వేదన ..రోదన
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట
గర్భిణిలు, బాలింతలకు భరోసా ఇవ్వని వైనం
క్రిటికల్ కేర్ యూనిట్ లేక ఇబ్బందులు
అత్యవసర పరిస్థితుల్లో ఇతర ఆస్పత్రులకు తరలింపు
వైద్యం అందక ఐదు నుంచి ఏడు శాతం మంది బాలింతలు మృతి
నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిపుణులైన వైద్యసిబ్బంది.. ఆధునిక పరికరాలు, వసతులు లేక ప్రసవం కోసం వస్తున్న గర్భిణులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అతిముఖ్యమైన క్రిటికల్ కేర్ యూనిట్ లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో డెలివరీ కోసం వస్తున్న గర్భిణిలకు, డెలివరీ అయ్యాక అస్వస్థతకు గురైన బాలింతలకు వైద్యం అందడం లేదు. ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో క్లిష్టమైన ప్రసవాలను సైతం చేస్తారనే పేరు, గుర్తింపు ఉన్న పేట్లబురుజు, సుల్తాన్‌బజార్, నిలోఫర్ ప్రసూతి ఆస్పత్రుల్లోని దుస్థితి ఇది. వేలాది రూపాయలు పోసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరలేని నిరుపేద మహిళలకు ఆసరాగా ఉండాల్సిన ప్రసూతి ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో
మహానగరం నలుమూలల నుంచి పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం పేట్లబురుజు, సుల్తాన్‌బజార్, నిలోఫర్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే వారికి తీరని వ్యథే మిగులుతోంది. అధిక రక్తస్రావం, ఫిట్స్, డెలివరీ క్లిష్టంగా మారడం వంటి సమస్యలు తలెత్తితే చికిత్స చేసేందుకు ఈ ఆస్పత్రుల్లో అవసరమైన ‘క్రిటికల్‌కేర్ యూనిట్’ లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని ఆయా ఆస్పత్రులకు చేరుకునే లోపే బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం నమోదు అవుతున్న మాతాశిశు మరణాల్లో ఐదు నుంచి ఏడు శాతం మరణాలకు ఇదే కారణంగా చెప్పొచ్చు.
సుల్తాన్‌బజార్‌లో..
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని 50 పడకల సామర్థ్యంతో 1910లో ఏర్పాటు చేశారు. 1975లో పడకల సామర్థ్యాన్ని 14 0 కి పెంచారు. ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ 400-500 మంది గర్భిణులు వస్తుంటారు. నిత్యం 230-250 మంది ఇన్‌పేషంట్లుగా చికిత ్స పొందుతుం టారు. ఇక్కడ రోజుకు సగటున 33 ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చిన బాధితుల్లో నూటికి 80 శాతం హైరిస్ ్క కేసులే. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఫిట్స్ రావడం వంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయి. మెరుగైన చికి త్స అందించేందుకు అవసరమైన క్రిటికల్ కేర్‌యూనిట్ లేక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వీరిని ఉస్మాని యా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ట్రాఫిక్ద్ద్రీని దాటుకుని ఆస్పత్రికి చేరుకునేలోపే అనేక మంది మృత్యువాతపడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే వెల్లడిస్తున్నాయి.
నిలోఫర్‌లో..
నిలోఫర్ ఆస్పత్రి ప్రసూతి విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు సగటున 15 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటి లో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్య వసర పరిస్థితుల్లో వీరికి రక్తం ఎక్కిం చేందుకు అవసరై మెన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక్కడ నెలకు సగటున ఇద్దరు బాలింతలు మృతిచెందుతున్నట్లు తెలిసింది.
పేట్లబరుజులో..
పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ సగటున 800-900 మంది గర్భిణులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 300-400 మంది చికిత్సపొం దుతుంటారు. ఇక్కడ రోజుకు సగటున 50 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రు లు చికిత్సకు చేతులెత్తేసిన హైరిస్క్ కేసులే ఇక్కడికి ఎక్కువగా వస్తుం టాయి. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో అత్యవసర పరిస్థితిలో వచ్చిన గర్భిణులను తిరస్కరించకుండా కష్టమని తెలిసినా ఆస్పత్రిలో చేర్చుకుని పురుడుపోయాల్సి వస్తోంది. ఈ సమయంలో ఏదై నా సమస్య తలె త్తితే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య బృందం ఆస్పత్రిలో లేకపోవడంతో అనేక మంది బాలింతలు మృతి చెందుతున్నారు.
ఓపీ కార్డు కోసం ఐదు గంటల నిరీక్షణ
శ్రీనగర్‌కాలనీ: నిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఓపీ కార్డుల కోసం రోగులు దాదాపు ఐదు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. ఆంధ్ర, తెలంగాణలోని సుదూర ప్రాంతాలను నుండి వైద్యం నిమిత్తం ఇక్కడకు వస్తున్న రోగులు నానా ఇబ్బందు లు పడుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఓపీ కార్డు కోసం నిలబడితే ఉదయం 10 నుండి 11 గంటలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్‌కు చూపించుకోవాలంటే మరో రెండు గంటలు పడుతోందని సోమవారం ఉదయం పలువురు రోగులు తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది తీరు పట్ల మండిపడ్డారు. ఓపీ కార్డుల జారీ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలను నిమ్స్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నా రు. ఇక్కడి సిబ్బం దిని, కంప్యూటర్ పరి కరాలను పెంచాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
క్రిటికల్‌కేర్ యూనిట్ లేక బాలింతలు చనిపోతున్న మాట వాస్తవమే. ప్రసూతి ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆస్పత్రుల వారిగా ఇప్పటికే డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రతిపాదనలు పంపాం. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే.
- డాక్టర్ రత్నకుమారి, సూపరింటెండెంట్, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి