిలోఫర్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే వారికి తీరని వ్యథే మిగులుతోంది. అధిక రక్తస్రావం, ఫిట్స్, డెలివరీ క్లిష్టంగా మారడం వంటి సమస్యలు తలెత్తితే చికిత్స చేసేందుకు ఈ ఆస్పత్రుల్లో అవసరమైన ‘క్రిటికల్‌కేర్ యూనిట్’ లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని ఆయా ఆస్పత్రులకు చేరుకునే లోపే బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం నమోదు అవుతున్న మాతాశిశు మరణాల్లో ఐదు నుంచి ఏడు శాతం మరణాలకు ఇదే కారణంగా చెప్పొచ్చు. సుల్తాన్‌బజార్‌లో.. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని 50 పడకల సామర్థ్యంతో 1910లో ఏర్పాటు చేశారు. 1975లో పడకల సామర్థ్యాన్ని 14 0 కి పెంచారు. ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ 400-500 మంది గర్భిణులు వస్తుంటారు. నిత్యం 230-250 మంది ఇన్‌పేషంట్లుగా చికిత ్స పొందుతుం టారు. ఇక్కడ రోజుకు సగటున 33 ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చిన బాధితుల్లో నూటికి 80 శాతం హైరిస్ ్క కేసులే. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఫిట్స్ రావడం వంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయి. మెరుగైన చికి త్స అందించేందుకు అవసరమైన క్రిటికల్ కేర్‌యూనిట్ లేక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వీరిని ఉస్మాని యా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ట్రాఫిక్ద్ద్రీని దాటుకుని ఆస్పత్రికి చేరుకునేలోపే అనేక మంది మృత్యువాతపడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే వెల్లడిస్తున్నాయి. నిలోఫర్‌లో.. నిలోఫర్ ఆస్పత్రి ప్రసూతి విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు సగటున 15 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటి లో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్య వసర పరిస్థితుల్లో వీరికి రక్తం ఎక్కిం చేందుకు అవసరై మెన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక్కడ నెలకు సగటున ఇద్దరు బాలింతలు మృతిచెందుతున్నట్లు తెలిసింది. పేట్లబరుజులో.. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ సగటున 800-900 మంది గర్భిణులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 300-400 మంది చికిత్సపొం దుతుంటారు. ఇక్కడ రోజుకు సగటున 50 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రు లు చికిత్సకు చేతులెత్తేసిన హైరిస్క్ కేసులే ఇక్కడికి ఎక్కువగా వస్తుం టాయి. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో అత్యవసర పరిస్థితిలో వచ్చిన గర్భిణులను తిరస్కరించకుండా కష్టమని తెలిసినా ఆస్పత్రిలో చేర్చుకుని పురుడుపోయాల్సి వస్తోంది. ఈ సమయంలో ఏదై నా సమస్య తలె త్తితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య బృందం ఆస్పత్రిలో లేకపోవడంతో అనేక మంది బాలింతలు మృతి చెందుతున్నారు. ఓపీ కార్డు కోసం ఐదు గంటల నిరీక్షణ శ్రీనగర్‌కాలనీ: నిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఓపీ కార్డుల కోసం రోగులు దాదాపు ఐదు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. ఆంధ్ర, తెలంగాణలోని సుదూర ప్రాంతాలను నుండి వైద్యం నిమిత్తం ఇక్కడకు వస్తున్న రోగులు నానా ఇబ్బందు లు పడుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఓపీ కార్డు కోసం నిలబడితే ఉదయం 10 నుండి 11 గంటలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్‌కు చూపించుకోవాలంటే మరో రెండు గంటలు పడుతోందని సోమవారం ఉదయం పలువురు రోగులు తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది తీరు పట్ల మండిపడ్డారు. ఓపీ కార్డుల జారీ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలను నిమ్స్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నా రు. ఇక్కడి సిబ్బం దిని, కంప్యూటర్ పరి కరాలను పెంచాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపాం క్రిటికల్‌కేర్ యూనిట్ లేక బాలింతలు చనిపోతున్న మాట వాస్తవమే. ప్రసూతి ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆస్పత్రుల వారిగా ఇప్పటికే డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రతిపాదనలు పంపాం. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. - డాక్టర్ రత్నకుమారి, సూపరింటెండెంట్, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి