Crooked
-
చీరకొంగు
చీరలు కట్టే రోజుల్లో వాటికి కొంగు ఉండేది. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. గుండెలని కప్పటంతో పాటు, అవసరమైతే తన చేతులు తుడుచుకోవటం, దేనినైనా గబగబా తుడిచి శుభ్రం చేయటం, కోపం లేదా పౌరుషాన్ని ప్రదర్శించటానికి కొంగుని చీరకట్టులో దోపి ముందుకు రావటం తరచుగా కనపడే ప్రయోజనాలు. అలసిపోతే మొహం తుడుచుకోవటానికి, చెమట పడితే విసురుకోవటానికి, వీలైతే పక్కనున్న భర్తకో, అత్తగారికో, పిల్లలకో కూడా ఆ భోగాన్ని కలిగించటానికి కొంగు పనికి వస్తుంది. పిల్లలు మొహం తుడుచుకోవటానికి, అన్నం తిని చేతులు కడుక్కున్నాక తుడుచుకోటానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే మగవారికో? వారు కూడా ఉత్తరీయం పైన వేసుకునే వారు. లేదంటే కనీసం తుండు గుడ్డ. ఇప్పుడు రెండూ కనపడటం అపురూపమైపోయాయి. ఇవి రెండు చేసే పనులు ఒకటే అయినా, చీర కొంగు చేసే పనులు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి. ఇంటితాళాలు, ఇనుపపెట్టె తాళాలు ఒకప్పుడు ఇంటావిడ కొంగుచివర ఉండేవి. ముఖ్యంగా బెంగాలీ స్త్రీలకి పెద్ద తాళాల గుత్తి కొంగు చివర కట్టి ఉంటుంది. అది వారు వంగ దేశపు వారు అనటానికి గుర్తు. కొంగున కట్టారు అంటే ఎంతో ముఖ్యమైనది అని అర్థం. గుడిలో ఇచ్చిన అక్షతలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఏదైనా విలువైన తాయెత్తో, రక్షరేకో, మరేదైనా కావచ్చు ఇల్లాలి కొంగులో ఒదిగి దాక్కుంటాయి. అంతేకాదు, పనికిరానివి, ఉన్నచోట పడేయ కూడనివి ఉంటే కొంగులో దాక్కుంటాయి. అంటే, విరిగిన గోళ్ళు, రాలి పడిన వెంట్రుకలు, చిన్న చిన్న గాజుముక్కలు, ముళ్ళు... ఇట్లాంటి వాటిని కూడా కొంగు భద్రంగా జాగ్రత్త చేస్తుంది చెత్తలో వేసేవరకు. కొంగుకి ఎంతటి ్రపాముఖ్యమో చూడండి – వివాహ సమయంలో బ్రహ్మముడి వేయటానికి ఇద్దరి కొంగులని కలుపుతారు. అంటే, ఒకరి కొంగులో మరొకరు ఉండమని. ఒకరికొకరు కొంగు బంగారం. కొంగు బంగారం అంటే అందుబాటులో ఉండే విలువైన, అవసరానికి ఆదుకొనేది అని అర్థం. ఒకరి అవసరాలు, కష్టసుఖాలు మరొకరు అడగనవసరం లేకుండానే పంచుకుంటూ, తీర్చుకుంటూ జీవితం గడపాలన్నది సూచన. అందుకే ఎవరైనా భార్యని అపురూపంగా చూస్తుంటే – ఆవిడ భర్తని కొంగున కట్టుకుంది అంటారు. లక్ష్మీదేవే దానికి పెద్ద ఉదాహరణ. గజేంద్రుడి కుయ్యాలించిన విష్ణువు ఉన్న వాడు ఉన్నట్టుగా బయలుదేరితే లక్ష్మీదేవి వెంట వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆవిడ కొంగు ఆయన చేతిలో ఉన్నది అని వర్ణించారు. ‘‘వివాద ్రపోత్థిత శ్రీ కుచోపరి చేలాంచల మైన వీడడు’’ అన్నారు పోతన గారు. అసలు విషయం అది కాదు. విష్ణువుని లక్ష్మీదేవి కొంగున కట్టుకుంది. ఆయన కదిలితే తానున్న కొంగు కూడా కదిలింది. పోనీ, ఆయనే పట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడైనా విష్ణువు లక్ష్మీదేవి కొంగు విడవడు అనే కదా అర్థం. భర్తని తానే కొంగున కట్టుకున్నా, కొంగుని వదలని వారూ ఉన్నారు. వారే సంతానం. కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా కొత్తవారు వచ్చినా, సిగ్గు కలిగినా అమ్మ కొంగు చాటున దాక్కుంటూ ఉంటారు. అది వారికి రక్షణ. పసితనంలో పాలు తాగుతున్నపుడు, (తల్లిపాలు అయినా, పోతపాలు అయినా) అందరి చూపు పడకుండా అడ్డుగా ఉండే అమ్మ కొంగు, ఎండ, వాన, చలి, గాలి మొదలైనవి రాగానే తమ పైన చేరి వాటి బాధ నుండి రక్షణ కలిగించే అమ్మ చీర కొంగు తమకి ఎప్పుడు భద్రతా భావన కలిగిస్తుంది అని నమ్మకం. ‘‘కొంగు చాటు బిడ్డ’’ అనే నానుడి అందుకే వచ్చి ఉంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..
చెట్లు నిటారుగా ఉంటాయి. కొన్ని వంకరగా కూడా ఉంటాయి. మరికొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్లో లేక మరేదైనా కారణం చేతనో వంకరగా ఉండటం సహజం. కానీ ఎవరో దగ్గరుండి పనిగట్టుకుని పెంచినట్లుగా అన్ని ఒకే వంకరల్లో చెట్లు ఉంటాయ?. విచిత్రం ఏమిటంటే అలా వంపు తిరిగి ఉన్నవన్నీ ఒకే జాతి మొక్కలు. ఎందకిలా జరిగింది? రీజన్ ఏంటో అని శాస్త్రవేత్తలు జుట్లు పీక్కుని మరీ పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందంటే.. పోలాండ్లోని వెస్ట్ పోమెరేనియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. దీన్ని 'వంకర అడవి' లేదా క్రూక్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చెట్టు బేస్ వద్ద వంపు తిరిగి ఉండి.. అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్ చెట్లే. పైగా చెట్లన్ని కూడా సుమారు 90 డిగ్రీ బేస్ వంపు తిరిగి ఉన్నాయి. సుమారు రెండు హెక్టార్ల భూమిలో వందకు పైగా ఉన్నో ఈ పైన్ చెట్లన్ని ఇలానే వంకరగా ఉన్నాయి. చూడటానికి ఆంగ్ల అక్షరం 'J' ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్ని కూడా ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధంల లేకుండా సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదగుతుండడం విశేషం. వాటికి ఎలాంటి చీడపీడల లేవు. పైగా ఆరోగ్యంగా ఉన్నాయి. పైన్ చెట్లు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే.. దాదాపు 1930లలో నాటిన చెట్లుగా తేలింది. ఇక్కడ చెట్లు వంపు తిరిగి ఉండటానికి మంచు తుపానులు, లేక గురత్వాకర్షణ శక్తి లేదా జన్యు పరివర్తన అని పరివిధాలుగా పరిశోధనలు చేసినా.. ఓ పట్టాన శాస్త్రవేత్తలు అసలు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. గ్రహాంతరవాసులు పని అని కొందరూ భావిస్తున్నారు. ఈ ఫైన్ చెట్లు ఇలా అసాధారణ రీతిలో ఉండటానకి కారణం స్థానికి రైతులేనని అంటున్నారు పలువురు. ఫర్నీచర్ కోసం ఇలా వంగిన చెట్లను ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ అడివిలో దాదాపు 400 పైన్చెట్లు ఉన్నాయని అవే అలా వంకర ఉన్నాయని పలు వాదనలు వినిపిస్తున్నాయి. 1970లో రెండోవ ప్రపంచ యుద్ధంలో ఆ అడవిని అలా వదిలేయడంతో ఇలా చెట్లు వంపు తిరిగి ఉన్నాయని కొందరూ చెబుతున్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థానికులకే ఈ అసాధారణ అడవికి సంబంధించిన రహస్యం తెలిసి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైనా ఇప్పటి వరకు ఆ అడవి అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది. (చదవండి: ఓర్నీ!.. ఏం రికార్డ్రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!) -
ముక్కు సూటిగా...
ముక్కు దూలం వంకర ఉన్నప్పటికీ దానివల్ల శ్వాస తీసుకోవడానికి ఎలాంటి అంతరాయాలూ లేకపోతే శస్త్ర చికిత్స చేయించనవసరం లేదు. ముక్కు దూలం వంకర వల్ల ఒకవేళ సమస్యలు ఉన్నవారైనా మందులు వాడిన తర్వాత వారికి ఉపశమనం కలుగుతుంటే శస్త్ర చికిత్స అవసరం లేదు. కోటేరులాంటి ముక్కు... అంటూ ఆ నాసికా సౌందర్యాన్ని వర్ణిస్తుంటారందరూ. అంటే నేల మీద నాగలిని నిలబెట్టినప్పుడు ఉండే ఆకృతిలా ఉంటుందని దాని అర్థం. అయితే ఆ నాగలి కర్ర అటు ఇటు వంకర్లు పోకుండా చక్కగా ఉండాలి. కానీ మన దేశంలో సుమారుగా కోటి మంది తమ ముక్కులోని రెండు రంధ్రాల మధ్య ఉండే దూలం తిన్నగా లేకపోవడంతో వచ్చే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యనే ఇంగ్లిష్లో ‘డీవియేటెడ్ నేసల్ సెప్టమ్’ అని అంటుం టారు. దీన్ని సరిచేసుకోడానికి సెప్టల్ డీవియేషన్ కరెక్షన్ సర్జరీ అనే చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ సమస్యనూ, ముక్కును సూటిగా చేసే ఆ శస్త్ర చికిత్స వివరాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ముక్కు దూలం వంకర అవడం అంటే ఏమిటి? మన రెండు ముక్కు రంధ్రాల మధ్యలో కిందివైపున ఒక పలచటి గోడలాంటి చర్మంతో పాటు పై వైపున ఎముకతో కూడిన భాగం ఉంటుంది. రెండు రంధ్రాల మధ్యగా ఉండే ఈ బ్రిడ్జి వంటి భాగాన్ని ‘నేసల్ సెప్టమ్’ అంటారు. తెలుగులో దీన్ని ముక్కు దూలం అంటారు. ఇది రెండు ముక్కు రంధ్రాలను సమానంగా విభజించి గాలి ప్రసరణ సరిగా అయ్యేందుకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ముక్కు దూలం ఒక వైపుకు వొంగి ఉండడం లేదా మూసుకుపోయి ఉండటం జరుగుతుంది. దీనినే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. ఈ సమస్యలో తీవ్రత అన్నది ముక్కు మధ్య భాగం ఎంతగా వంగి ఉందో అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. సెప్టమ్ లేదా దూలం పూర్తిగా వంగి ఉంటే వారిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతే కాకుండా కొంతమందిలో ముక్కు రంధ్రాలు పొడి బారటంతో పాటు కొన్నిసార్లు రక్తస్రావమూ కావచ్చు. ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి? ⇒ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే లక్షణాలలో ఒకటిగానీ లేదా అంతకుమించి గానీ చాలా ఎక్కువ కాలం పాటు బాధపెడుతూ ఉంటే ∙ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లయితే ∙తరచూ రక్తస్రావం అవుతుంటే ∙సైనస్ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటే ⇒నిద్ర పట్టకపోవడం జరుగుతుంటే ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే లక్షణాలలో ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. వారు మొదట క్లినికల్ పరీక్షలు చేస్తారు. ఇందులో మీ సమస్యలు, సంబంధించిన హిస్టరీ, వాడిన మందులు లేదా చికిత్స వివరాలు మొదలైనవి తెలుసుకుంటారు. అలాగే హెడ్లైట్ మిర్రర్ ద్వారా, నేసల్ స్పెక్యులమ్ ద్వారా పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి సి.టి.స్కాన్ – ముక్కు, ఎండోస్కోపి, కొన్ని సందర్భాలలో రైనోమానో మెట్రీ అనే సరికొత్త పరీక్ష ద్వారా సమస్య తీవ్రతను అంచనా వేసి, దాన్ని బట్టి అందించాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్లో కనిపించే లక్షణాలు ఇతర ముక్కు సంబంధిత సమస్యలలో కూడా గమనించవచ్చు. అందులో ప్రధానమైనవి నేసల్ పాలిప్స్ (ముక్కులో పెరిగే అదనపు కండ వంటి భాగాలు), అలెర్జిక్ రైనైటిస్, పిల్లల్లో అడినాయిడ్స్, నేసో ఫారెంజెయల్ గ్రోత్. కొంతమందిలో ముక్కుకు సంబంధించిన అలర్జీ వల్ల ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల అటువంటి వారికి నేసల్ అలర్జీకి సంబంధించిన ప్రశ్నలతో కూడుకున్న పరీక్షలతో పాటు సంబంధిత ఇతర పరీక్షలు చేయించాలి. కొన్నిసార్లు ఈ ముక్కు దూలం వంకర అనేది సైనసైటిస్, ఇతర సమస్యలతో కలిపి ఉంటుంది. అందువల్ల ఇతర సమస్యలకు సంబంధించిన పరీక్షలూ చేయించాలి. చాలావరకు సి.టి.స్కాన్ మరియు ఎండోస్కోపి (నేసల్) ద్వారా వైద్యులకు కావాల్సిన సమాచారం లభిస్తుంది. చికిత్స : మొదటగా మీకు ఉన్న లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. చాలావరకు మందులనే (నేసల్ డికంజెస్టెంట్స్, యాంటిహిస్టమిన్స్), నేసల్ స్టెరాయిడ్స్ స్ప్రే వాడతారు. ముక్కు మూసుకుపోవడం, నీరు కారడం మొదలైన లక్షణాలకు ఈ మందుల ద్వారా ఉపశమనం లభించవచ్చు. అలర్జీ సంబంధిత సమస్యలు గుర్తించనప్పుడు పైన తెలిపిన మందులు, స్ప్రేతో పాటుగా అలర్జీకి సంబంధించిన మందులు, జాగ్రత్తలు, సంబంధిత చికిత్స ఇవ్వాలి. మందులు, స్ప్రే, జీవనశైలిలో మార్పులు చేసినా ఎటువంటి ఉపశమనం కలగకపోయినా లేదా ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ఎక్కువగా ఉన్నా శస్త్ర చికిత్స ద్వారా ముక్కుదూలాన్ని సరిచేయాల్సి ఉంటుంది. చాలాసార్లు ముక్కు దూలం వంకరతో పాటుగా ముక్కులోని సైనస్లలో తరచు ఇన్ఫెక్షన్లు, నేసల్ టర్బినెట్స్లో లోపాలు, నేసల్ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా శస్త్రచికిత్స అవసరమవుతుంది.కేవలం ముక్కు దూలం వంకర సరిచేసే ప్రక్రియను సెప్టొప్లాస్టీ అంటారు. ఈ సెప్టోప్లాస్టీలో ముక్కు దూలంను రెండు ముక్కు రంధ్రాలకు మధ్యలో ఉండేలా సరిచేసి, ఎటువంటి వొంపులు లేకుండా చూస్తారు. అలర్జీ కూడా ఉన్నవారిలో ముందుగా సంబంధిత చికిత్స తర్వాతనే శస్త్రచికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా అందుకు సంబంధించిన మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక ప్రక్రియను రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ ముక్కు ఆకారం సరిగా లేనివారికి చేస్తారు. ఈ శస్త్ర చికిత్సలో ముక్కులోని ఎముక భాగం, కార్టిలేజ్ భాగాలను సరిచేయడం ద్వారా సరైన ఆకృతికి తీసుకురావడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో సెప్టోప్లాస్టీని, రైనో ప్లాస్టీతో కలిపి చేయవలసి ఉంటుంది. దీనినే సెప్టో రైనో ప్లాస్టీ అంటారు. అలానే నేసల్ టర్బినేట్స్ లోపాలు ఉన్నవారికి సెప్లోప్లాస్టీతో పాటుగా టర్బినోప్లాస్టీ కూడా చేస్తారు. క్లుప్తంగా ముక్కుదూలం వంకరకు ముందుగా పరీక్ష ఫలితాలు ఆధారంగా మందులు, స్ప్రే అలర్జీ సంబంధిత మందులు వాడి వాటి వల్ల ఫలితం లేనప్పుడు శస్త్రచికిత్సకు సూచిస్తారు. ముక్కు దూలం వంకర రాకుండా జాగ్రత్తలు పుట్టుకతో వచ్చే లోపాలను మనం ఏమి చేయలేం. కానీ... ఫుట్బాల్, క్రికెట్ వంటి ఆటలలో జరిగే ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం, ఇతర ఆటలు ఆడేటప్పుడు సంబంధిత రక్షణ పరికరాలు ధరించడం వంటి జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. కారణాలు ⇒పుట్టుకతో వచ్చేవి ∙ముక్కుకు దెబ్బ తగలడం లక్షణాలు ⇒ చాలామందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మనలో కూడా చాలామందికి ఈ సమస్య ఉండచ్చు కానీ అది ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఇబ్బంది పడేవారిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి ∙ఒకటి లేదా రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం ⇒ ముక్కు నుంచి రక్తం కారడం లేదా తరచుగా నీరు కారడం ∙ఒక వైపు ముఖంలో నొప్పి (పేషియల్ పెయిన్ ఆన్ వన్ సైడ్). ముఖ్యంగా మూసుకుపోయిన చెవి రంధ్రం వైపు భాగం ∙రాత్రి వేళల్లో లేదా నిద్రలో గురక పెట్టడం ∙ఒక వైపు మాత్రమే గాలి పీల్చుకోవడం ∙ఒక వైపే నిద్రపోవడం ∙నోటితో గాలి పీల్చుకోవడం ∙తరచుగా తలనొప్పి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్