crop sells
-
‘‘దేవుడి ఆధార్ కార్డ్ తెస్తేనే.. పంట కొంటాం’’
లక్నో: మన భారతదేశ పౌరులం అని చెప్పుకోవాలన్నా.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మనకు దక్కాలన్నా.. అంతేందుకు ఈ దేశ జనాభాలో మన పేరు ఉండాలన్నా.. ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. మనుషులం కాబట్టి మనకు ఏదో ఓ గుర్తింపు కార్డు అవసరం.. కానీ దేవుడికి కూడా ఆధార్ కావాలంటే.. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి. అసలు దేవుడి ఆధార్ కార్డ్ అడిగిన వారిని ఏమనుకోవాలి.. అయితే ఇది చదవండి. ఉత్తరప్రదేశ్ బండాలోని అత్తారా తహసీల్‌లోని కుర్హారా గ్రామానికి చెందిన మహంత్ రామ్‌కుమార్ దాస్ స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో ప్రధాన పూజారిగా మాత్రమే కాకా ఆలయ బాగోగులు చూసుకుంటుండేవాడు. ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు. 100 క్వింటాళ్లకు పైనే పండింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దాస్ తమ పంటను అమ్మడానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని.. పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డ్‌కి వెళ్లాడు. అక్కడ అధికారులు పెట్టిన కండీషన్‌కు దాస్‌కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇంతకు ఆ షరతు ఏంటంటే పంట కొనాలంటే.. భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారి ఆధార్ కార్డు తీసుకురావాలి అన్నారు అధికారులు. దానికి ఆ పూజారి ఎందుకంత షాక్ అయ్యాడంటే.. ఆ భూమి దేవుడి పేరు మీద అంటే జానకిరాముల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అంటే ఇప్పుడు దాస్ తన పంట అమ్మాలంటే శ్రీరాముడు, సీతా దేవిల ఆధార్‌కార్డ్స్ తీసుకురావాలి. చేసేదేంలేక దాస్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) సౌరభ్ శుక్లాతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని.. పంట కొనలేమని ఆ అధికారి తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగా పూజారి దాస్ గత ఏడాది 150 క్వింటాళ్ల ఉత్పత్తులను ప్రభుత్వ మండీలో విక్రయించానన్నాడు. గత కొన్నేళ్లుగా తాను దేవుడి మాన్యంలో పండిన పంటను విక్రయిస్తున్నానని, అయితే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని వాపోయాడు. ఇప్పుడు పంట అమ్మకపోతే తన కుటుంబం పస్తులతో చావడం తప్ప వేరే మార్గం లేదని కంట తడి పెట్టకున్నాడు. ఈ సందర్భంగా జిల్లాల సరఫరా అధికారి గోవింద్ ఉపాధ్యాయ మాట్లాడుతూ మఠాలు, ఆలయాల నుంచి వచ్చే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొనుగోలు విధానంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవు, గతంలో “ఖటౌని” (భూ రికార్డులు) ఆమోదయోగ్యమైనవని, అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిందని గోవింద్ తెలిపారు. చదవండి: ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు 2నిముషాల్లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి! -
ఇది సినిమా టికెట్ల క్యూ లైన్ కాదు..
ఇక్కడ చూస్తున్నవారంత సినిమా టికెట్ల కోసం లైన్ లో ఉన్నవారు కాదు..ప్రభుత్వ పరిహారం కోసం క్యూ కట్టిన వారు కాదు..వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి టోకెన్లు తీసుకోవడం కోసం బారులు తీరిన రైతులు..సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వ్యవసాయ కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే వందలాది రైతులు టోకెన్ల కోసం ఇలా క్యూ లైన్ కట్టారు సాక్షి, మిర్యాలగూడ : ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్నధాన్యం సాగు రైతుల కొంప ముంచింది. ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు మద్దతు ధర లభించక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం టోకెన్ విధానం అమలు చేస్తుండడంతో వరి కోయడానికి కూడా టోకెన్ల తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో టోకెన్ల కోసం రోజూ రైతులు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు. కష్టనష్టాల కోర్చి పంట పండించి చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. దాంతో ఈ ప్రాంతంలో 90 శాతం రైతులు సన్నధాన్యం రకాలైన పూజ, పూజా గోల్డ్, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ సాగుచేశారు. కాగా రైతులు సాగు చేసిన సన్నధాన్యాన్ని ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. దాంతో రైతులు మిల్లుల వద్ద విక్రయించుకునే పరిస్థితి వచ్చింది. చదవండి: గిన్నిస్ రికార్డ్ సాధించిన ఉత్తరాఖండ్ రైతు లభించని మద్దతు ధర.. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల సన్న రకాలకు అధికంగా తెగుళ్లు సోకాయి. దాంతో పెట్టుబడి పెరిగింది. అంతే కాకుండా వరి కోసే ముందు కూడా వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో పంట దిగుబడి భారీగా తగ్గింది. సాధారణంగా సన్నరకం వరి సాగుకు ఎకరానికి 30 బస్తాల నుంచి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 25 బస్తాలే వస్తోంది. ఈ ధాన్యానికి మద్దతు ధర లభించే పరిస్థితులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రేడ్ –1 రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,888 చెల్లించాల్సి ఉండగా మిల్లర్లు క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,750 వరకే చెల్లిస్తున్నారు. దాంతో ఈ ఏడాది సన్నరకం సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తే ఐకేపీ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాకు రూ.1,888 లభించడంతో పాటు దిగుబడి కూడా ఎకరానికి 30 బస్తాలు వచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఈ ఏడాది నష్టం వాటిల్లింది. టోకెన్ల కోసం పడిగాపులు.. సన్నరకం ధాన్యం విక్రయించుకోవడానికి అధికారులు జారీ చేస్తున్న టోకెన్ల కోసం రైతులు ఆయా మండల కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. టోకెన్ తీసుకున్న తర్వాతనే వరి కోసి మిల్లుకు ధాన్యం తీసుకురావాలని నిబంధనలు ఉన్నందున రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 10వ తేదీన 11, 12, 13వ తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడంతో గురువారం టోకెన్లు జారీ చేయడం లేదని మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. అయినా రైతులు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ల కోసం రైతులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు ఖమ్మం రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఉదయం 9 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రైతులు టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. కాగా పోలీసులు రైతులకు నచ్చచెప్పి రాస్తారోకో విరమింపజేశారు. రైతుల రాస్తారోకో వేములపల్లి : ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకు అధికారులు టోకెన్లు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఆగ్రహించిన రైతులు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గల నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. గురువారం ఉదయం టోకెన్లు పొందేందుకు రైతులు ఎంపీడీఓ కార్యాలయం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అధికారులు మాత్రం టోకెన్లను 13వ తేదీ వరకు జారీ చేసేది లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే అకాల వర్షాలకుతోడు తెగుళ్లు సోకి పంట నష్టపోయామన్నారు. పండిన కొద్దోగొప్పో ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. మిర్యాలగూడ సమీపంలో మార్కెట్‌యార్డు ఉన్నప్పటికీ సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర పొందలేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు ఇస్తామన్న అధికారులు ఒక్కరోజు మాత్రమే 150వరకు జారీ చేశారని.. ఇప్పుడు మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గి రోజుకు 50 టోకెన్లను మాత్రమే ఇస్తామనడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు రాస్తారోకో చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు టోకెన్లు అందేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా.. రైతులు ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముకునేందుకుగాను అవసరమైన మేర టోకెన్లు అందించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఏఓ రుషేంద్రమణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జవ్వాజి సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి, పెదమాం వెంకన్న, సోమయ్య, సందీప్, భరత్, నవీన్‌రెడ్డి, రవి, హరికృష్ణ, ఏర్పుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దు : కలెక్టర్ నల్లగొండ : సన్నరకం ధాన్యం అమ్ముకునే విషయంలో టోకెన్ల కోసం రైతులు తొందరపడొద్దని ప్రతి రైతుకూ టోకెన్లు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టోకెన్ల జారీకి పరిమితి లేదని, వచ్చే రెండు నెలల వరకు రైతులకు వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రోజూ టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేసారి టోకె న్లు ఇవ్వడం సాధ్యంకాదని, టోకెన్ పొందాక రైతులు వరి కోసి ధాన్యం మిల్లుకు తరలించాలని సూచించారు. రైతులు తొందరపడి రావడం వల్ల రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య తీరుతుందని పేర్కొన్నారు. -
వ్యవసాయంపై ‘కరోనా’ ప్రభావం పడకూడదు..
-
రైతులను ఆదుకోండి
ధాన్యం, మొక్క జొన్న పంట చేతికి వస్తోంది. కొనుగోలు కేంద్రాలకు రవాణా కోసం ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. రవాణాలో నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మిర్చి మార్కెట్ యార్డులను రెడ్‌జోన్, హాట్ స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేయాలి. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని.. అవసరమైతే లారీల వాళ్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి ఒప్పించాలి. ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. పంటలను మార్కెట్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలి. సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ నేపథ్యంలో బయటి మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలనుకునే రైతులకు పూర్తిగా సహాయ, సహకారాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మార్కెటింగ్ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించి, తోడ్పాటు అందించాలన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు గత రెండు సర్వేలు జరిగిన తీరు తెన్నులు, ఇప్పుడు జరుగుతున్న మూడో సర్వేపై, రైతుల పంటల కొనుగోలు అంశాలపై గురువారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు కావాలి. అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. దీనిపై నిశితంగా సమీక్ష చేయాలి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి: సీఎం వైఎస్ జగన్ ► కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం లాక్డౌన్ అమలు చేస్తున్నందున పంటల రవాణా, మార్కెటింగ్ పరిస్థితి కష్టంగా ఉంది. 50 శాతం మార్కెట్లు మూత పడ్డాయి. 20 శాతం మార్కెట్లలో కూడా లావాదేవీలు జరగడం లేదు. ► ఇదిలా ఉంటే రవాణా ఇంకో సమస్య. లారీల వాళ్లు రావడం లేదు. కరోనా భయం కావచ్చు.. రోడ్డుపైకి వస్తే పోలీసులు ఆపేస్తారని కావచ్చు.. లోడ్ ఎత్తుకోవడానికి ముందుకు రావడం లేదు. అయినప్పటికీ మనం రైతులకు సహకరించాలి. ఎలాగైనా వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. ► ఉత్పత్తి ఉన్న చోటే మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేయాలి. రైతులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశం నెరవేరేలా చూడాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి నమోదు కావాలి ► ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ► మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మందిని కూడా మూడో దపా సర్వేలో భాగం చేయాలి. ► ఆస్మా, బీపీ, సుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారిని కూడా ఇందులోకి తీసుకొస్తూ మూడో దపా సర్వే పరిధిని మరింత విస్తృతం చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి కనుక కరోనా వైరస్ సోకితే పరిస్థితి సీరియస్ అవుతుంది. అందువల్ల ఇలాంటి వారందరి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మూడో విడత సర్వేను కట్టుదిట్టంగా కొనసాగించాలి. ► మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వారినే కాకుండా, వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు చేయించాలి. ఎక్కడా తప్పు జరగడానికి అవకాశం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. ► క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉండాల్సిందే. చర్చకు వచ్చిన అంశాలు ► ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరు ప్రశంసనీయం. ► రాష్ట్రంలోని కుటుంబాల వారీగా మొదటి, రెండు దపా సర్వేపై సీఎం ఆరా. మూడోసారి ప్రారంభమైన సర్వే మరింత కట్టుదిట్టంగా, సమగ్రంగా జరగాలని సీఎం ఆదేశం. ► భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలను చేర్చి, అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించామని అధికారులు వివరించారు. ఇదీ పరిస్థితి.. ► సమీక్షా సమావేశానికి ముందు దేశంలో కోవిడ్ విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాల గురించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంకు వివరించారు. ► ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అధికారులు సీఎంకు వివరించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన, వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ.. ఈ కేసుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. ► సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఇలా.. ► రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించేలా ఏర్పాట్లు పూర్తి. ► స్వయం సహాయక సంఘాల ద్వారా అరటి పళ్ల విక్రయం ప్రారంభం. ► క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా విక్రయించేందుకు ఏర్పాట్లు ముమ్మరం. -
దళారులకు చెక్..స్వయంగా పంట అమ్మకాలు
ఆదర్శంగా రైతు రాంరెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌కు చెందిన ఆదర్శ రైతు సంగెపు రాంరెడ్డి వరి, మెుక్కజొన్న సాగుచేసేవాడు. ఏళ్లతరబడి ఈ పంటలు సాగుచేసినా పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో మార్కెట్ డిమాండ్‌ను పసిVý.ట్టి.. తొటి రైతుల కంటే మూడు నెలల ముందుగానే మొక్కజొన్నను సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పచ్చి కంకులను దళారులకు కట్టబెట్టకుండా స్వయంగా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు. కొద్దిపాటి నీటితో.. సంగెపు రాంరెడ్డి తన వ్యవసాయ బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో మే నెలలో ఎకరం భూమిలో మెుక్కజొన్న సాగును ప్రారంభించాడు. భూమిని మూడు సార్లు ట్రాక్టర్‌తో దున్నించి, స్వయంగా తయారు చేసిన వర్మి కంపోస్టుతో పాటు, డీఏపీని భూమిలో వేశాడు. బావిలో నీటిని జాగ్రత్తగా పంటకు అందిస్తూ కాపాడుకున్నాడు. జూన్‌లో వర్షాలు కురియడంతో పంట జల్లు దశకు చేరుకుంది. ఈ దశలో పంటకు మరోసారి యూరియాను చల్లాడు. దీంతో, పంట ఏపుగా పెరిగి, గింజ దశకు చేరింది. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు 20 రోజులు అక్కడే కాపలా ఉన్నాడు. ఫలితంగా మెుక్కజొన్న పంట మంచి దిగుబడినిచ్చింది. స్వయంగా అమ్మకం.. పంట చేతికి రాగానే రాంరెడ్డి జగిత్యాలలో దళారులను సంప్రదించాడు. రూపాయికి రెండు కంకులు ఇవ్వాలని వారు అన్నారు. పంట సాగుకు రూ.15 వేలు పెట్టబడి కాగా దళారులకు అమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని స్వయంగా తానే పచ్చి కంకులను విక్రయించడానికి సిద్ధపడ్డాడు. ట్రాక్టర్లో కంకులను జగిత్యాలకు తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ సీజన్లో కంకులకు మంచి డిమాండ్ ఉండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రూ.10కి మూడు నుంచి నాలుగు రూ. 20కి ఆరు నుంచి ఏడు కంకులను రాంరెడ్డి విక్రయిస్తున్నాడు. రైతులు స్వయంగా అమ్మాలి... రాంరెడ్డి. రైతు రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మితే నష్టపోవాల్సి వస్తుంది. రైతులు స్వయంగా పంటలను విక్రయిస్తే లాభాలు పొందవచ్చు. తాజాగా ఉన్నవాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతారు. ధరలు కూడా చెల్లిస్తారు. రైతులందరూ ఈ దశగా ప్రయత్నాలు చేయాలి.